| పేరు (ఆంగ్లం) | Abburi Chayadevi |
| పేరు (తెలుగు) | అబ్బూరి ఛాయాదేవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | అబ్బూరి వరదరాజేశ్వరరావు |
| పుట్టినతేదీ | 10/13/1933 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | రాజమండ్రి |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | తన మార్గం,లేఖా సాహిత్యం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://www.logili.com/short-stories/thana-margam-abburi-chayadevi/p-7488847-30158101175-cat.html#variant_id=7488847-30158101175 |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఉత్తమ రచయిత్రి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తన మార్గం |
| సంగ్రహ నమూనా రచన | నా అనుభవాలను, అనుభూతులనూ కథలుగా చెప్పాలనే తపన నా విద్యార్థి దశ నుంచీ మొదలైంది. మద్దాలి ఛాయాదేవి పేరుతో నేను రాసిన కథ ఒకటి నిజాం కాలేజ్ పత్రిక ‘విద్యార్థి’ లో 1952-53 లో ప్రచురితమైంది. కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉండేదో, అందులోనే స్త్రీలు ఆనందాన్ని ఎలా వెతుక్కున్నారో ఆ కథలో చిత్రించాను. |
అబ్బూరి ఛాయాదేవి
నా అనుభవాలను, అనుభూతులనూ కథలుగా చెప్పాలనే తపన నా విద్యార్థి దశ నుంచీ మొదలైంది. మద్దాలి ఛాయాదేవి పేరుతో నేను రాసిన కథ ఒకటి నిజాం కాలేజ్ పత్రిక ‘విద్యార్థి’ లో 1952-53 లో ప్రచురితమైంది. కుటుంబంలో పురుషాధిపత్యం ఎలా ఉండేదో, అందులోనే స్త్రీలు ఆనందాన్ని ఎలా వెతుక్కున్నారో ఆ కథలో చిత్రించాను. వైవాహిక జీవితంలోని మంచి చెడులను విశ్లేషిస్తూ రాసిన కథ ఒకటి 1955 లో ‘తెలుగు స్వతంత్ర’ లో వచ్చింది.
ఒక దశాబ్దం తరువాత రాసిన ‘ప్రయాణం’ కథతో పాఠకుల గుర్తింపు పొందాను. ‘ప్రయాణం’ కథ మొదలుకొని ‘పరిధి దాటిన వేళ’ వరకూ నా కథా ప్రస్థానంలో నాతో పాటు ప్రయాణించిన పాఠకులు గుర్తించుకున్న మైలు రాళ్ళు కొన్ని ఉన్నాయి.
———–