| పేరు (ఆంగ్లం) | Bhattiprolu Sri Lakshmi Hanumantarao |
| పేరు (తెలుగు) | భట్టిప్రోలు శ్రీలక్ష్మీహనుమంతరావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | వెంకటలక్ష్మి |
| తండ్రి పేరు | రామకృష్ణయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 01/04/1924 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | గుంటూరు జిల్లా లోని కొల్లూరు మండలానికి చెందిన దోనేపూడి గ్రామం |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ఆంధ్రుల చరిత్ర అనువాదాలు: మానవ నాగరికత, లోకాయుత వాద పరిశీలన, ఎం. ఎన్. రాయ్ స్వీయ గాథలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | భట్టిప్రోలు శ్రీలక్ష్మీహనుమంతరావు |
| సంగ్రహ నమూనా రచన | – |
భట్టిప్రోలు శ్రీలక్ష్మీహనుమంతరావు
ఆచార్య భట్టిప్రోలు శ్రీలక్ష్మీహనుమంతరావు (1924-93) ప్రముఖ విద్యావేత్త. చరిత్రకారుడు. ఆంగ్లంలోను, తెలుగులోను బహు గ్రంధ రచయిత. అనువాదకుడు. వీరు రాసిన గ్రంధాలలో “ఆంధ్రుల చరిత్ర” ఉత్తమ ప్రామాణిక చరిత్ర రచనగా నిలిచింది. మరో చారిత్రిక పరిశోదక గ్రంధం “రెలిజియన్ ఇన్ ఆంధ్ర” (Religion in Andhra) పండితలోకంలో విశేష ఖ్యాతిని పొందింది.
వీరు గుంటూరు జిల్లా లోని కొల్లూరు మండలానికి చెందిన దోనేపూడి గ్రామంలో 1924 జనవరి 4 తేదీన జన్మించారు.తల్లి వెంకటలక్ష్మి. తండ్రి రామకృష్ణయ్య.వీరి తండ్రి మూల్పూరుగ్రామకరణంగా పనిచేశారు. వీరి బాల్యం మూల్పూరు, తురుమెళ్ళ, తెనాలిలో గడిచింది. వీరి ఉన్నత విద్యాభ్యాసం గుంటూరు హిందూ కళాశాలలోను, ఆంధ్ర క్రైస్తవ కళాశాలలోను గడిచింది. అక్కడ వీరికి మారేమండ శ్రీనివాసరావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, గొర్తి వెంకటరావు, ఓరుగంటి రామచంద్రయ్య మొదలైనవారు ఇతనికి గురువులు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చదివిన అనంతరం కర్ణాటక విశ్వవిద్యాలయం నుండి పి.హెచ్.డి. చేసారు. 1946 లో తెనాలి పట్టణంలో కూచిపూడి హైస్కూల్‌లో చరిత్ర అధ్యాపక వృత్తి చేపట్టి, ఆ తరువాత గుంటూరుహిందూ కళాశాలలో 1983 వరకు చరిత్ర అధ్యాపకులుగా పనిచేసారు. 1983-87 మధ్య కాలంలో నాగార్జున విశ్వవిద్యాలయంలో మహాయాన బౌద్ధపీఠానికి గౌరవ ఆచార్యులుగా పనిచేసారు. ‘ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్’, ‘ఇండియన్ ఎపిగ్రఫికల్ సొసైటీ’, ‘ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్’ లకు గౌరవ అధ్యక్షుడిగా వ్యవహరించారు. భార్య ప్రియంవద.
———–