అరిపిరాల విశ్వం (Aripirala vishwam)

Share
పేరు (ఆంగ్లం)Aripirala vishwam
పేరు (తెలుగు)అరిపిరాల విశ్వం
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరులక్ష్మీనారాయణ శాస్త్రి
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుకృష్ణా జిల్లా నడకుదురు(చల్లపల్లి)
విద్యార్హతలు
వృత్తిఅధ్యాపకుడు
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలువిదురకన్నెలు
కాలం గీస్తున్న గీతలు
రేపటి స్వర్గం
మైథిలీవల్లభ శతకం
పృథ్వీశ్వర త్రిశతి
మనస్[1]
గుహేశ్వర మహాదేవ వచనములు
ఖడ్గమాలా దర్శనము (ఆనందఘన వ్యాఖ్య)
పరావిద్య
సాధనా పంచతంత్రం (ఉపన్యాసాలు)
శ్రీగురు త్రయోపనిషత్
శ్రీ విద్యాపంచదశి
ఉపనిషత్తుల శ్రీ విద్యారహస్యాలు
పరంపరా ఉపనిషత్ కథలు
ప్రణవ సాహస్రి
హళేబీడు
ధ్యానదీపిక
కల చెరిగిపోనీకు నేస్తం
అశ్వఘోషుడు (నాటకం).
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుఅరిపిరాల విశ్వం ప్రముఖ రచయిత మరియు ఆధ్యాత్మిక గురువు. ఆయన “ఆనందఘన”గా సుప్రసిద్ధులు. ఆయన హైదరాబాద్‌ న్యూసైన్సు కళాశాలలో తెలుగు లెక్చరర్‌గా చాలాకాలం పనిచేశాడు. దేవుడిని నమ్మే మార్క్సిస్టుగా తనను తాను వర్ణించుకున్నాడు.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికఅరిపిరాల విశ్వం
సంగ్రహ నమూనా రచనపౌనఃపున్యజనుర్మృతీ కలిత సంప్రాప్తోగ్ర బాధామతిన్
ఏనః పుంజము నెంత దాల్చితినొ పోయెన్ ఱేయిచీకట్లలో
లీనంబై బ్రతుకంత నీకెదురు రాలేనోయి! నే నంధుడన్
శ్రీ నిత్యోత్సవ చిద్విలాస పరమేష్టీ మైథిలీ వల్లభా!

అరిపిరాల విశ్వం

రచనల నుండి మచ్చుతునకలు
పౌనఃపున్యజనుర్మృతీ కలిత సంప్రాప్తోగ్ర బాధామతిన్
ఏనః పుంజము నెంత దాల్చితినొ పోయెన్ ఱేయిచీకట్లలో
లీనంబై బ్రతుకంత నీకెదురు రాలేనోయి! నే నంధుడన్
శ్రీ నిత్యోత్సవ చిద్విలాస పరమేష్టీ మైథిలీ వల్లభా!
అస్మజ్జీవన గేహళీజ్వలిత దీపాంకూరముల్ దైన్య సం
విస్మర్తవ్య కథాప్రపంచమును లేపెన్ నిద్రలోనుండి – మై
భస్మోల్లేపన పాండు దీధితులు పర్వన్ నందిపై వచ్చు నీ
శా! స్మృత్యంకములో సత్యమ్ము నిలుమయ్యా! మైథిలీ వల్లభా!
(మైథిలీ వల్లభ శతకము నుండి)
పూవుం దోటలు నీలి మబ్బులు మహాంభోరాశి నిర్ఘోషముల్
తావుల్ చిమ్మెడి దక్షిణానిలము – చెంతన్ చెట్లపై పక్షులున్
నీవున్నిల్తురు – యీ స్మశానభువిలో – నిర్ణిద్ర ప్రేతాకృతుల్
ఏవో మంత్రములుచ్చరింపఁగ – విషాహిగ్రీవ! పృథ్వీశ్వరా!
ఇవె పొన్నల్ ప్రభుపాద పూజకయి – ఎన్నేండ్లిట్లుగా నిల్చెనో
ఇవె బిల్వద్రుమసంతనిల్ – చిగురుటాకే కన్నుగా బొల్చు ని
య్యవి మల్లీ వకుళామ్ర భూజములు! పర్యాప్తాశ్రుమాలా – సుమా
లివి లేమబ్బులు కుంభశీర్షములు – వ్రాలెన్ మ్రోల పృథ్వీశ్వరా!
(పృథ్వీశ్వర త్రిశతి నుండి)

———–

You may also like...