| పేరు (ఆంగ్లం) | Bhavaraju venkatasatyamurti |
| పేరు (తెలుగు) | భావరాజు వెంకటసత్యమూర్తి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వెంకాయమ్మ |
| తండ్రి పేరు | రావు సాహెబ్ భావరాజు సత్యనారాయణ |
| జీవిత భాగస్వామి పేరు | జోగేశ్వరి |
| పుట్టినతేదీ | 1/1/1939 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | రామచంద్రపురం తూర్పు గోదావరి జిల్లా |
| విద్యార్హతలు | ప్లీడరీ-బాచిలర్ ఆఫ్ లాస్ |
| వృత్తి | వ్యాపార ప్రకటనల సలహాదారు, బొమ్మల కూర్పు నిపుణులు, కార్టూనిస్ట్ |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | కార్టూన్లు వెయ్యటం ఎలా అన్న విషయం మీద ఆంధ్రభూమి వారపత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక రచించి, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు ఎంతగానో తోడ్పడ్డాడు. ఈ ధారావాహిక సంకలనంగా తెలుగులో ప్రచురించబడింది. ఇదే పుస్తకం ఇంగ్లీషులో హౌ టు డ్రా ఎ కార్టూన్ (How to Draw a Cartoon) మరియు హిందీలో కార్టూన్ కైసె బనాయే (कार्टून कैसे बनाए) అన్నపేరుతో ప్రచురించబడింది. |
| ఇతర రచనలు | ఆంధ్రభూమి |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | 1977లో ఢిల్లీ తెలుగు అకాడమీ వారి ఉగాది పురస్కార బహుమతి లభించింది. 1982 సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాన్ని అప్పటి ముఖ్య మంత్రి నందమూరి తారకరామారావు చేతులమీదుగా అందుకున్నాడు. 1986లో వంశీ బర్క్‌లీ వారి ఉత్తమ కార్టూనిస్ట్ బహుమతి లభించింది. 2002లో ఢిల్లీ తెలుగు సంఘంవారి 24వ వార్షికొత్సవ బహుమతి లభించింది. 2002 లోనే ఆంధ్ర ప్రదేశ్ ప్రెస్ అకాడమీ వారి బహుమతి లభించింది. |
| ఇతర వివరాలు | సత్యమూర్తి గా దశాబ్దాల నుండి వ్యంగ్య చిత్రాలను, ఇతర చిత్రాలను వేస్తున్న ఇతని పూర్తి పేరు భావరాజు వెంకట సత్యమూర్తి. పేరులోని “సత్యమూర్తి”ని కలంపేరుగా ధరించి, తెలుగు పాఠకలోకానికి కార్టూనిస్టుగా చిరపరిచితులయ్యాడు. తెలుగు వ్యంగ్య చిత్ర చరిత్రలో ప్రసిద్ధికెక్కిన కార్టూన్ పాత్ర చదువుల్రావు ఇతడి సృష్టే. తెలుగు కార్టూనిస్టులలో ఎంతో అనుభవశాలిగా, సీనియర్‌గా గౌరవం పొందుతుతూ, తన కార్టూనింగును కొనసాగిస్తున్నాడు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
భావరాజు వెంకటసత్యమూర్తి
రచనా వ్యాసంగం
కార్టూన్లు వేయ్యటమే కాకుండా అనేక రచనలు కూడా చేశాడు, పుస్తకాలకు ముఖచిత్రాలు కూడా చిత్రించాడు. వాటిలో కొన్ని:
బొమ్మలు
- భగవాన్ సత్యసాయి మీద వ్రాయబడిన అనేక పుస్తకాలకు ముఖ చిత్రాలు వేశాడు.
- సనాతన సారథి పత్రిక మరియు ఆంగ్ల పత్రిక భావాన్స్ జర్నల్ (Bhavans Journal) లోను, భగవాన్ సత్య సాయి బాబా కథలకు బొమ్మలు వేశాడు.
పుస్తకాలు
కార్టూన్లు వెయ్యటం ఎలా అన్న విషయం మీద ఆంధ్రభూమి వారపత్రికలో రెండు సంవత్సరాలపాటు ధారావాహిక రచించి, ఔత్సాహిక వ్యంగ్య చిత్రకారులకు ఎంతగానో తోడ్పడ్డాడు. ఈ ధారావాహిక సంకలనంగా తెలుగులో ప్రచురించబడింది. ఇదే పుస్తకం ఇంగ్లీషులో హౌ టు డ్రా ఎ కార్టూన్ (How to Draw a Cartoon) మరియు హిందీలో కార్టూన్ కైసె బనాయే (कार्टून कैसे बनाए) అన్నపేరుతో ప్రచురించబడింది.
- శ్రీ సత్యసాయి మీద అనేక పుస్తకాలు
- భగవాన్ సత్య సాయి వారి ఉపన్యాసాల ఆధారంగా చిన్న కథలను 10 సంపుటాల రచిచంచాడు.
- ఫన్ విత్ క్వాలిటీ (Fun with Quality) అన్న పుస్తకం భెల్ (Bharat Heavy Electricals Limited-BHEL) వారికోసం రచించాడు
ఇతరాలు
- నాగార్జున సిమెంటు వారి వ్యాపార ప్రకటనలను తన కార్టూన్లతో ఆకర్షణీయంగా చేశాడు.
- భారతదేశంలో పెద్ద బాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సాంవత్సరిక కాలెండరును మూడు సంవత్సరాలపాటు తన కార్టూన్లతో నింపి అలరించాడు.
———–