| పేరు (ఆంగ్లం) | Vakkalanka Lakshmipatirao |
| పేరు (తెలుగు) | వక్కలంక లక్ష్మీపతిరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | సుమాంజలి, స్వాతంత్ర్యభారతి, కవితా లోకము, కవితావసంతం, వీరభారతము, జలదగితి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | వక్కలంక లక్ష్మీపతిరావు |
| సంగ్రహ నమూనా రచన | – |
వక్కలంక లక్ష్మీపతిరావు
వక్కలంక లక్ష్మీపతిరావు ప్రముఖ తెలుగు కవి మరియు సాహితీకారుడు. కోనసీమ కవికోకిలగా లబ్దప్రతిష్టులాయన. వారికి ప్రకృతి పట్ల ఆరాధన, దేశాభిమానం, ప్రకృతికి మూలాధారమైన పరమేశ్వరుడంటే భక్తి మెండు. ప్రాచీన అధునాతన కవితా వారధిగా సుమారు నాలుగు తరాల శ్రోతలకు లక్ష్మీపతిరావు గారు సుపరిచితులు. అమలాపురం శ్రీ కోనసీమ భానోజీ రామర్సు కళాశాలలో తెలుగు విభాగ అధిపతిగా పనిచేశారు.
ఆయన 1924 లోజన్మించారు. ఆయన అనేక లలితగీతాలు, దేశభక్తి గీతాలు రచించారు. అవి 1970-90 ప్రాంతాలలో విరివిగా ఆకాశవాణి కేంద్రాలలో వినపిస్తూ ఉండేవి. ఇప్పటికీ అప్పుడప్పుడు ఆకాశవాణి కేంద్రాలనుంచి పున: ప్రసారం అవుతూ ఉంటాయి. అప్పట్లో ఆకాశవాణి గుర్తింపు ఉన్న రచయిత. ఇవే కాక ఇంకా అనేక గ్రంథాలు రాసారు. ఆయన రచనలను స్వర్గీయ రాష్ట్రపతి వి.వి.గిరి, అక్కినేని నాగేశ్వరరావు,ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం లాంటి వారికి అంకితం యిచ్చారు. పారిజాతాపహరణం సిద్ధాంత వ్యాసం వ్రాసారు.ఈయన కావ్యాలు రాయడంతోపాతు దైవక్షేత్రాలపై చక్కనిపాటలు వ్రాసారు. ఆయన కాళీదాసు మేఘ సందేశాన్ని తెలుగులో వ్రాసారు.
” నవభారతనందనాన
వలపు లొలుకుపువ్వుల్లారా !
తెలుగుతల్లివదనమ్మున
విరిసినచిరునవ్వుల్లారా !
నవతావాదుల్లారా !
మానవతావాదుల్లారా !
నవచైతన్యం ఉరకలు వేసే
యువతీయువకుల్లారా !
భారతయువతీయువకుల్లారా !
నవభారతనిర్మాతల్లారా ! “
———–