| పేరు (ఆంగ్లం) | N.S.Prakasa Rao |
| పేరు (తెలుగు) | ఎన్.ఎస్.ప్రకాశరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 12/18/1947 |
| మరణం | 1973 |
| పుట్టిన ఊరు | విశాఖపట్టణం లో జన్మించాడు. |
| విద్యార్హతలు | కెమికల్ ఇంజనీరింగ్ లో పీ.హెచ్.డి |
| వృత్తి | కథా రచయిత |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | నిషీ – మహిషీ, పేపర్ టైగర్, రగులుతున్న రాక్షసిబొగ్గు, పగ, దరమ పెబువులు, దేవుడు చేసిన మేలు, దేవుడి నిజాయితీ, మంచి, సోల్‌మెండర్, మొదటి రాత్రి, ఫ్రెండ్స్ మొదలైన కథలున్నాయి. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://kathanilayam.com/story/pdf/15803 |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఎన్.ఎస్.ప్రకాశరావు |
| సంగ్రహ నమూనా రచన | నువ్వులేవు నవ్వులు చిందించేవు పువ్వులు అందించావు కదలెన్నో పండించావు కలలెన్నో సృష్టించావు మెరుపులు మెరిపించావు ఆశలు చిగురించావు మెరుపులా మాయమయ్యావు |
ఎన్.ఎస్.ప్రకాశరావు
- విశాఖ రచయితల సంఘంలో క్రియాశీలక సభ్యుడుగానూ, కొన్నేళ్ళు కార్యదర్శిగానూ పనిచేసాడు.
- విరసం పుట్టినప్పటినుండి అందులో క్రియాశీలకంగా పనిచేస్తూ నిబద్దతతో ఉండేవాడు.
- వివాహం జరిగిన మూడు నెలల్లోనే ప్రమాదానికి గురియై మరణించాడు
- ఈయన గురించి నిషారా పేరుతో రావిశాస్త్రి రాసిన గేయం 6-7-1973 న ఆంధ్రజ్యోతి వారపత్రికలోనూ, 15-8-1973 న ప్రజా సమస్యల లోనూ, జూలై 1973 న సృజన వారపత్రిక లోనూ ప్రచురితమైంది.
వాటిలో కొన్ని వాఖ్యాలు
నువ్వులేవు
నవ్వులు చిందించేవు
పువ్వులు అందించావు
కదలెన్నో పండించావు
కలలెన్నో సృష్టించావు
మెరుపులు మెరిపించావు
ఆశలు చిగురించావు
మెరుపులా మాయమయ్యావు
- ఈయన కథల్లో పేపర్ టైగర్ నుండి చిన్న ముక్క :
నరసింహంగారింటికి రికమండేషన్తో బయలుదేరిన వరప్రసాద్ దారిలో కొట్టిన వర్షానికి తడిసి అతుక్కుపోయిన చొక్కాతో, ఎత్తుగా దువ్విన జుట్టు అణగారిపోయి నూనె, నీళ్ళతో కలసి ముఖమంతా జిడ్డులా తయరైతే నరసింహం గారింటి వరండాలోకొచ్చిన అతడు రుమాలుతో తల తుడుచుకోవాలో, మొహం తుడుచుకోవాలో చేతులు, తుడుచుకోవాలో తేల్చుకోలేకపోతూ కాలింగ్ బెల్లు కొడతాడు.
తలుపు తియ్యగానే చానమచాయవాడు, జిడ్డుమోమువాడు, రెండుపదుల వయసువాడు, బక్కపలుచనివాడైన ప్రసాదు కనిపిస్తాడు. అతని రూపురేఖా విలాసాలు చూసి, లోనికి రమ్మనాలో బయటుండమనాలో తేల్చుకోలేక నిల్చున్న నరసింహం గారికి లెటరందిస్తాడు.
స్వతహాగా నరసింహంగారికి ముఖంలో రంగులు మార్చడంలో మంచి ప్రాక్టీసు ఉంది. ఆయన తన మనవడితో ఆడుకుంటూ ఎంతగా బోసినవ్వులు చిందిస్తాడో, అప్పుడే పని కుర్రాడితో అంతకటువుగానూ మాట్లాడుతాడు. తన క్లయింట్లతో ఎంత మృదువుగా మాట్లాడతాడో తన రైతులతో అంత కర్కశంగా మాట్లాడుతాడు. ఆయా సంధర్భాలకు తగినట్టుగా గంభీరంగా, ప్రసన్నంగా లేదా ప్రసన్న గంభీరంగా, గంభీర ప్రసన్నంగా మార్చుకుంటుంటాడు. అయినప్పటికీ వరప్రసాద్ అవతారం వలన తెలియకుండానే ఆయనకు అలవాటుకాని అయోమయపు రంగు వచ్చింది.
———–