| పేరు (ఆంగ్లం) | Turaga Janaki Rani |
| పేరు (తెలుగు) | తురగా జానకీరాణి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 08/31/1936 |
| మరణం | 10/15/2015 |
| పుట్టిన ఊరు | కృష్ణాజిల్లా లోని, కోడూరు మండలం, మందపాకల గ్రామం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | వందకి పైగా కథలు రచించారు. అవి మూడు సంపుటాలుగా వెలువడ్డాయి. మూడు నవలలు, ఐదు బాలసాహిత్యం మీద పుస్తకాలు వచ్చాయి అనువాద రచనలు కూడా మూడు వచ్చాయి. అగమ్య గమ్య స్ధానం అనే కథకి రాచ కొండ విశ్వనాధ శాస్త్రిగారు అభినందిస్తూ ఉత్తరం రాశారు. ఆ కథ ఇంగ్లీషులోకి తర్జుమా అయింది కూడా… ఇప్పటికీ రచనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే డా. దుర్గాబాయి దేశ్ ముఖ్ గురించి రూపకం ఆకాశవాణికి రాసిచ్చారు. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం (రెండుసార్లు). రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారం. పింగళి వెంకయ్య స్మారక సత్కారం. అరవిందమ్మ మాతృమూర్తి అవార్డు. సుశీల నారాయణరెడ్డి సాహితీ పురస్కారం. |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | తురగా జానకీరాణి |
| సంగ్రహ నమూనా రచన | – |
| నమూనా రచన లంకె | – |
తురగా జానకీరాణి
తురగా జనకీరాణి (ఆగష్టు 31, 1936- అక్టోబరు 15, 2014) రేడియోలో పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, చిన్నారులతో ప్రదర్శింపచేశి ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి. మంచి రచయిత్రి, సంఘ సంస్కర్త కూడా.ఆలిండియా రేడియోలో నేటికీ రేడియో అక్కయ్యగా అందరి మదిలో మెదిలే వ్యక్తి తురగా జానకీ రాణిగారు. ఎందరో చిన్నారులు బాలానందంలో తమ కంఠం వినిపించడం వెనుక ఆమె ఉన్నారు. పాటలు, నాటికలు, రూపకాలు వంటి ఎన్నో కార్యక్రమాలను ఆవిడ రూపొందించి వాటిలో చిన్నారులతో ప్రదర్శింపచేశారు. ఎందరో బాలబాలికలకి పబ్లిక్ స్పీకింగ్ భయంపోయి మైక్ లో ధైర్యంగా మాట్లాడటానికి.. వారిలోని సృజనాత్మకతకు ..ఇలా ఎన్నో విషయాలకిబాలానందం ఒక వేదిక అయింది. డాక్టర్లు, లాయర్లు, సినీ తారలు, ఎన్.ఆర్.ఐలు… ఒకరేమిటి ఎందరో ప్రముఖులు తమకు చిన్నతనంలో ఆకాశవాణిలో రేడియో అక్కయ్యతో వున్న అనుభవం మర్చిపోలేరు. నేటికీ ఆమెను ఒక ఆత్మీయురాలిలాగా పలకరిస్తుంటారు…
రేడియో ఆర్టిస్ట్ గానాటకాలలోనూ, ఇతర కార్యక్రమాలలోనూ విశేష అనుభవం వున్నతురగా జానకీ రాణి గారు1975 లో ఆకాశవాణిలో ఉద్యోగంలో చేరారు. 1994 లో ఐ.బి.పి.ఎస్. అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు.
ఆకాశవాణిలో ఆమె బాధ్యత చాలెంజింగ్ వుండేది. సమయపాలన పాటించడంతో పాటు శ్రోతలకీ న్యాయం చేకూర్చాలనే తపనతో పనిచేసేవారు. 1975లో ఉద్యోగంలో చేరినప్పుడు మనదేశంలో ఎమర్జెన్సీ అమలులో ఉండేది. ఆకాశవాణి ద్వారా ప్రభుత్వ పాలసీలు, విధానాలు ప్రజలకి చేరవేయాలి.ఒక ఛాలెంజింగ్ గా వుండేది….ఆమె ఏ కార్యక్రమం చేసినా ఆమోదించేవారు. స్వేచ్ఛ వుండేది. కార్యక్రమాల్లో వైవిధ్యం రూపొందిచడానికి ప్రయత్నించేవారు.
———–