వరిగొండ కాంతారావు (Varigonda kantarao)

Share
పేరు (ఆంగ్లం)Varigonda kantarao
పేరు (తెలుగు)వరిగొండ కాంతారావు
కలం పేరు
తల్లిపేరువరిగొండ సత్యవతి
తండ్రి పేరువరిగొండ రాజగోపాలరావు
జీవిత భాగస్వామి పేరువరిగొండ సూర్యప్రభ
పుట్టినతేదీ1953, మార్చి 14
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలుబి.కాం, ఎల్.ఎల్.బి
వృత్తిభారతీయ జీవిత భీమా సంస్థ విస్తరణాధికారి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుసాహచర్యం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.logili.com/home/search?q=Varigonda%20Kantha%20Rao
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికసాహచర్యం
సంగ్రహ నమూనా రచన….చాంద్రమనేన శ్రీ వికృతినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు మార్గశిరమాసే బహుళ పక్షే అష్టమ్యాం తిథౌ, స్థిర వాసరే…’ పంట కాలువ గట్టు మీద రావి చెట్టు మొదట్లో బాసింపట్టు వేసుకొని కూర్చున్న బ్రాహ్మడి గొంతు కంచు గంటలా మ్రోగుతోంది.

వరిగొండ కాంతారావు

‘….చాంద్రమనేన శ్రీ వికృతినామ సంవత్సరే దక్షిణాయనే హేమంత ఋతు మార్గశిరమాసే బహుళ పక్షే అష్టమ్యాం తిథౌ, స్థిర వాసరే…’ పంట కాలువ గట్టు మీద రావి చెట్టు మొదట్లో బాసింపట్టు వేసుకొని కూర్చున్న బ్రాహ్మడి గొంతు కంచు గంటలా మ్రోగుతోంది. 

          బారెడు పొద్దెక్కినా సూర్యుడికి బద్ధకం వదిలినట్లు లేదు. రాత్రి పడుకునేప్పుడు దోమలు కుట్టకుండా ఉండగలందులకు వేసుకొన్న మంచు తెరలింకా అలాగే ఉన్నాయి. ఆయనంటే మహానుభావుడు. ఇంట్లోంచి కాలు బయటకు పెట్టకపోయినా గడుస్తుంది. గ్రహాలన్నీ చచ్చినట్లు ఆయన చుట్టూ తిరిగి పనులు చేసికోవాల్సిందే కదా! మనిషిన్నాక గడప దాటకుండా పని నడవదు కదా!

           ‘తృప్తాస్మా! తృప్తాస్మా! తృప్తాస్మా! అదే కంచు కంఠం. మొల  లోతు నీళ్ళల్లో నుంచున్న ధర్మారావు రేవులో చివరిమెట్టు మీద ఉంచిన శిల మీద నువ్వుల నీళ్ళు ఒదుల్తున్నారు.  ‘అయిపోయిందా! ఈ ఉసిరిక పప్పు ఒంటికి తలకి రాచుకు మూడుసార్లు మునిగి ఒడ్డుకు రండి’ అంటూనే వెంటనే ‘బాబూ నాన్నగారికి సాయంపట్టండి. 

  • వరిగొండ కాంతారావు   

———–

You may also like...