పేరు (ఆంగ్లం) | Chittarvu Madhu |
పేరు (తెలుగు) | చిత్తర్వు మధు |
కలం పేరు | – |
తల్లిపేరు | – |
తండ్రి పేరు | – |
జీవిత భాగస్వామి పేరు | – |
పుట్టినతేదీ | 5/10/1950 |
మరణం | – |
పుట్టిన ఊరు | మామిడికోళ్ళ (గుడ్లవల్లేరు దగ్గర) |
విద్యార్హతలు | వైద్య పట్టా |
వృత్తి | వైద్యులు |
తెలిసిన ఇతర భాషలు | – |
చిరునామా | విజయా మెడికల్ & హార్ట్ క్లినిక్, 2-2-23శ2 S.B.H. కాలనీ, బాగ్ అంబర్ పేట, హైదరాబాద్ – 500013 |
ఈ-మెయిల్ | – |
ఫోను | 407614275 |
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
స్వీయ రచనలు | అందమైన ఆవలింత అరుణోదయం అసురసంధ్య ఎర్రపూలు కీసరపల్లి బ్రిడ్జి జాతర నడిపించే నక్షత్రాలు నీలాంటి నువ్వు పగ ప్రేమజ్వరం |
ఇతర రచనలు | – |
ఈ-పుస్తకాల వివరాలు | – |
పొందిన బిరుదులు / అవార్డులు | – |
ఇతర వివరాలు | – |
స్ఫూర్తి | – |
నమూనా రచన శీర్షిక | మధుమేహంపై విజయపథం |
సంగ్రహ నమూనా రచన | డయాబిటిస్ (మధుమేహం) అంటే ఏమిటి? ఈ పుస్తకం ఎందుకు రాస్తున్నారు? దీన్ని గురించి సాధరణ వ్యక్తులు తెలుసుకోవాల్సిందేముంటుంది? మాములుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుని వాడుకుంటే సరిపోతుంది కదా? |
చిత్తర్వు మధు
డయాబిటిస్ (మధుమేహం) అంటే ఏమిటి? ఈ పుస్తకం ఎందుకు రాస్తున్నారు? దీన్ని గురించి సాధరణ వ్యక్తులు తెలుసుకోవాల్సిందేముంటుంది? మాములుగా డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందులు రాయించుకుని వాడుకుంటే సరిపోతుంది కదా?
ఈ సందేహాలకి సమాధానం చెప్పుకోవాల్సి వుంటుంది. నేను వృత్తి రీత్యా డాక్టర్‌ని, ప్రవృత్తి రీత్యా రచయితని. కనీసం పాతిక సంవత్సరాల నుంచి విదేశాలలోనూ మనదేశంలోనూ డయాబిటిక్ వ్యాధిగ్రస్తులని పరీక్షించి చికిత్స చేస్తున్నవాడిని. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశాన్ని ‘మధుమేహానికి రాజధాని’గా వర్ణించింది. మనం ఒక డయాబిటిస్ వ్యాధి యొక్క ‘ఎపిడమిక్’లో చిక్కుకుని వున్నాం. ఏదో ‘టీకా’లు వేసి తగ్గించగలిగే మశూచికం లాంటి వ్యాధి కాదు. అలా అని వ్యాధి వచ్చినంత మాత్రాన ప్రాణాపాయకమైనది అని నిరాశపడవలసిన భయంకరమైన మహామ్మారీ కాదు. ఇది శరీరంలో మెల్లగా ప్రవేశించి క్రమక్రమంగా శరీరాన్ని శిధిలం చేసి, కాంప్లికేషన్స్ ద్వారా వ్యాధిగ్రస్తుడిని కృంగదీసే లక్షణం కల పరిస్థితి.
అందుకనే మనం డయాబిటిస్ అనే అగ్ని పర్వతం మీద కూర్చుని వున్నాం అని అనను. ఇది మెల్లగా మెల్లగా మన మీద దాడి చేసే చల్లటి వ్యాధి. పూర్తిగా నివారించలేకపోయినా కనీసం దశాబ్దాలు తృప్తికరంగా కంట్రోల్ చేసుకోగలం. సాధారణ జీవనశైలికి ఆటంకం రాకుండా గడపగలిగే వీలున్న వ్యాధి. ఇది జీవిత విధానాన్నీ, ఆహారపుటలవాట్లనీ, ఇతర ఆచార వ్యవహారాల్నీ మార్చుకోవల్సి వున్న అవసరం కల వ్యాధి. మందులు వాడడం ఒక్కటే కాదు ఆహార నియమాల్లో మార్పులు నియంత్రణ, అవగాహన చాలా అవసరం. రోజూ ఈ విషయం పై కనీసం ఒక్కరికైనా కొత్తగా మధుమేహ వ్యాధి వచ్చిన వాళ్ళకి పరిచయ వాక్యాలుగా చెప్పవలసి వస్తోంది. కొత్తగా మీకు “డయాబిటిస్” అంటే సుగర్ వ్యధి వచ్చిందండీ” అనే దుర్వార్త చెవిన వేయడం, ఆ షాక్ నుంచి తేరుకునే లోపల ఆ వ్యక్తికి ఈ వ్యాధి గురించిన వివరాలు ఆహార నియమాలు చెప్పడం ఇదంతా ఒక అరగంట పని. వాళ్ళకి వచ్చే సందేహాలు, భయాలు నివృత్తి చేయడం వివరించి చెప్పడం ఇదంతా రోజూ చేస్తున్నదే. అదే పుస్తక రూపంలో వుంటే ఎంతో బాగుంటుందనిపించింది అందుకే ఈ ప్రయత్నం తలపెట్టాను.
– చిత్తర్వు మధు
———–