| పేరు (ఆంగ్లం) | Raavikanti Ramayya Gupta |
| పేరు (తెలుగు) | రావికంటి రామయ్యగుప్త |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 06/17/1936 |
| మరణం | 03/30/2009 |
| పుట్టిన ఊరు | కరీంనగర్ జిల్లా మంథని |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | గౌతమేశ్వర శతకం, గీతామృతం, వరద గోదావరి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | రావికంటి రామయ్యగుప్త |
| సంగ్రహ నమూనా రచన | – |
రావికంటి రామయ్యగుప్త
రావికంటి రామయ్యగుప్త తెలంగాణకు చెందిన తెలుగు కవి. కరీంనగర్ జిల్లా మంథని ప్రాంతానికి చెందినవాడు. 1936లో జన్మించిన ఇతను 2009లో మరణించాడు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వెలుగులోకి వచ్చిన కవులలో ముఖ్యులు కీ.శే. శ్రీ రావికంటి రామయ్య గుప్త గారు. వారు రచించిన నగ్నసత్యాలు శతకంలోని పద్యం ఏడో తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలో చోటు సంపాదించుకుంది. కవిరత్న, మంత్రకూట వేమన, రెడీమేడ్ పోయెట్ గా పేరు గాంచిన ఆయన పూర్వ కరీంనగర్, ప్రస్తుత పెద్దపల్లి జిల్లా మంథనికి చెందిన వారు. అనేక శతకాలతో పాటు వారు బుర్రకథలు, ఏకాంకికలు, గొల్లసుద్దులు, నాటకాలు, గేయకావ్యాలు, కీర్తనలు, పాటలు రచించారు. అన్యాయం, అక్రమాలపై అక్షరాస్త్రాలు సంధించే వారు. కవిత్వమే ఊపిరిగా జీవించారు. అసలు సిసలు ప్రజాకవిగా పేరుగాంచారు. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా వెలువరించిన పుస్తకంలో కూడా ఆయన గురించి ప్రస్తావించారు. నీతి, నిజాయతీ, నిర్భీతి, నిర్మొహమాటం, నిష్కల్మశం, నిరాడంబరం మూర్తీభవించిన వ్యక్తిత్వం ఆయన సొంతం. నాలుగు దశాబ్దాల పాటు ఉపాధ్యాయునిగా సేవలందించి వేలాదిమంది శిష్యులను తీర్చిదిద్దారు. ఉత్తమ ఉపాధ్యాయునిగా గుర్తింపు పొందారు.
ఆయన చివరి క్షణం వరకూ అక్షర సేద్యం చేస్తూనే ఉన్నారు. ఉపాధ్యాయ సంఘానికి, ఆర్యవైశ్య సంఘానికి ఆస్థానకవిగా గుర్తింపు పొందారు. నగ్నసత్యాలు, శ్రీ గౌతమేశ్వర శతకాలతో పాటు వరదగోదావరి ఉయ్యాల పాట, కన్యకా పరమేశ్వరి శతకం, వాసవీ గీత, వరహాల భీమన్నగారి జీవిత చరిత్ర బుర్రకథ, ఇంకా ఎన్నో వేల పాటలు, కీర్తనలు రచించారు. మహామహుల సమక్షంలో కవితా గానం చేశారు. మంథని అంటే అంతులేని అభిమానం. మంథని ప్రముఖులలో ఆయన స్థానం సుస్థిరం.
———–