| పేరు (ఆంగ్లం) | Avadhani Ramesh |
| పేరు (తెలుగు) | అవధాని రమేష్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | సావిత్రమ్మ |
| తండ్రి పేరు | వేంకటసుబ్రహ్మణ్యశాస్త్రి |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 12/4/1921 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ఔకు అగ్రహారం, కర్నూలు జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | జిల్లా విద్యాశాఖాధికారి |
| తెలిసిన ఇతర భాషలు | ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | బాల సాహిత్య రచయితలు. పెక్కు పిల్లల కథలు, పుస్తకాలు |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | అవధాని రమేష్ |
| సంగ్రహ నమూనా రచన | అనంతపురంలో ఒకసారి జిల్లా రచయిత లసంఘం మమా సభలు వేడుగ్గా జరిగాయి. ఆ కార్యక్రమంలో ఒకనాడు బాల సాహిత్యానికి సంబంధించిన ఒక కథల సంపుటిని ఆవిష్కరించడం జరిగింది. ఆ సభలో ఆ రచయిత ‘‘మన జిల్లాలో బాల సాహిత్యం వ్రాసిన రచయితలు లేరు’’ అని గట్టిగా చెప్పడం, ఆ సభాధ్యక్షులవారు వెంటనేలేచి ‘‘అయ్యా మీకు తెలియదేమో ఈ సభకు ఉపన్యాసకులుగా ఆహ్వానింపబడిన అవధాని రమేష్ గారు మనజిల్లాలో విద్యాశాఖాధికారులుగా పనిచేసినవారు. బాల సాహిత్య రచయితలు. పెక్కు పిల్లల కథలు, పుస్తకాలు వ్రాసినవారు. |
అవధాని రమేష్
అనంతపురంలో ఒకసారి జిల్లా రచయిత లసంఘం మమా సభలు వేడుగ్గా జరిగాయి. ఆ కార్యక్రమంలో ఒకనాడు బాల సాహిత్యానికి సంబంధించిన ఒక కథల సంపుటిని ఆవిష్కరించడం జరిగింది. ఆ సభలో ఆ రచయిత ‘‘మన జిల్లాలో బాల సాహిత్యం వ్రాసిన రచయితలు లేరు’’ అని గట్టిగా చెప్పడం, ఆ సభాధ్యక్షులవారు వెంటనేలేచి ‘‘అయ్యా మీకు తెలియదేమో ఈ సభకు ఉపన్యాసకులుగా ఆహ్వానింపబడిన అవధాని రమేష్ గారు మనజిల్లాలో విద్యాశాఖాధికారులుగా పనిచేసినవారు. బాల సాహిత్య రచయితలు. పెక్కు పిల్లల కథలు, పుస్తకాలు వ్రాసినవారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నుండి 1965, 67, 69 సం.లు వరుసగా బాలసాహిత్య బహుమతులను గెల్చుకొని, సన్మానింపబడినవారు’’ అని శ్రీ అవధాని రమేష్గారిని గూర్చి శ్రోతలకు చెప్పగానే, ఆ రచయితతోబాటు పెక్కురు తమకొక కొత్త విషయం తెలిసివచ్చినట్లు చకితులయ్యారు. అంతవరకు శ్రీ అవధాని రమేష్గారు వారందరికీ జిల్లా విద్యాశాఖాధికారిగానే పరిచయం.
శ్రీ అవధాని రమేష్ గారు అనంతపురం జిల్లాలో చాలఏండ్లు జిల్లా విద్యాశాఖాధికారిగా పనిచేశారు. వీరు ఈ జిల్లా లోని చాలామంది ఉపాధ్యాయ వర్గానిక గురుదేవులు. చక్కటి బోధకులు, మంచి రచయితలు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృత భాషలలో గొప్పగా కృషిచేసిన విద్యావంతులు. మంచి వక్తలు. అభ్యుదయ భావాలు కలిగిన అభ్యుదయ కవి. సంస్కృతములో కొన్ని వందల శ్లోకాలను కంఠస్థముచేసి, వాటిని తమ ఉపన్యాసములలో సందర్భానుసారముగా వల్లిస్తూ, అర్థము విశదీకరిస్తూ శ్రోతల నానందింప చేయుట వీరి ఉపన్యాసములోని ప్రత్యేకత.
శ్రీ రమేష్గారి ప్రాథమిక విద్య స్వగ్రామంలో జరిగింది. 6వ తరగతి నుండి యస్.యస్.యల్.సి. వరకు తాడిపత్రి పురపాలకోన్నత పాఠశాలలో విద్య నభ్యసించిరి. అటుతరువాత అనంతపురం ఆర్టుస కాలేజిలో ఇంటర్, బి.ఏ., పరీక్షలలో కృతార్థులై కాశీ విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. పరీక్ష్ నెగ్గిరి. ‘‘ఇంగ్లీషు మెథడ్సు’’లో ప్రత్యేక శిక్షణ పొందిరి.
వీరు మంచి రచయితలు. దరిదాపు 60 పుస్తకములు రచించిరి. బాలసాహిత్యంపై ఎక్కువగా కృషిచేసిరి. బాలల కనువగు పుస్తకములు వ్రాసిరి. వాటిలో ముఖ్యమైనవి లాల్ బహదూర్ శాస్త్రి, బాలగంగాధర తిలక్, తృణకంకణము, వీరపూజ, మూడు మంచికథలు, ప్రతీకారము (చిన్నకథలు) కాసుల పేరు (పిల్లలకథల సంపుటి) అజ్ఞాతవీరులు, ఇందిరాభారతం, వీరు ఇతర రాష్ట్రపు విద్యార్థులకొరకు ఆంగ్లములో వ్రాసిన ‘‘ఉపవాచకములు’’ మిక్కిలి వ్యాప్తిలోనికి వచ్చినవి. వీరి ఇందిరాభారతం ఒక ఉద్గ్రంథము. భారతరత్న శ్రీమతి ఇందిరాగాంధి జీవిత చరిత్రను, ముఖ్య ఘట్టములను, ఆమె పాలనా కాలములో సాధించిన ఘన విజయాలను రచయిత చక్కగా, విపులంగా, ఫోటోలతో 250 పేజీల డెమ్మీసైజులో ప్రచురించారు. ఈ పుస్తకాన్ని ఒక జీవిత చరిత్ర గ్రంథంగా కాకుండా ‘‘ఫాలష్భ్యాక్ టెక్కిక్’’ని ఉపయోగించి వ్రాయడంతో చదువరులను విశేషంగా ఆకర్షిస్తుంది. రచయిత బహు శ్రమలకోర్చి అనేక విషయములను ఈ గ్రంథములో చొప్పించి గణనీయమైన కృషి చేసిరి.
భారత స్వాతంత్ర్య పోరాటముతో అవధానిగారు కూడ పాల్గొని కారాగారక్లేశము ననుభవించిన అజ్ఞాత యువకవీరులలో ఒకరు. అందుకే వారు మాతృదేశ దాస్యవిముక్తికై పోరాడిన అజ్ఞాత వీరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ‘‘అజ్ఞాతవీరులు’’ అనుపొత్తమును వారికి అంకితమిచ్చిరి. ఈ పుస్తకమునందు వీరు వ్రాసిన ‘‘పూర్వచరిత్ర – స్వాతంరత్యసౌధపు పునాదులు’’ అను ముందు మాట చదివినప్పుడు రచయితగారికి గల బహు గ్రంథ పరిచయమును గూర్చి మనకు తెలియనగును. ఇందు బలవంతరావుపాడేక, హరిదయాల్, జితేంరదనాథ్ లహరీ, శ్రీమతి బిణాదాస్, నారాయణ (హుబ్లి)ల చరిత్రతలు చేర్చబడినవి.
ఈ అజ్ఞాత వీరుల అమర చరిత్రలను వ్రాయదలచి, కవిగారు భారతజనని ఆశీర్వాదములు కోరుతూ ఇట్లు వ్రాసిరి.
‘‘ఇతిహాసపు చీకటికోణం
అట్టడుగున పడి కాన్పించని
కథలన్నీ కావాలిప్పుడు
దాచేస్తే దాగనిసత్యం
భారతీవరుల దివ్యగాథలు
స్మరిస్తే హృదయవిదారం
మఱిపిస్తే మఱువనిదృశ్యం
భారతీయ యితిహాసం.’’
మాతృదేశంపై అనన్య భక్తి ప్రపత్తులను తమ రచనల ద్వారా వెల్లడించిన దేశాభిమానులు శ్రీ రమేష్గారు. ఎన్నో ఏండ్లు జిల్లా విద్యాశాఖాధికారిగా తమ కార్యనిర్వహణలో ఎల్లప్పుడు నిమగ్నులైవున్నను, సాహిత్యాభిమానులుగా ఎన్నో రచనలుచేసి, విప్లవరచయితల సంఘం, అభ్యుదయ కళాసమితి, రాయలకళాగోష్ఠి మొదలగు సంస్థలను స్థాపించిరి. ‘‘విశ్వప్రేమ’’ అను పత్రికను నడిపిరి. వీరి సతీమణి శ్రీమతి పద్మావతమ్మ కూడ జిల్లా విద్యాశాఖాధికారిణిగా పనిచేసిరి. ప్రస్తుతము వీరు అనంతపురం పట్టణములో స్వగృహమందు విశ్రాంతి తీసుకొంటున్నారు. వీరికి భగవంతుడు ఆయురారోగ్య భాగ్యములనిచ్చి కాపాడుగాత.
———–