Share
పేరు (ఆంగ్లం)Chandraiah Itha
పేరు (తెలుగు)ఐత చంద్రయ్య
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1948, జనవరి 3
మరణం
పుట్టిన ఊరుమెదక్ జిల్లా, సిద్ధిపేట మండలం, చింతమడక గ్రామం
విద్యార్హతలుబి.ఎ
వృత్తితపాలాశాఖ
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుకథ – కమామిషు,సంధ్యావందనము,ఇంగితం,శ్రీవాసవాంబ
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకథ – కమామిషు
సంగ్రహ నమూనా రచనపుస్తక పఠనం రచనా వ్యాసంగానికి పురికొల్పింది. గత నలభయ్యేళ్ళుగా కథలు రాస్తున్నాను. కవితలు, నవలలు, నాటికలు చాలానే రాశాను కానీ కథా రచయితగానే ముద్ర పడింది.

కథనెలా రాయాలి? అని ఎంతోమంది నన్నడిగారు. తోచిన సలహాలిస్తున్నాను. నా సూచనలు పాటించి కొందరు కథా రచయితలుగా వెలిగిపోతుంటే తృప్తిగా ఉంది. జాగృతి పత్రిక నిర్వహించిన కథా రచన శిక్షణా శిబిరములో పాల్గొన్నాను. గొప్ప కథా రచయితల అనుభవాలు, సూచనలు విని కథా రచనకు మెరుగులు దిద్దుకున్నాను. కథా ఉద్యమనేత, మిత్రులు డా. వేదగిరి రాంబాబు గారు నిర్వహించిన కొన్ని సదస్సుల్లో పాల్గొన్నాను. భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని భారత ప్రభుత్వం నిర్వహించిన కథా కార్యశాలలో రెండు కథలు సమీక్షించాను. కథా రచనలో ఉద్ధండులైన వాకాటి పాండురంగారావు, మధురాంతకం నరేంద్ర, కప్పగంతుల మల్లికార్జున రావులతో సభల్లో పాల్గొని ఆశీస్సులందుకున్నాను. కొన్ని సంస్థలు, పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులందుకున్నాను.

ఐత చంద్రయ్య

పుస్తక పఠనం రచనా వ్యాసంగానికి పురికొల్పింది. గత నలభయ్యేళ్ళుగా కథలు రాస్తున్నాను. కవితలు, నవలలు, నాటికలు చాలానే రాశాను కానీ కథా రచయితగానే ముద్ర పడింది.
కథనెలా రాయాలి? అని ఎంతోమంది నన్నడిగారు. తోచిన సలహాలిస్తున్నాను. నా సూచనలు పాటించి కొందరు కథా రచయితలుగా వెలిగిపోతుంటే తృప్తిగా ఉంది. జాగృతి పత్రిక నిర్వహించిన కథా రచన శిక్షణా శిబిరములో పాల్గొన్నాను. గొప్ప కథా రచయితల అనుభవాలు, సూచనలు విని కథా రచనకు మెరుగులు దిద్దుకున్నాను. కథా ఉద్యమనేత, మిత్రులు డా. వేదగిరి రాంబాబు గారు నిర్వహించిన కొన్ని సదస్సుల్లో పాల్గొన్నాను. భారత స్వాతంత్ర్య స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని భారత ప్రభుత్వం నిర్వహించిన కథా కార్యశాలలో రెండు కథలు సమీక్షించాను. కథా రచనలో ఉద్ధండులైన వాకాటి పాండురంగారావు, మధురాంతకం నరేంద్ర, కప్పగంతుల మల్లికార్జున రావులతో సభల్లో పాల్గొని ఆశీస్సులందుకున్నాను. కొన్ని సంస్థలు, పత్రికలు నిర్వహించిన కథల పోటీల్లో బహుమతులందుకున్నాను.
తెలుగు కథా సాహిత్యం తీరుతెన్నుల గురించి వ్యాసాలు రాశాను. అవి పత్రికల్లో చోటు చేసుకున్నాయి. కొత్తగా కథలు రాయాలనుకున్న వారి సందేహాలు విన్నాను. అనుభవములో ఎన్నో నేర్చుకున్నాను. కథా రచన గురించి వర్థమాన రచయితలైన మిత్రులకు అవగాహన కల్పించాలనిపించింది. పత్రికల్లో వచ్చిన వాటిని “కథ రాయడమెలా?” వ్యాసానికి జోడించి “కథ – కమామిషు” వెలువరిస్తున్నాను.
ఇది సమగ్రం కాకపోవచ్చు, చిన్న ప్రయత్నమే కావచ్చు. దీనిని చదివిన ఎవరైనా, ఏవైనా సలహాలిస్తే స్వాగతిస్తాను. వ్యాసాలకు, పత్రికల్లో చోటిచ్చిన సంపాదకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ…
– ఐతా చంద్రయ్య

———–

You may also like...