| పేరు (ఆంగ్లం) | Kasyuri Subbarao |
| పేరు (తెలుగు) | కస్తూరి సుబ్బారావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 1/1/1855 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | పౌరాణిక పండితులు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | శాకుంతలా దుష్యంతము, సుగీవ పట్టాభిషేకము |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కస్తూరి సుబ్బారావు |
| సంగ్రహ నమూనా రచన | శ్రీ కస్తూరి సుబ్బారావుగారు పేరుగడించిన నాటక కర్తలు కాక పోయినను వ్రాసిన రెండు నాటకములు మేల్బంతులనవచ్చును వీరి మొదటి నాటకము ‘శాకుంతలా దుష్యంతము’ రెండవది ‘ సుగీవ పట్టాభిషేకము’ |
కస్తూరి సుబ్బారావు
శ్రీ కస్తూరి సుబ్బారావుగారు పేరుగడించిన నాటక కర్తలు కాక పోయినను వ్రాసిన రెండు నాటకములు మేల్బంతులనవచ్చును వీరి మొదటి నాటకము ‘శాకుంతలా దుష్యంతము’ రెండవది ‘ సుగీవ పట్టాభిషేకము’
శ్రీ కస్తూరి వారు పభుత్వ నౌకరీ (క్యాష్కీపర్) నుండి వివృత్తి పొందిన తరువాత పెన్షన్ పుచ్చుకొన్న సమయంలో రచనా వ్యాసంగమునందు మునిగి 1915లో శకుంతలా దుష్యంతమును ప్రకటించిరి ఇందు శకుంతల జననము, దుష్యంతుని వేట, శకుంతల దుష్యంతుల గాంధర్వ వివాహము విసి హము, భర్తకడకు పంపకము, ఆకాశవాణి వాక్కు, భరతుని పట్టాభిషేకము ఇందలి ప్రధాన ఘట్టములు అందందు చక్కని పద్యములు వ్రాయబడినవి పాటలు వ్రాయలేదు.
వేటకై వచ్చిన దుష్యంత మహారాజు తన చెలికానితో తాను చూచిన శకుంతల అందము నిట్లు వర్ణించుచున్నాడు.
సీ: చెలియ మోమును జూచి.సిగ్గుచే రేరాజు
నింగిని సరగున . నిలవబోయె
సఖియ కురులతోడ సరిగా నగాలేక
మధుపంబు లై తిర్గు -భ్రమరచయము
నరసంపు గనులతో సరి దూగగా లేక
కావల పాలయ్యె, నేణి గణము
యందు సితారామ లక్ష్మణుల వానము-జంబుకాసుర సంహారము. శూర్పణఖ గర్వ భంగము , సీతాపహరణము. జటాయువు – శబరులకు మోక్షము – సుగ్రీవ మైత్రి , వాలి సుగ్రీవుల యుద్ధము.సుగ్రీవ పట్టాభిషేకము యందలి ప్రధాన ఘట్టములు వాలి మరణానంతరము తార పరితపించిన విధము కవిగారు కడు విషాదముగా చిత్రించిరి.
సీ: కపి కులాశ్వర ! కపి రాజశేఖర
కన్నెతి నాదిక్కు కాంచవెమి:
హృదయేశ: నినుబాసి యేనుండజాలను
నీ వెంట నేతెంతు నిక్కముగిను
ఏల యీ చుట్టాలు? యేల యీ పుత్రుండు.
యేల? యీ ధన ధాన్య మేలనాకు
పోనాధ హో వీర హా యింద్రనందని
హా జీవితేశ హా వినచరేంద్ర
గీ: ధర్మపత్నిని గడిద్రోచి ధరణి మీద
నాధ న్యాయమే చనగ యనాధ జేసి
యెన్ని విధముల జెప్పిన నెమ్మితోడ
వినగ నైతివిగా నాదు మనవి యకట
ఇట్టి రసవత్తర విషాదకర దృశ్యమలిందు పెక్కులున్నవి సికను
కోల్పోయి రాముడు పొందు మనో వేదన, లక్ష్మణుని ఆరాటము, జటాయువు, శబరులతో రామలక్ష్మణుల సంభాషణలు, ఇందుల కుదాహరణములు.
శ్రీ కస్తూరివారి ‘శకుంతల నాటకమున కంటె యిది వేయి రెట్లు నాటక ప్రదర్శన కనుకూలముగా నున్నది పద్యమువిందు తక్కువగా చేర్చి సంభాషణలయందు తమ నేర్పరి తనమును చూపిరి. ప్రదర్శన కనువుగా రంగ విభజన గావించిరి నాటకకర్త, తమ నాటకమునందలి కొన్ని దోషముల విందు సవరించుకొనిరి.
ఈ కవిగారి ఇతర రచనలేవొ తెలియపు తక్కిన వివరాలు తెలిసి రాలేదు. తెలిపినంతవరకు వీరు అనంతపురంలోని పాతపూరులోనే నివసించిరి. వీరి ఇంటికి “కస్తూరి బిల్డింగ్స్’ అనుపేరు ఇప్పటికికూడా కలదు.
రాయలసీమ రచయితల నుండి….
———–