| పేరు (ఆంగ్లం) | Mangalagiri Anandakavi |
| పేరు (తెలుగు) | మంగళగిరి ఆనందకవి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | వేదాంతరసాయనము, విజయనందన విలాసము |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మంగళగిరి ఆనందకవి |
| సంగ్రహ నమూనా రచన | – |
మంగళగిరి ఆనందకవి
మంగళగిరి ఆనందకవి వేదాంత రసాయనము అనే పేరుతో ఏసుక్రీస్తు చరిత్ర ప్రబంధాన్ని 1780-90ల మధ్యకాలంలో రచించాడు. ఈ కావ్యం 1882లో మొదటిసారి ముద్రించబడింది. ఈ కావ్యంలో నాలుగు ఆశ్వాసాలు ఉన్నాయి. మల్లరాన, జ్ఞానబోధల మధ్య సంభాషణరూపంలో ఉంది. వేదవ్యాసుని వేదాంత పద్ధతిని అధ్యయనం చేసి, అదే నమూనాలో క్రైస్తవ మతగ్రంథ సారాన్ని, ముఖ్యంగా కొత్త నిబంధన గ్రంథ సారాన్ని ఈ వేదాంత రసాయనములో కవి ఇమిడ్చాడు. క్రైస్తవ మత సంప్రదాయాలు, క్రీస్తు చరిత్ర దీనిలో వర్ణించబడి ఉంది. భారత, భాగవతాలలోని కొన్ని ఘట్టాలను ఈ కావ్యంలో పోల్చారు. ఈ గ్రంథాన్ని ఫ్రెంచి వారి తరఫున మచిలీపట్టణాన్ని పాలించిన నిడుమామిళ్ల దాసప్పకు అంకితమిచ్చాడు. ఈ గ్రంథం 1926, 1969లలో పునర్ముద్రణలు పొందింది.
విజయనందన విలాసము మూడు ఆశ్వాసముల ప్రబంధము[2]. దీనిని 1919లో చెలికాని లచ్చారావు సంపాదకత్వంలో అముద్రితాంధ్ర గ్రంథ సర్వస్వంలో భాగంగా చతుర్థ గ్రంథంగా ప్రచురించారు. చిత్రాడలోని శ్రీరామ విలాస ముద్రాక్షరశాలలో ప్రచురింపబడింది. రచయిత ఈ గ్రంథాన్ని దాట్ల వేంకటకృష్ణ నృపాలునికి అంకితమిచ్చాడు. ఆభిమన్యుని చరిత్ర ఈ కావ్యంలో కథావస్తువు.
———–