| పేరు (ఆంగ్లం) | Puttaparthi Kanakamma |
| పేరు (తెలుగు) | పుట్టపర్తి కనకమ్మ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | పుట్టపర్తి నారాయణాచార్యులు |
| పుట్టినతేదీ | 7/21/1922 |
| మరణం | 6/5/1905 |
| పుట్టిన ఊరు | ప్రొద్దుటూరు |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | యశోధర, పశ్చాత్తాపం, విషాదగానం, రాముడు ఆరాధ్య దైవం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://archive.org/details/in.ernet.dli.2015.329551 |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | ఈమె సాహిత్యం మీద మక్కువతో భర్తకు తెలియకుండా కవిత్వం రాస్తుండేవారు. వాటిని ఒక ట్రంకుపెట్టెలో భద్రంగా ఉంచేది. ఒకనాడు పుట్టపర్తి వారు ఆ కవితల్ని చూసి ఆమె భావ పరిపక్వతకు, భాషా సౌందర్యానికి మురిసిపోయారు. ఆమె వద్దంటున్నా వాటిని వివిధ పత్రికలకు పంపారు. అవి ప్రచురించబడి లోకానికి ఆమె కవయిత్రిగా తెలిసింది. యశోధర, పశ్చాత్తాపం, విషాదగానం వంటి కవితా ఖండికలను కలిపి అగ్నివీణ పేరుతో పుట్టపర్తివారు వెలువరించారు.రామాయణమామెకు ఇష్టమైన కావ్యం రాముడు ఆరాధ్య దైవం. వాల్మీకి రామాయణమును దాదాపు అయిదువందల పర్యాయాలు ఆమె పారాయణం చేసారు. వివిధ దైవాలపై చక్కని కృతులను భర్తతో కలిసి వ్రాసారు అవి అన్ని ఆకాశవాణి కేంద్రాలలోనూ ఎన్నో సంవత్సరాలు ప్రసారమయ్యాయి.ఆమె సామాజిక స్పృతతో వరకట్నానికి వ్యతిరేకంగా కవితారచన చేశారు. ఈమె సంస్కృతంలో శ్రీరామ సుప్రభాతం రచించారు.అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమి వారు 1974లో ఈమెను ఉత్తమ కవయిత్రిగా సన్మానించారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | గాంధీజీ మహాప్రస్థానం |
| సంగ్రహ నమూనా రచన | – |