కాసాని ఈశ్వరరావు (Kasani eshwarao)

Share
పేరు (ఆంగ్లం)Kasani eshwarao
పేరు (తెలుగు)కాసాని ఈశ్వరరావు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరువరలక్ష్మి
పుట్టినతేదీ1938 ఫిబ్రవరి 1
మరణం2021 సెప్టెంబరు 21
పుట్టిన ఊరుపశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు
విద్యార్హతలుపాలిటెక్నిక్
వృత్తిసినీ పబ్లిసిటీ డిజైనర్
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుపాలకొల్లులో లోహశిల్పుల కుటుంబంలో పుట్టిన ఈశ్వర్ చిన్నతనంలోనే కుటుంబం ఆర్థికంగా చితికిపోవటంతో చాలా ఇబ్బందులు పడవలసి వచ్చింది. పాలిటెక్నిక్ చదువును అర్థంతరంగా ముగించుకొని, పొట్ట చేతపట్టుకుని, చేతిలో ఉన్న బొమ్మలుగీసే కళను నమ్ముకొని మద్రాసు చేరాడు. స్టూడియో కేతా అధిపతి కేతా సాంబమూర్తి, సరాగం స్టూడియో గంగాధర్ చేయూతనిచ్చి ఆదరించారు. అంచెలంచెలుగా పెరిగి, స్వంత స్టూడియో స్థాపించుకొని, నాలుగుభాషల్లో పెద్దపెద్ద నిర్మాణసంస్థలకూ, నటులకూ ప్రీతిపాత్రుడైన పబ్లిసిటీ ఆర్టిస్టుగా ఎదిగారు. 2000 సంవత్సరంలో దేవుళ్ళు చిత్రం తర్వాత విశ్రాంత జీవితం గడుపుతున్నారు.[2]

ఈశ్వర్ జీవితంలో చాలా నాటకీయత ఉంది. ఐశ్వర్యం, దారిద్ర్యం, విఫల ప్రేమ, బంధుమిత్రుల ద్రోహాలు, అవమానాలు, వీటన్నిటినీ అధిగమించి సఫలం కావడం, తనను అవమానించినవారిని సైతం ఆదరించటం యండమూరి, యద్దనపూడిల నవలలా ఉంటుంది ఆయన కథ. బాపు-రమణల సాక్షి తెలుగులో ఆయన మొదటి చిత్రం. ఆ డిజైన్లు చూసిన విజయాధినేతలు రామ్ ఔర్ శ్యామ్ చిత్రం ఆయనకు అప్పగించారు. దానితర్వాత వచ్చిన పాపకోసం చిత్రానికి ఆయన చేసిన డిజైన్లు ఆయనకు చాలా పేరు తెచ్చాయి. ఈశ్వర్ ప్రస్థానానికి ఇక అడ్డులేకుండా పోయింది. ఒక సంక్రాంతిరోజున తమిళంలో విడుదలైన ఆరుగురు పెద్ద హీరోల సినిమాలకూ పబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్ అంటే ఆయన ఆ రంగంలో ఎంత ఎత్తుకు ఎదిగాడో అర్థం అవుతుంది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక
సంగ్రహ నమూనా రచన

కాసాని ఈశ్వరరావు

ఈశ్వర్, స్వతస్సిద్ధమైన ప్రతిభ ఉన్న కళాకారుడు. చిన్నతనంలోనే ఆయన నాటకాలు వ్రాసి ప్రదర్శించేవారు; రంగాలంకరణ చేసేవారు. పరిషత్ నాటకపోటీలలో పాల్గొని బహుమతులు గెల్చుకున్నారు. ముందు చదువుకోసం, ఆ తర్వాత బతుకుతెరువుకోసం చిత్రకళను నమ్ముకున్నాక నాటకాలని వదిలేశారుకానీ, ఆ రంగంలో ఆయనకు మంచి భవిష్యత్తు ఉండేది అనిపిస్తుంది. గురు ముఖతా కాక చిత్రకళను స్వయంగానే నేర్చుకున్నారు. చిన్నతనంలో సినిమాపోస్టర్లకి నకళ్ళు గీసేవారట.

———–

You may also like...