కస్తూరి మురళీకృష్ణ (Kasturi Muralikrishna)

Share
పేరు (ఆంగ్లం)Kasturi Muralakrishna
పేరు (తెలుగు)కస్తూరి మురళీకృష్ణ,
కలం పేరు
తల్లిపేరుకె. సత్యవతి
తండ్రి పేరుకె. సూర్యనారాయణ రావు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ1/10/1965
మరణం
పుట్టిన ఊరుషక్కర్ నగర్, బోధన్ తాలూకా, నిజామాబాద్ జిల్లా
విద్యార్హతలుఎం.ఎస్.సి
వృత్తిరైల్వే ఉద్యోగి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅంతర్యాగం
రోషనార
అసిధార
అంతర్మధనం
మర్మయోగం
సౌశీల్య ద్రౌపది
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1995లో ఆంధ్ర ప్రభ ’దీపావళి ‘ నవలల పోటీలో ‘అంతర్యాగం ‘ నవలకు ద్వితీయ బహుమతి
1999 లో ఆంధ్ర భూమి సస్పెన్స్ నవలల పోటీలో న ‘ఆపరేషన్ బద్ర్ ‘ నవలకు ప్రత్యేక బహుమతి లభించాయి.
ఇతర వివరాలుస్తూరి మురళీకృష్ణ ప్రసిద్ధ తెలుగు రచయిత. విస్తృతమైన రచనా సంవిధానాల్లో, విస్తారమైన సాహిత్యాన్ని సృష్టించిన మురళీకృష్ణ రచనలు పాఠకాదరణ పొందుతున్నాయి. మురళీకృష్ణ కథ, నవల, వ్యాసాలు మొదలైన ప్రక్రియల్లో, చారిత్రిక కల్పన, కాల్పనిక, సాహిత్యవిమర్శ, వైజ్ఞానిక, వ్యక్తిత్వ వికాస, భయానక, క్రైం మొదలైన పలు విభాగాలలో రచనలు చేస్తున్నారు. కాల్పనిక, కాల్పనికేతర విభాగాల్లో ఆయన రచించిన రచనలకు పాఠకుల ఆదరణ లభిస్తోంది.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికకశ్మీర రాజతరంగిణి కథలు
సంగ్రహ నమూనా రచనకథలు కల్హణ విరచితమైన ‘కశ్మీర రాజతరంగిణి’ ఆధారంగా రాసిన కథలు. కల్హణుడు 11వ శతాబ్దంవాడు.

కశ్మీర రాజతరంగిణి కథలు

 కథలు కల్హణ విరచితమైన ‘కశ్మీర రాజతరంగిణి’ ఆధారంగా రాసిన కథలు. కల్హణుడు 11వ శతాబ్దంవాడు. ఈనాటి చరిత్రకారులకే మాత్రం తీసిపోకుండా అనేక పరిశోధనలు చేసి, శిలాశాసనాలు తవ్వి, వెలికి తీయించి, చదివి, దేశమంతా విస్తృతంగా పర్యటించి, సేకరించిన గ్రహించిన కశ్మీర రాజుల చరిత్రను కల్హణుడు ‘కశ్మీర రాజతరంగిణి’లో పొందుపరచాడు.కల్హణుడు, ఈనాటి చరిత్రకారుల వైజ్ఞానిక పరిశోధనలకేమాత్రం తీసిపోకుండా పరిశోధనలు చేసి, నిజాన్ని నిర్భయంగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, ఉన్నదున్నట్టు తన రచనల్లో ప్రతిబింబించాడు. ఎటువంటి రాజాశ్రయం పొందకుండా, కేవలం చరిత్రను భావితరాలకు సజీవంగా అందించాలన్న తపనతో కల్హణుడు రాజతరంగిణిని రచించాడు. సాహిత్యకారుడికి ఉండే సామాజిక బాధ్యతను సంపూర్ణంగా నిర్వహించాడు.

కల్హణుడు 7836 శ్లోకాలలో పొందుపరచిన కశ్మీర రాజుల చరిత్రను 15 కథలలో ప్రదర్శించే ప్రయత్నం చేశాను. సముద్రంలోని నీటిచుక్క సముద్ర నీటిసారాన్ని ప్రతిబింబించిన రీతిలో, రాజతరంగిణి సారాన్ని ఈ 15 కథలలో సూక్ష్మంగా ప్రతిబింబించే ప్రయత్నంచేశాను.

———–

You may also like...