కపిల రాంకుమార్ (kapila Ramkumar)

Share
పేరు (ఆంగ్లం)kapila Ramkumar
పేరు (తెలుగు)కపిల రాంకుమార్
కలం పేరు
తల్లిపేరువెంకట విజయలక్ష్మి
తండ్రి పేరుశ్రీరామమూర్తి
జీవిత భాగస్వామి పేరుజానకి
పుట్టినతేదీ1/31/1952
మరణం
పుట్టిన ఊరుపెంట్లం గ్రామం, చంద్రుగొండమండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
విద్యార్హతలు
వృత్తికవి, ప్రభుత్వ ఉద్యోగి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలునగారా
కొత్తగాలి
జనపద్యం
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుఆంధ్ర ప్రదేశ్‌ ఆరోగ్య & వైద్య శాఖా వారిచే పాటకు బహుమతి
ఆంధ్ర ప్రదేశ్‌ టైపిస్ట్స్‌ & స్టెనోగ్రాఫర్స్‌ అసీసియేషన్‌, ఖమ్మం వారిచే సన్మానం
కల్లూరు సాహితీ సాంస్కృతిక సంస్థ వారిచే సన్మానం
యాక్టివ్‌ స్వచ్ఛంధ సంస్థ కల్లూరు వారిచే సన్మానం
జన విజ్ఞాన వేదిక ఖమ్మం వారిచే సన్మానం
ఇతర వివరాలుఖమ్మం కవులచే ఖమ్మం శ్రీశ్రీ అని పిలిపించుకుంటున్న కపిల రాంకుమార్ తెలుగు కవులలో ఒకరు మరియు రంగస్థల నటుడు. అంతర్జాలంలో, కవిసంగమం లో చురుగ్గా కవితలను రాస్తున్నారు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకవిత్యం
సంగ్రహ నమూనా రచనజోహార్‌ కాళోజీ|| నేడు కాళోజి వర్థంతి:||కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||
మొహమాటంలేకుండా
ఏకిపారేసుడులో పెద్దన్న
తప్పుడు పాలకులెవరైనా
తన మాటల వేటుకు తప్పించుకోలేరన్న!
రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయమన్న,
దూర్జటికి కంటే నాలుగాకులు మస్తుగ సదివిండు!

కపిల రాంకుమార్

జోహార్‌ కాళోజీ|| నేడు కాళోజి వర్థంతి:||కపిల రాంకుమార్ ||తెలంగాణా దూర్జటి కాళోజీ||
మొహమాటంలేకుండా
ఏకిపారేసుడులో పెద్దన్న
తప్పుడు పాలకులెవరైనా
తన మాటల వేటుకు తప్పించుకోలేరన్న!
రాజుల్ మత్తులు వారిసేవ నరక ప్రాయమన్న,
దూర్జటికి కంటే నాలుగాకులు మస్తుగ సదివిండు!
పోతనకుమల్లే రాచరికపు భజన కాదని
ప్రజాస్వామ్యమే వంటపట్టించుకున్నోడు గనుకే
ప్రజా కైతల సేద్యం చేసిండు!
శిశుపాలుని తప్పులలెక్కపెట్టి
సర్కారుచెవుల సిల్లువడాల్సిందే కాని
గిసుమంత కూడ వెనుకడుగేయలేదు!
సప్పుడు ఎక్కువే – ఘాటైన మాటలతో
ముక్కు సూటిదనం చూపుకూడా సూదంటిరాయే!
ప్రజల సోయి యాదమరిస్తే
బొందపెట్టేది నిక్కమన్నాడు
కౌన్సిల్లో సర్కారుకు చాకిరేవు పెట్టిండు
బొక్కసానికి చిల్లుపెడితే
డొక్క చించుతానన్నాడు
కాళమునకు ఖలేజా అద్దినట్టుండే
కైతల రైతుబిడ్డ కాళోజి!
నోరెత్తటం ఏ సర్కారుకీ యిష్టముండదు
నోరెత్తకపోతే కాళోజి కలం నడువదు!
రెంటికెపుడూ గొడవే
పోరాటంచేయకతప్పదు
పోయేవి బానిస సంకెళ్ళు అన్నట్టు
రాష్ట్ర, దేశ పాలకవర్గాలపై
పదునెక్కన పాటలా
అదునుచూచి పేలే తూటాలా
ఎందరికో స్ఫూర్తినిచ్చిండు!
బడుల యిజ్జతు, దవఖాన్ల తీరు,
చట్టసభల తగువులాట
నీటికాడ, కూటికాడ
బతుకుతెరువు పాకులాట
పెత్తనాల తగాదాల గొడవెలెన్నో
నీ, నా గొడవగా చేదీపమందించి
దోపిడి చేస్తే దోస్తానాలుండవు
తోటోడైనా సంజోతాలుండవ్
ఏ పార్టీ వాడైనా వాడు ఏ పాటివాడో
తీరుమానం చేయాలంటాడు!
మంచి సబ్బరిలేకుండా
పాలన చేసేటోడు
మావోడైనా, మీవోడైనా
మావో చెప్పినా మార్క్స్ చెప్పినా
మంచి మంచే, చెడు చెడే
బేరీజువేసుకోమన్నాడు!
గసుమంటోడు కాబట్టే
తాను బతికున్నన్నాళ్ళు
మూడోనేత్రంతోనే లోకాన్ని చూసాడు!
మనలనీ చూడమన్నాడు!
ప్రజల పక్షం వహించమన్నాడు!.

———–

You may also like...