కె. ఎన్‌. వై. పతంజలి (K. N. Y. Patanjali)

Share
పేరు (ఆంగ్లం)K. N. Y. Patanjali
పేరు (తెలుగు)కె. ఎన్‌. వై. పతంజలి
కలం పేరు
తల్లిపేరుసీతా దేవి
తండ్రి పేరుకె. వి. వి. గోపాల రాజు
జీవిత భాగస్వామి పేరుప్రమీల
పుట్టినతేదీ03/29/1952
మరణం03/11/2009
పుట్టిన ఊరువిజయనగరం
విద్యార్హతలు
వృత్తివిలేఖరి, సంపాదకుడు, రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునవలికలు: ఖాకీవనం, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలక తిరుగుడు పువ్వు, ఓ దెయ్యం ఆత్మకథ.
నవలలు: పెంపుడు జంతువులు, రాజుల లోగిళ్లు (అసంపూర్తి).
కథా సంకలనాలు: దిక్కుమాలిన కాలేజి, చూపున్న పాట.
ఇతరములు: గెలుపు సరే బతకడమెలా, జ్ఞాపక కథలు, శబాసో మొపాసా, వేట కథలు, పతంజలి భాష్యం, పతంజలి రచనలు (రచనల సంపుటి)
పతంజలి సాహిత్యాన్ని రెండు సంపుటాలుగా మనసు ఫౌండేషన్ వారు ముద్రించారు.
పతంజలి తలపులు : పతంజలి గారి గురించి ఆయన స్నేహితులు, అభిమానులు, తోటి ఉద్యోగులూ, ఇతరులూ రాసిన వ్యాసాల సంకలనం.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://kinige.com/book/Patanjali+Sahityam+Volume+1
పొందిన బిరుదులు / అవార్డులురావిశాస్త్రి రచనా పురస్కారం
చాసో స్ఫూర్తి పురస్కారం
కృష్ణవంశీ ‘సింధూరం’ సినిమాకు ఆయనకు ఉత్తమ మాటల రచయితగా బంగారు నంది అవార్డు దక్కింది
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికపతంజలి సాహిత్యం సంపుటం 1
సంగ్రహ నమూనా రచనమనసు ఫౌండేషన్ వారు వెలువరించిన “పతంజలి సాహిత్యం”లో మొదటి భాగం ఈ పుస్తకం. ఈ సంపుటంలో పతంజలి రాసిన ఖాకీవనం, పెంపుడు జంతువులు, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, అప్పన్న సర్దార్‌, ఒక దెయ్యం ఆత్మకథ, నువ్వేకాదు, రాజుల లోగిళ్ళు,

కె. ఎన్‌. వై. పతంజలి

పతంజలి సాహిత్యం మొదటి సంపుటం

మనసు ఫౌండేషన్ వారు వెలువరించిన “పతంజలి సాహిత్యం”లో మొదటి భాగం ఈ పుస్తకం. ఈ సంపుటంలో పతంజలి రాసిన ఖాకీవనం, పెంపుడు జంతువులు, రాజుగోరు, వీరబొబ్బిలి, గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, అప్పన్న సర్దార్‌, ఒక దెయ్యం ఆత్మకథ, నువ్వేకాదు, రాజుల లోగిళ్ళు ఉన్నాయి.

* * *

రచయిత గురించి

పతంజలిగా ప్రసిద్ధుడైన కాకర్లపూడి నారసింహ యోగ పతంజలి పుట్టడం, పెరగడం, చదవడం, పాత్రికేయ వృత్తిలో కాలూనడం ఉత్తరాంధ్రలోనే జరిగింది.

ప్రజాస్వామ్యానికి శాసన వ్యవస్థ, న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ, పత్రికా వ్యవస్థలని మూల స్తంభాలుగా చెబుతారు. తెలుగు రచయితలు చాలా మంది వీటిల్లో డొల్లతనాన్ని, అన్యాయాన్ని ఎత్తి చూపడానికి ఒకటో రెండో రంగాలు ఎంచుకొని రాసిన దాఖలాలు చాలా ఉన్నాయి. కాని పతంజలి మాత్రం ఈ నాలుగు స్తంభాలనీ ఏకరీతిలో ఎండగట్టి, చీల్చి చెండాడేరు. ఇలా మూలవ్యవస్థలన్నింటిపై ప్రత్యేకంగా రచనలు సాగించి రాజ్యాన్ని ఎండగట్టిన, నిలదీసిన తెలుగు రచయిత బహుశా ఈయనొక్కరే కనబడతారు.

ఉత్తరాంధ్ర నుడికారంతో, చిక్కటి వ్యంగ్యంతో సాగే ఆయన రచనలు కాసేపు నవ్వు పుట్టిస్తాయి కాని నిక్కచ్చిగా, నిజాయితీగా, నిర్భీతిగా సాగే ఆ పదునైన వాక్యాలు పోనుపోను ఆలోచనలో పడేస్తాయి, ప్రశ్నిస్తాయి, నిలదీస్తాయి, సిగ్గుతో తలవంచుకునేలా చేస్తాయి, నిలువునా దహించుకుపోయేలా చేస్తాయి. అదే ఆయన రచనల్లో గొప్పదనం. అందుకే ఆయన తెలుగు సాహిత్య ప్రవాహంలో మిగతావారికన్నా విడిగా, ప్రత్యేకంగా నిలుస్తారు.

* * *

పేరు రావాలని నేను రచనలు చేయలేదు. చెడును, దుర్మార్గాన్ని వెక్కిరిస్తే నాకు సంతోషం. అన్యాయాన్ని బజారుకీడిస్తే ఆనందం. అందుకే, నా తృప్తి కోసమే, నన్ను నేను సంతోష పరుచుకోడానికే రచనలు చేశాను. నా వ్యంగ్యంలో బాధ, క్రోధం ఉన్నాయి. అందులో స్వచ్ఛమైన ప్రతిస్పందన కనిపిస్తుంది. నాకు రాయాలనిపించింది, తెలిసిందీ నేను రాశాను…. పేరు కోసం రాయలేదు. పేరు వేరు, యశస్సు వేరు.

             పతంజలి

———–

You may also like...