Share
పేరు (ఆంగ్లం)Sudhama
పేరు (తెలుగు)సుధామ
కలం పేరు
తల్లిపేరుఅల్లంరాజు కామేశ్వరమ్మ
తండ్రి పేరుఅల్లంరాజు కామేశ్వరరావు
జీవిత భాగస్వామి పేరుఉషారాణి
పుట్టినతేదీ11/25/1951
మరణం09/12/2024
పుట్టిన ఊరుఅనకాపల్లి ,విశాఖపట్టణం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
విద్యార్హతలుఎం.ఏ
వృత్తిప్రోగామ్‌ ఎక్జిక్యూటివ్ (ఆల్ ఇండియా రేడియో)
రచయిత
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttps://www.blogger.com/profile/06045111874322980507
స్వీయ రచనలువీచికలు’ కవితా సంకలనం 1967లో అచ్చయ్యింది.
‘మేం’ కవితా సంకలనం 1974లో మిత్రుడు డాక్టర్. నాగినేని భాస్కరరావ్ సహ కవిగా ప్రచురింపబడింది.
‘అగ్నిసుధ ‘కవితా సంకలనం 1990లో ప్రచురితమయింది.
2001లో ”సం.సా.రా.లు ” (సంస్కతి, సాహిత్యం. రాజకీయాలు) ఆంధ్రభూమి దినపత్రిక కాలం 50 వ్యాసాలతో ప్రచురితమైంది.సుమారు15 సంవత్స రాలు ఆ కాలమ్ నిర్వహించారు.
‘మనసు పావన గంగ ‘ పేరిట సుధామ రేడియో, టీ.వీ పాటలు 2010 లో పుస్తకంగా వచ్చాయి.
ఆంధ్రప్రభ దినపత్రికలో మూడు ఏళ్ళపాటు గురువారాల్లో ఎడిట్ పేజ్ లో కవిత్వరూపంలో రాసిన కాలమ్ నుంచి ఎంపికచేసిన కవితలతో ‘కవికాలమ్ ‘ 2011లో విడుదలైంది.
అలాగే 2011 లో నే ‘చిత్రగ్రంథి ‘ కవితా సంకలనం వచ్చింది.
2012 లో ‘పూతరేకులు’ పేర జోక్స్ సంకలనం వెలువరించారు.
2018 లో ‘మన తెలంగాణ ‘ పేర 2015-16 లో ‘సుధామ’యోక్తి’ పేర మనతెలంగాణ దినపత్రిక లోని కాలమ్ వ్యాసాలు పుస్తకం గా వెలువడింది
ఆంధ్రభూమి వార పత్రికలో 88 వారాల పాటు పాఠకులను అలరించిన ‘ రామాయణ పథం’ పజిల్ బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి అభినందన వచనాలతో 2018 జూలై లో ప్రశ్నోత్తరమాలికా గ్రంథం గా వెలువడింది
సుధామ రాసిన పీఠికలు -ముందుమాటలు ‘భూమిక ‘ పేర 470 పేజీల బృహద్గ్రంథం గా వారి శ్రీమతి అల్లంరాజు (సూకూరు) ఉషారాణి సంపాదకులుగా 25 నవంబర్ 2018 న ఆవిష్కరింప బడింది .
‘మన పండుగలు’, ‘ ఈసఫ్ నీతికథలు’.’ పురాణ బాలలు ‘, విజయవాడ ప్రచురణ సంస్థ కై రాయగా పుస్తకాలుగా వెలువడ్డాయి.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1983 లోనే ఆకాశవాణి సర్వ భాషా కవిసమ్మేళనానికి తెలుగుకవిగా ఎంపికై జాతీయకవిగా పాల్గొన్నారు.
అగ్నిసుధ కవితా సంకలనానికి 1990 కలహంసి, ఉమ్మడిశెట్టి సాహితీ అవార్డులు లభించాయి.
2004లో తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ గ్రంథంగా సం.సా.రా.లు (సంస్కతి, సాహిత్యం. రాజకీయాలు)సాహితీ పురస్కారం అందుకుంది.ఆ కాలమ్ సుమారు15 సంవత్స రాలు ఆంధ్రభూమి ఎడిట్ పేజీలో వచ్చింది.
1995లో ఆరాధన సంస్థవారి ఆకాశవాణి అవార్డు
1998లో కమలాకరఛారిటబుల్ ట్రస్టు వారిచే విశిష్టదంపతుల పురస్కారం
2002లో జ్యోత్స్న కళాపీఠం కవితా పురస్కారం
2003లో అభినందన సంస్థ పురస్కారం
2005లో ఆచార్య తిరుమల స్మారక సాహితీ పురస్కారం
2007లో చేతన పత్రిక విశిష్ట పురస్కారం
2008 లో వంశీ ఇంటర్నేషనల్ ఉగాదికవితా పురస్కారం
2008 లో తురగా కృష్ణమోహన్‌రావు స్మారక పురస్కారం
2011 లో తేజ ఆర్ట్స్ సంస్థ సాహితీ పురస్కారం
2011 లో చిత్ర గ్రంథికవితా సంకలనానికి చెలిమిసంస్థ పురస్కారం
2012 లో సమైక్య భారతివారిచే కార్టూనిస్టుల కాన్ఫరెన్స్ లో కార్టూనిస్ట్ గా సన్మానం
2013 లో నోరి ఛారిటబుల్ సంస్థ వారిచే దివాకర్ల వెంకటావధానిస్మారక సాహిత్య పురస్కారం
2015 లో మునిమాణిక్యం హాస్యనిధి పురస్కారం
2015 లో నవ్య సాహితీ సమితి ఉగాదివసంతోత్సవ సాహిత్య పురస్కారం
2015 లోనే పింగళిజగన్నాధరావు స్మృతిసాహిత్య పురస్కారం
2015 లోనే హాసం సంస్థ వారి పురస్కారం
2015 లో డా.తిరుమల శ్రీనివాసాచార్య,స్వరాజ్యలక్ష్మిల యువభారతి ధర్మ నిధిపురస్కారం
2016 లో దివాకర్ల వేంకటావధాని స్మారక ట్రస్టు సాహిత్య పురస్కారం
2017 లో కంభమ్మెట్టు చెన్నకేశవరావు జయంతి పురస్కారం
2018 లో కీ.శే..పోలవరంవెంకటసుబ్బమ్మ సాహితీపురస్కారం
ఇతర వివరాలుఅల్లంరాజు వెంకటరావు అసలు పేరుతో కంటే సుధామ గా పేరు పొందిన ప్రముఖ కవి, రచయిత, విమర్శకుడు, కార్టూనిస్టు, పజిల్స్ నిర్మాత.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికరంగుటద్దాలు
సంగ్రహ నమూనా రచన

You may also like...