Share
పేరు (ఆంగ్లం)Devaraju Ravi
పేరు (తెలుగు)దేవరాజు రవి
కలం పేరు
తల్లిపేరుసత్యవతి
తండ్రి పేరుదేవరాజు వేంకటకృష్ణారావు
జీవిత భాగస్వామి పేరుదేవరాజు సీత
పుట్టినతేదీ4/5/1939
మరణం3/2/2018
పుట్టిన ఊరువిజయనగరం జిల్లా
విద్యార్హతలు
వృత్తిలెప్రసీ డాక్టర్‌
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుఅడ్డాలనాటి బిడ్డలు,అన్నీ నల్లకాకులే,అమ్మ చచ్చిపోయింది,ఇప్పుడు చెప్పవే పిల్లా
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttp://www.sathyakam.com/pdfImageBook.php?bId=1062#page/8
పొందిన బిరుదులు / అవార్డులువంశీ బర్కిలీ అవార్డు
సేవాచక్ర పురస్కారం – కళాంజలి కల్చరల్ అసోసియేషన్, హైదరాబాదు వారిచే
వెన్నెల కల్చరల్ అసోసియేషన్, నర్సీపట్నం వారిచే సన్మానం.
సేవాభూషణ్ పురస్కారం
ఇతర వివరాలుకథా రచయిత,
నవలా రచయిత,
సినిమా సమీక్షకుడు,
సామాజిక కార్యకర్త
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికబతుకే బంగారం
సంగ్రహ నమూనా రచనబతుకే బంగారం’ కథల సంపుటిలో దేవరాజు సీత వ్రాసిన ఊలుటోపీ, బతుకే బంగారం, సమస్య – పరిష్కారం, రంగుల కల, కొత్త పెళ్ళి కూతురు, చిలకమ్మ చెప్పింది, హనీమూన్‌, ప్రసాదం తిన్న దేవుడు అనే 8 కథలతోపాటు

దేవరాజు రవి వ్రాసిన – కాలు జారితే, వెనకడుగు, నల్లబావ తెల్లమరదలు, చిరవకు మిగిలేది, వికసించని కుసుమాలు, వసంతోదయం, కళ్యాణి కల్యాణం, శేషప్రశ్న అనే 8 కథలు ఉన్నాయి.

దేవరాజు రవి

దేవరాజు రవి ప్రముఖ కథకుడు, నవలాకారుడు, సినిమా సమీక్షకుడు. తెలుగులో తొలి డిటెక్టివ్ నవల ‘వాడే వీడు’ రచయిత అయిన దేవరాజు వేంకటకృష్ణారావు ఇతనికి తండ్రి.

జీవిత విశేషాలు
ఇతని అసలు పేరు దేవరాజు వేంకట సత్యనారాయణరావు. ఇతడు విజయనగరం జిల్లా మృత్యుంజయనగరం గ్రామంలో 1939, ఏప్రిల్ 5వ తేదీన జన్మించాడు[1]. ఇతని స్వస్థలం బరంపురం. ఇతడు 12 నవలలు, 200 పైగా కథలు, 1250 సినిమా సమీక్షలు ఇంకా పలు ఇతర వ్యాసాలూ వ్రాశాడు. మొదటిసారిగా 1959లో రామం అనే నవలను రచించాడు. అప్పటి నుంచి ప్రారంభమైన ఇతని రచనా వ్యాసంగం చివరిరోజు వరకు కొనసాగింది. ఇతడు మూడు కవితా సంపుటాలు, రెండు కథా సంపుటాలు వెలువరించారు. సితార, శివరంజని, మేఘసందేశం, నంబర్ వన్ సినిమా పత్రికలలో ఇతడు చేసిన సమీక్షలు సినీ వర్గాల ప్రశంసల్ని పొందాయి. ఇతడు నంది అవార్డుల కమిటీలో రెండుసార్లు సభ్యుడిగా ఉన్నాడు. ఇతడు సామాజిక కార్యకర్తగా కూడా విశేషంగా కృషిచేశాడు. ఎంతోమంది కుష్టు రోగులకు స్వయంగా సేవ చేశాడు. లెప్రసీ డాక్టర్‌గా ఏరికోరి ఉద్యోగం చేసి, పదవీ విరమణ అనంతరం కూడా ఆ సేవల్ని కొనసాగించాడు. ఇతడు మేఘసందేశం అనే సినీవారపత్రికకు సబ్ ఎడిటర్‌గా పనిచేశాడు. ఇతడు ఆంధ్రపదేశ్ సినీక్రిటిక్స్ అసోసియేషన్, ఆంధ్రప్రదేశ్ సినిమా రచయితల సంఘం మొదలైన సంస్థలలో సభ్యుడిగా ఉన్నాడు.

రచనలు
నవలలు
రామం
సంగమం
ఎడారిలో కోయిల
కొత్త వెలుగు
కసి
మేము సైతం
వెన్నెల కురిసింది
చీకటి దీపాలు
ఏకాంకిక
కొత్త వెలుగు
కవితా సంపుటులు
వేగుచుక్క
ఇది హృదయం
కథా సంపుటులు
దేవరాజు రవి కథలు[2]
బతుకే బంగారం (దేవరాజు సీతతో కలిసి)
కథలు
ఇతని కథలు చిత్రగుప్త, కథాంజలి, వినోదిని, ఢంకా, కృష్ణాపత్రిక, ఆంధ్ర సచిత్రవారపత్రిక, ఆంధ్రజ్యోతి, ప్రగతి, తరుణ, స్వాతి, స్నేహ, జయశ్రీ, అనామిక, పల్లకి, జనసుధ, మధురిమ, సినీప్రభ, జోక్స్, జైదండోరా, నెలవంక, తారాపథం, ఆనందజ్యోతి, మధురవాణి, కొరడా, కాగడా, ఆదర్శరైతు, విజయసారథి తదితర పత్రికలలో ప్రచురించబడ్డాయి. వాటిలో కొన్ని తమిళ, కన్నడ భాషలలోకి అనువదించబడ్డాయి.

———–

You may also like...