| పేరు (ఆంగ్లం) | Vegunta Mohan Prasad |
| పేరు (తెలుగు) | వేగుంట మోహన ప్రసాద్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | మస్తానమ్మ |
| తండ్రి పేరు | సుబ్బారావు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1/5/1942 |
| మరణం | 8/3/2011 |
| పుట్టిన ఊరు | పశ్చిమగోదావరి జిల్లాఏలూరు మండలం వట్లూరు గ్రామం |
| విద్యార్హతలు | ఎం. ఏ |
| వృత్తి | ఇంగ్లీషు లెక్చరర్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | చితి-చింత పునరపి రహస్తంత్రి నిషాదం సాంధ్యభాష బతికిన క్షణాలు (జీవిత చరిత్ర) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆయన తొలి కవితా సంకలనం చితి- చింతకు 1969లో ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు వచ్చింది. చివరి కవిత్వం నిషాదం. దీనికి తణికెళ్ల భరణి అవార్డు లభించింది. |
| ఇతర వివరాలు | ప్రముఖ కవి, రచయిత, సాహితీ వేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. ‘మో’ పేరుతో సాహితీలోకంలో సుప్రసిద్ధులైన ఈయన తెలుగు ఆంగ్ల సాహిత్యాల్లో ప్రతిభావంతుడిగా పేరొందాడు . ఆయన తాడికొండ మండలం లాంలో జన్మించారు. స్వస్థలం ఏలూరు సమీపంలోని వట్లూరు . తండ్రి వెంకట కనకబ్రహ్మం టీచర్. ఆంగ్ల సాహిత్యంలో ఎం.ఏ. పట్టా పొందాడు. విజయవాడ లోని సిద్ధార్థ కళాశాలలో ఆయన ఇంగ్లీష్ లెక్చరర్‌గా పనిచేశాడు. అంతకు ముందు మూడేళ్లపాటు నైజీరియాలో ఆంగ్లోపాధ్యాయుడిగా పనిచేశాడు. చివరి దశలో ఆయన కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయం అనుసృజన (అనువాద) శాఖకు అధిపతిగా పనిచేశాడు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మో సారాంశం |
| సంగ్రహ నమూనా రచన | మో’ కవిత్వమంతా సగటు వ్యక్తి ఆత్మిక ప్రపంచపు సంక్షోభానికి వ్యక్తీకరణ. సంక్షోభం ఫలితంగా వ్యక్తి గురయ్యే వేదనకు అక్షరరూపం. అస్తిత్వ ఆందోళనలో వున్న వ్యక్తి అస్థిరతకు స్థిర రూపం. యాంత్రిక ప్రపంచంలో నిర్లిప్తంగా మిగిలిన వ్యక్తి అర్థరాహిత్యపు అస్తిత్వాన్ని గురించిన ఆక్రందనల ఆవిష్కరణ ‘మో’ సారాంశం. |
వేగుంట మోహన ప్రసాద్
మో’ కవిత్వమంతా సగటు వ్యక్తి ఆత్మిక ప్రపంచపు సంక్షోభానికి వ్యక్తీకరణ. సంక్షోభం ఫలితంగా వ్యక్తి గురయ్యే వేదనకు అక్షరరూపం. అస్తిత్వ ఆందోళనలో వున్న వ్యక్తి అస్థిరతకు స్థిర రూపం. యాంత్రిక ప్రపంచంలో నిర్లిప్తంగా మిగిలిన వ్యక్తి అర్థరాహిత్యపు అస్తిత్వాన్ని గురించిన ఆక్రందనల ఆవిష్కరణ ‘మో’ సారాంశం.
‘మో’ కవిత్వమంతా మనిషి స్వప్నాలకు, భ్రమలకు, వైఫల్యాలకు సంబంధించిన ఒప్పుకోళ్ళు(కన్ఫెషన్స్), వర్తమాన ప్రపంచంలో ధ్వంసమయిపోయిన కమ్యూనిటేరియన్ విలువల గురించి, వాటి స్ధానంలో రూపుదిద్దుకున్న కృతిమత్వాన్ని గురించీ, మృత్యువు, ఒంటరితనం, హత్యలు, జబ్బులు, ఆర్ధిక, ఆత్మిక అవినీతి, నిజాయితీ లేనితనం లాంటి విషయాలన్నీ ఆయన కవతా వస్తువులయ్యాయి. ఇన్ని రకాల భీభత్సాలతో కూడుకున్న వాస్తవికతనుంచి నిరంతరం పారిపోవడంలో వున్న ధైర్యాన్ని గురించి ఆయన రాశారు. మనం నిరంతరం రూపొందించుకుంటున్న ఆదర్శాలు కూడా ఈ పారిపోయే ప్రయత్నంలో ముందుకొచ్చినవేనని ఆయన భావించారు. ఈ భావవ్యక్తీకరణను ఆయన తాత్వికంగా కాక కవితాత్మకంగా ప్రతిబింబించారు. ‘మాయాదేవి స్వప్నం’ (పునరపి) కవితల్లో ఈ విషయాలు చాలా స్పష్టంగా తెలుస్తాయి.
———–