| పేరు (ఆంగ్లం) | Reddy Raghavaiah |
| పేరు (తెలుగు) | రెడ్డి రాఘవయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 4/23/1905 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా, తెనాలి |
| విద్యార్హతలు | ఎస్.ఎస్.యల్.సి. |
| వృత్తి | హిందుస్థాన్ ఎయిరోనాటిక్సులో మెకానిక్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | గాలిలో ప్రయాణం చిరుదివ్వెలు చాచా నెహ్రూ జ్ఞానులు – విజ్ఞానులు విజ్ఞానతరంగాలు విజ్ఞానవిజయాలు విజ్ఞానోదయం ఎందుకు? దివ్యమాత థెరిసా బాలలబొమ్మల ఇందిరాగాంధీ వేలంత వీరుడు మణిదీపాలు పూలపొట్లాలు[1] నేతాజీ సుభాష్ చంద్రబోస్ చంద్రశిలానగరం పిల్లల బొమ్మల తెనాలి రామకృష్ణ సంపూర్ణ హాస్యకథలు పిల్లల బొమ్మల భారతం యూరీ అలెక్స్‌యేవిచ్ గగారిన్ స్వామి వివేకానంద భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణన్ మంచిపూలు లాల్ బహదూర్ శాస్త్రి భారతరత్న రాజేంద్రప్రసాద్ బాలసాహిత్య నిర్మాతలు పిల్లల బొమ్మల ప్రపంచ అద్భుతకథలు పిల్లల బొమ్మల అక్బర్-బీర్బల్ కథలు పిల్లల బొమ్మల పరమానందయ్య శిష్యుల కథలు పిల్లల బొమ్మల విక్రమ్ భేతాళ కథలు పిల్లల బొమ్మల రామాయణం పిల్లల బొమ్మల పంచతంత్రం పిల్లల బొమ్మల గలివర్ సాహసయాత్రలు పిల్లల బొమ్మల బామ్మ చెప్పిన బంగారు నీతి కథలు పిల్లల బొమ్మల మర్యాదరామన్న కథలు బాల నీతిమాల |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | తొలికథ ‘సలహా’ (పిల్లల కథ) విశాలాంధ్ర దినపత్రికలోని ‘చిన్నారిలోకం’లో 1955 డిసెంబరులో ప్రచురించబడింది. నాటినుండి బాలల గేయాలు, గేయకథలు, పాటకథలు, సైన్స్‌కథలు… బాలసాహిత్యంపై వ్యాసాలు ఎన్నో వివిధ పత్రికలలో ప్రచురించబడ్డాయి. ఇప్పటి వరకూ వివిధ ప్రక్రియల్లో వ్రాసిన 32 పుస్తకాలు ప్రచురించబడ్డాయి. మణిదీపాలు అనే పుస్తకం ఆంగ్లంలోకి అనువదింపబడింది. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | బొమ్మలాట |
| సంగ్రహ నమూనా రచన | రంగన్నిప్పుడు నాలుగోక్లాసు చదువుతున్నాడు. అతడికి తండ్రి లేడు, తల్లి ఉంది. ఆమె రంగన్నను తండ్రి చనిపోయినప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచింది. ఆమె ముద్దుకు తన కొడుక్కు ‘రంగారావు’ అని పేరు పెట్టుకున్నా, అందరూ వాడిని ‘రంగడ’నే పిలిచేవారు. అతడి తల్లిపేరు సీతమ్మ |
రెడ్డి రాఘవయ్య
రంగన్నిప్పుడు నాలుగోక్లాసు చదువుతున్నాడు. అతడికి తండ్రి లేడు, తల్లి ఉంది. ఆమె రంగన్నను తండ్రి చనిపోయినప్పటి నుంచి ఎంతో గారాభంగా పెంచింది. ఆమె ముద్దుకు తన కొడుక్కు ‘రంగారావు’ అని పేరు పెట్టుకున్నా, అందరూ వాడిని ‘రంగడ’నే పిలిచేవారు. అతడి తల్లిపేరు సీతమ్మ. ఆమె చిన్నప్పటి నుంచీ కాయకష్టం చేయటంలో దిట్ట. అందుకని భర్త చచ్చిపోయినా కొడుకును బళ్లోకి పంపి చదివిస్తున్నది. రంగడిని చెడ్డ వాళ్ళ స్నేహంచేయకుండా చూస్తూ తనకు వచ్చిన మంచి మంచి నీతికథలు చెప్తుండేది. రోజు గడవటం కోసం తాను ధనికుల ఇళ్ళల్లో పనులు చేస్తుండేది.
ఒకనాడు హఠాత్తుగా సీతమ్మకు జ్వరమొచ్చింది. మంచంలో నుంచి లేవలేని స్థితిలో ఉంది. ఆ ఊళ్లోనే ఉన్న నాటు వైద్యుడు రెండు రూపాయలిస్తే మందిస్తానన్నాడు. ఆమె దగ్గర చెల్లి కానీ లేదు. రంగన్నకు ఆమె దుస్థితి చూచి చాలా జాలి వేసింది, పంతులు గారిని అడిగి మూడు రోజులు సెలవు తీసుకొని తనతల్లికి సపర్యలు చేస్తూ ఇంటి దగ్గరే ఉండి పోయాడు.
———–