| పేరు (ఆంగ్లం) | Ketu Buchireddy |
| పేరు (తెలుగు) | కేతు బుచ్చిరెడ్డి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 06/17/1942 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కేతు బుచ్చిరెడ్డి |
| సంగ్రహ నమూనా రచన | – |
కేతు బుచ్చిరెడ్డి
కేతు బుచ్చిరెడ్డి కథా రచయిత మరియు కవి.ఇతడు కడపలో 1942, జూన్ 17వ తేదీన జన్మించాడు. వృత్తి రీత్యా అనంతపురంలో స్థిరపడ్డాడు. ఇతడు కడపలోని రామకృష్ణ హైస్కూలులోను, ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను చదివాడు. పిమ్మట గుంటూరులోని వైద్యకళాశాలలో ఎం.బి.బి.యస్. చదివాడు. ఆ తర్వాత అనంతపురం పోలీస్ శిక్షణ కళాశాలలో వైద్యాధికారిగా పనిచేశాడు. ఒకవైపు వృత్తిని కొనసాగిస్తూ, ప్రవృత్తిగా రచనలు చేయసాగాడు. ఇతనికి భార్య లక్ష్మీకాంతమ్మ, ముగ్గురు కుమారులు ఉన్నారు. ఇతని కథలు, గేయాలు, కవితలు, వ్యాసాలు దాదాపు అన్ని పత్రికలలో, ఆకాశవాణి కడప కేంద్రంలో ప్రచురణ/ప్రసారం అయ్యాయి. ఇతడు తన మిత్రులతో కలిసి కొంతకాలం “కవిత” అనే పత్రికను నడిపాడు.
ఇతని రచనలు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, సైనిక్ సమాచార్, పొలికేక, స్రవంతి, అనామిక, ఆంధ్రభూమి, పత్రిక, స్వాతి, చక్రవర్తి తదితర పత్రికలలో ప్రచురించ బడ్డాయి. ఆకాశవాణి కేంద్రంలో ప్రసారం అయ్యాయి. పోలీసుశాఖ వారి “సురక్ష” పత్రికలో వైద్య, ఆరోగ్యసలహాలు అనే శీర్షికను నిర్వహించాడు.
———–