| పేరు (ఆంగ్లం) | Vasireddy Venugopal |
| పేరు (తెలుగు) | వాసిరెడ్డి వేణుగోపాల్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 8/26/1965 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | కృష్ణా జిల్లా వత్సవాయి మండలం కాకరవాయి |
| విద్యార్హతలు | సీనియర్ పాత్రికేయుడు,ఫైనాన్షియల్ మార్కెట్ విశ్లేషకుడు |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | బంగారం కొనాలావద్దా? నా రాజ్యం బాబుగారి డాబు తెలుగువారి కురియన్ |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | వాసిరెడ్డి వేణుగోపాల్ సీనియర్ పాత్రికేయుడు,ఫైనాన్షియల్ మార్కెట్ విశ్లేషకుడు.ఆయన అనేక టెలివిజన్ ఛానళ్ళలో పత్రికలలో పనిచేసారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | బాబుగారి డాబు |
| సంగ్రహ నమూనా రచన | రెండు రూపాయల కిలో బియ్యం పథకానికి నిధులకోసం అవసరమైతే జోలె పడతానని తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అన్నారు. కానీ ఎన్టీఆర్ స్థానంలోకి వచ్చిన చంద్రబాబు, తనను తాను ప్రజాసేవకుడిగా చెప్పుకోవడానికి సిగ్గుపడ్డారు. ప్రతి పనిలోనూ లాభం ఆర్జించడానికి ఇష్టపడే సీఈఓగా తనను తాను చాటుకుని, అంతర్జాతీయ రుణదాతల బాజాభజంత్రీల మోతలతో పులకరించి పోయిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏనాడూ ఎవరూ కనీవినీ ఎరగని ముఖ్యమంత్రిగా చంద్రబాబు అధికారం తొమ్మిదేళ్లు కొనసాగింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి అదొక సంధికాలం. ప్రజా పునాదులపై నిలవాల్సిన, గెలవాల్సిన నాయకులు… తమ సొంత ఇజాలకు ముద్దుపేర్లు అద్దుతూ, జనం మీద వదులుతూ, వారిని నయవంచనకు గురిచేస్తూ ఎల్లకాలం ఏలలేరని గుర్తుచేయడానికి. నడమంత్రపు సిరికి అచ్చమైన ప్రతినిధులుగా వ్యవహరిస్తూ ఎల్లకాలం యావత్ జనాన్ని ఏమార్చలేరని అన్ని రాజకీయ పార్టీలకు, వాటి నాయకులకు గుర్తుచేయడానికి ఈ పుస్తకం. ఒకానొక చారిత్రక సందర్భంలో ఒకానొక ప్రభుత్వం ఏం చేసింది, ఏం చేయకుండా వుండాల్సింది, ఏం చేయలేదు, ఏం చేసి వుండాల్సింది అని తెలుగుదేశం సహా అన్ని పార్టీలు ఆలోచించుకోవడానికి, ఆత్మపరిశీలన చేసుకోవడానికి, తెలుగు ప్రజానీకపు అభ్యున్నతికి తోడ్పడే విధానాలు రచించుకోవడానికి దోహదపడుతుందనే నమ్మకంతో ఈ పుస్తకం. |