| పేరు (ఆంగ్లం) | Iriventi Krishnamurthy |
| పేరు (తెలుగు) | ఇరివెంటి కృష్ణమూర్తి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 7/12/1930 |
| మరణం | 1/1/1991 |
| పుట్టిన ఊరు | పాలమూరు జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులు |
| తెలిసిన ఇతర భాషలు | హిందీ, ఇంగ్లీషు |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | వెలుగు చూపే తెలుగుపద్యాలు (బాలసాహిత్యం),దేశమును ప్రేమించుమన్నా (బాలసాహిత్యం) ,లక్ష్మణుడు (బాలసాహిత్యం), వీచికలు(కవితాసంకలనం – మరో ముగ్గురు కవులతో కలిసి), కవిసమయములు, దశరూపక సందర్శనం భావన (సుభాషితాల సంకలనం), ఇరివెంటి వ్యాసాలు, ఇరివెంటి రచనలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఇరివెంటి కృష్ణమూర్తి |
| సంగ్రహ నమూనా రచన | – |
ఇరివెంటి కృష్ణమూర్తి
తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలితరం కథారచయితల్లో ఈయన ఒకరు. మహబూబ్నగర్ జిల్లాలో 1930 జూలై 12న జన్మించారు. నిజాం నిరంకుశత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేసి జైలుకెళ్లారు. యువ భారతి సాహిత్య సంస్థకు అధ్యక్షులుగా ఉండి తెలంగాణ సాహిత్య వికాసానికి కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ కార్యదర్శిగా, ఆంధ్ర సారస్వత పరిషత్తు కార్యదర్శిగా ఉంటూ సాహిత్య లోకానికి ఎనలేని సేవ చేశారు. సంస్కృతాంధ్ర ఉర్దూ భాషల్లో ప్రావీణ్యముంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి సీ.నారాయణరెడ్డి పర్యవేక్షణలో కవి సమయాలు అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్డీ పట్టాపొందారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో ఆచార్యులుగా పనిచేసి ఉద్యోగ విమరణ చేశారు. 1989 ఏప్రిల్ 26న మరణించారు.
రచనలు: వెలుగు చూపే తెలుగు పద్యాలు (బాల సాహిత్యం), దేశమును ప్రేమించుమన్న (బాల సాహిత్యం), లక్ష్మణుడు (బాల సాహిత్యం), వీచికలు (కవితా సంకలనం – మరో ముగ్గురు కవులతో కలిసి), కవి సమయాలు (పరిశోధన గ్రంథం), దశరూపక సందర్శనం, భావన (సుభాషితాల సంకలనం), ఇరివెంటి వ్యాసాలు, తెలుగు-ఉత్తర భారత సాహిత్యాలు, చాటువులు, వాగ్భూషణం భూషణం, వేగుచుక్కలు, వెలుగు బాటలు, అడుగు జాడలు మొదలైనవి. పఠనీయం శీర్షికతో 39 ఉత్తమ గ్రంథాల పరిచయాలు రాశారు.
———–