| పేరు (ఆంగ్లం) | Mothukuru Ananthachari |
| పేరు (తెలుగు) | మోతుకూరు అనంతాచారి |
| కలం పేరు | అనంతుడు |
| తల్లిపేరు | కౌసల్య |
| తండ్రి పేరు | వీరబ్రహ్మాచారి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 01/01/1941 |
| మరణం | 07/30/2012 |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ప్రబోధ గీతములు (1976 నవంబరు), అక్షర గీతం (గేయ సంపుటి) (1992 జనవరి), మాట్లాడే మంటలు (2000 జనవరి) |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మోతుకూరు అనంతాచారి |
| సంగ్రహ నమూనా రచన | – |
మోతుకూరు అనంతాచారి
మోతుకూరు అనంతాచారి తెలంగాణ రాష్ట్రానికి చెందిన పూర్వ ప్రధానోపాద్యాయులు, కవి, రచయిత, సామాజిక కార్యకర్త.అనంతాచారి 1941లో వీరబ్రహ్మాచారి, కౌసల్య దంపతులకు తెలంగాణ రాష్ట్రం, యాదాద్రి – భువనగిరి జిల్లా, మోత్కూర్ మండలంలోని కొండగడప గ్రామంలో జన్మించారు. ఉపాధ్యాయులుగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించి, 35 సంవత్సరాలు పనిచేసి, కోటమర్తి ఉన్నత పారశాల ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. అనంతాచారి దగ్గర విద్యను అభ్యసించినవారు ఉన్నత స్థానాల్లో ఉద్యోగాలు సంపాదించారు.
వీరి కలం పేరు ‘అనంతుడు’. వీరు అనేక కథలు, నవలలు, వివిధ పత్రికలకు వ్యాసాలు రాశాలు. 1985 ప్రాంతంలో ఇండియన్ ఎక్స్ ప్రెస్, ఆంధ్రభూమి పత్రికల్లో విలేఖరిగా పనిచేశారు.
వీరు రచించిన గేయాలు, నాటికలు అనేకచోట్ల ప్రదర్శించబడ్డాయి, బహుమతులందుకున్నాయి. గద్య, పద్య కవితలు అనేక పత్రికల్లో ప్రచురించబడ్డాయి, రేడియోలో ప్రసారం చేయబడ్డాయి. గతంలో వీరు రచించిన ప్రబోధ గీతములు (బాల సాహిత్య ప్రచురణ) పిల్లలను ఆకట్టుకుంది.
———–