| పేరు (ఆంగ్లం) | Taatta Ramesh Babu |
| పేరు (తెలుగు) | తాతా రమేశ్ బాబు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | బోలెం లక్ష్మీనరసమ్మ |
| తండ్రి పేరు | బసవలింగం |
| జీవిత భాగస్వామి పేరు | జానకి |
| పుట్టినతేదీ | 1/15/1960 |
| మరణం | 4/20/2017 |
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా భట్టిప్రోలు |
| విద్యార్హతలు | డిగ్రీ |
| వృత్తి | చిత్రలేఖనోపాధ్యాయులు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ఆయన పదవతరగతి నుంచే గేయాలురాయటం, నాటకాలు వేయటం మొదలు పెట్టారు. ఆయన రచనలు చాలా దిన, వార పత్రికలలో ప్రచురించబడేవి. ప్రచురింపబడిన ఆయన పుస్తకాలు, అణువు పగిలింది (కవిత్వం), పిడికిలి (దీర్ఘ కవిత), తాతా రమేశ్ బాబు కథలు, విప్లవరుతువు (కవిత్వం), తోలిగీతలు, దిద్దు బాటు (బొమ్మలాట), తయారు చేద్దాం (క్రాఫ్ట్ వర్క్), అసలు నిజాం (బొమ్మలాట), నాన్నో పులి (బొమ్మలాట), బొమ్మలాట (బొమ్మలు తయారు చేసి ఆడించటం), శుభాకాంక్షలు (అభినందన పత్రాలు), లయ (ఆకాహవానిసమిక్షలు ), నా దేశం (దీర్ఘ కవిత), తాతా రమేశ్ బాబు చిత్రకళ, బాలబంధు బివి జీవిత చరిత్ర. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | http://kinige.com/book/Tata+Ramesh+Babu+Kathalu |
| పొందిన బిరుదులు / అవార్డులు | ఆకాశవాణి, దూరదర్శన్, ఇతర టీవీ కార్యక్రమాల్లో నటుడిగా, ప్రయోక్తగా, వక్తగా పాల్గొన్న బహుముఖీన ప్రతిభా విశేషాల్ని కలిగిన రమేశ్ బాబు అనేక సత్కారాలు, సన్మానాలూ పొందారు. చిత్రకళా సంసద్ రాష్ట్ర ఉత్తమ చిత్ర పురస్కారం, యునెస్కో క్లబ్ వారి అంతర్జాతీయ సాంస్కృతిక పురస్కారం, తిలక్ విశిష్ట సాహితీ పురస్కారం, శేషేంద్రశర్మ పురస్కారం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం, ఆం.ప్ర సాంస్కృతిక మండలి కృజి పురస్కారం, ఆం.ప్ర అధికార భాషా సంఘం భాషా సేవా పురస్కారం జానపద కళామిత్ర పురస్కారం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పురస్కారం విశ్వకళామహోత్సవ పురస్కారం వంటివి కొన్ని మాత్రమే. ఆయనకు 2015 ఉగాది పురస్కారం చిత్రలేఖనం విభాగంలో లభించింది |
| ఇతర వివరాలు | తెలుగు రచయిత, తెలుగు సినిమా ఆర్ట్ డైరక్టరు, సంపాదకుడు మరియు చిత్రలేఖనోపాధ్యాయుడు. ఆయనకు 2015 సంవత్సరానికి చిత్రలేఖనం విభాగంలో ఉగాది పురస్కారం లభించింది |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తాతా రమేశ్ బాబు కథలు |
| సంగ్రహ నమూనా రచన | జీవితాన్ని సహజంగా జీవించాలనే అభిప్రాయంతో కూడిన నా ఆలోచనా ధోరణి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని విజయ్ భయపడుతుంటాడు. పరిస్థితులకు ఎడ్జెస్ట్ అయి ఆశయానికి విరుద్ధంగా నడవాలనే తత్త్వానికి నేను వ్యతిరేకిని కదా… |
తాతా రమేశ్ బాబు కథలు
జీవితాన్ని సహజంగా జీవించాలనే అభిప్రాయంతో కూడిన నా ఆలోచనా ధోరణి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుందని విజయ్ భయపడుతుంటాడు. పరిస్థితులకు ఎడ్జెస్ట్ అయి ఆశయానికి విరుద్ధంగా నడవాలనే తత్త్వానికి నేను వ్యతిరేకిని కదా…
‘అసలు ఇలా సరిపెట్టుకోడం వల్లనే ఆడజాతి అన్యాయమైపోతోంది’…. అని నేనంటే, ‘అవును నిజమే’… అని అంగీకరించాడు విజయ్.
రాత్రిపూట విజయ్ తొందరపడుతున్నాడు.
నేను అప్పుడే అంగీకరించలేకపోతున్నాను. ఆ విషయమే చెప్పాను.
“ఇప్పుడే నాకిష్టం లేదు విజయ్. మనం ఎక్కువ కాలం కలసి పంచుకునే కొత్త జీవితం ఇది. మనం ఒకళ్ళనొకళ్ళం అర్థం చేసుకోవాల్సి చాలా వుంది. ఇలా కొన్ని రోజులు గడుపుదాం. ఆ తరువాతనే…..” అన్నాను.
విజయ్‌కి నా మాటాలు చాలా బాధ కలిగించే ఉంటాయి. ఇంకా తనని నా జీవితంలోకి పూర్తిగా ఆహ్వానించలేదనే భావం ప్రవేశించి వుంటుంది.
———–