పేరు (ఆంగ్లం) | vijaya lakshmi aluri |
పేరు (తెలుగు) | విజయలక్ష్మి ఆలూరి |
కలం పేరు | – |
తల్లిపేరు | లక్ష్మీ విలాసం |
తండ్రి పేరు | అట్లూరి అచ్యుతరామయ్య |
జీవిత భాగస్వామి పేరు | ఆలూరి మురళీకృష్ణ |
పుట్టినతేదీ | – |
మరణం | – |
పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా, ఉంగుటూరు గ్రామం |
విద్యార్హతలు | ఎం.బి.బి.ఎస్ |
వృత్తి | గైనకాలజిస్టు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | – |
ఈ-మెయిల్ | – |
ఫోను | – |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | సజీవ స్వప్నాలు మీరు ప్రేమించలేరు కౌమార బాలికల ఆరోగ్యం వైద్యుడు లేనిచోట THE WAR పేషెంట్ చెప్పే కథలు |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/home/search?q=Aluri%20Vijaya%20Lakshmi,https://www.amazon.in/Books-Dr-Aluri-Vijayalakshmi/s?rh=n%3A976389031%2Cp_27%3ADr.+Aluri+Vijayalakshmi |
పొందిన బిరుదులు / అవార్డులు | పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయము కీర్తి పురస్కారం *కోడూరి లీలావతీదేవి స్మారక సాహిత్య పురస్కారం *వైద్య శిరోమణి *సావిత్రీబాయి ఫూలే & దుర్గాబాయి దేశ్ముఖ్ వారసత్వ పురస్కరం |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | పేషెంట్ చెప్పే కథలు |
సంగ్రహ నమూనా రచన | వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు తమ దుఃఖాల్ని, కష్టాల్ని, అవమానాల్ని సమస్యల్ని బంధువులతోనూ, స్నేహితులతోనూ చెప్పుకోడానికి చిన్నతనంగా భావిస్తారు. తాము వారి దృష్టిలో చులకన అవుతామని, తమను వారు హేళనగా చూస్తారని భయపడతారు. తమ కోసం కొంత సమయం కేటాయించి, రవ్వంత సానుభూతిని చూపే డాక్టరు దొరికితే తమ శారీరక బాధల గురించి చెప్పడంతో పాటు మానసిక గాయాల గురించి కూడా చెప్పుకుంటారు. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనో, మంత్రం వేసినట్లు తమ సమస్యలు మటుమాయమవుతాయనే ఆశతోనో డాక్టరుతో తమ సమస్యలని చెప్పుకునేవారు అరుదు. సహనంతో తాము చెప్పేది రాగద్వేషాల కతీతంగా వినడం, ఓదార్పునీ, ధైర్యాన్నీ ఇచ్చే మాటలు చెప్పి తమ మానసిక వేదనను తగ్గించడం, నీ పక్కన నేనున్నాననే భరోసా ఇవ్వడం – ఇవే వారు సామాన్యంగా కోరుకునేది. |
విజయలక్ష్మి ఆలూరి
వివిధ సామాజిక స్థాయిలకు చెందిన రకరకాల రోగులు డా. విజయలక్ష్మి గారితో మనసు విప్పి చెప్పుకున్న బాధల్నీ, కష్టాల్నీ, చిన్న చిన్న కథలుగా రాసి, పాఠకులకు అందించమని ప్రముఖ పత్రికా సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్యశర్మగారు దాదాపు రెండు దశాబ్దాల క్రితం డా. విజయలక్ష్మిగారిని ప్రోత్సహించడం జరిగింది. ఫలితంగా ఆంధ్రజ్యోతి సచిత్రవార పత్రికలో ధారావాహింగా “పేషెంట్ చెప్పే కథలు” అచ్చయ్యాయి. వాటిని అదే పేరుతో1987లో సంకలనంగా వెలువరించారు. 2003లో మలి ముద్రణ జరిగింది. ఇప్పుడు ఈ-బుక్ రూపంలో!!
* * *
వ్యక్తులు, ముఖ్యంగా స్త్రీలు తమ దుఃఖాల్ని, కష్టాల్ని, అవమానాల్ని సమస్యల్ని బంధువులతోనూ, స్నేహితులతోనూ చెప్పుకోడానికి చిన్నతనంగా భావిస్తారు. తాము వారి దృష్టిలో చులకన అవుతామని, తమను వారు హేళనగా చూస్తారని భయపడతారు. తమ కోసం కొంత సమయం కేటాయించి, రవ్వంత సానుభూతిని చూపే డాక్టరు దొరికితే తమ శారీరక బాధల గురించి చెప్పడంతో పాటు మానసిక గాయాల గురించి కూడా చెప్పుకుంటారు. తమ సమస్యలకు తక్షణ పరిష్కారం లభిస్తుందనో, మంత్రం వేసినట్లు తమ సమస్యలు మటుమాయమవుతాయనే ఆశతోనో డాక్టరుతో తమ సమస్యలని చెప్పుకునేవారు అరుదు. సహనంతో తాము చెప్పేది రాగద్వేషాల కతీతంగా వినడం, ఓదార్పునీ, ధైర్యాన్నీ ఇచ్చే మాటలు చెప్పి తమ మానసిక వేదనను తగ్గించడం, నీ పక్కన నేనున్నాననే భరోసా ఇవ్వడం – ఇవే వారు సామాన్యంగా కోరుకునేది.
అసలు తమ సమస్యను ఒకరికి మనసు విప్పి చెప్పుకోవడంలోనే ఆ సమస్య విడిపోయినట్లు, ఏదో ఒక మార్గం కనపడినట్లు అనిపిస్తుంది. తమ చదువు, విజ్ఞానం, లోకానుభవంతో తమ సమస్యను సజావుగా విశ్లేషించి పరిష్కారం సూచించగలరనే విశ్వాసం కూడా పేషెంట్స్ తమ కథల్ని డాక్టర్కి చెప్పడానికి పురికొల్పవచ్చు.
అందుకే మరో సారి ఈ కథలు – “పేషెంట్ చెప్పే కథలు”.
———–