జాని.తక్కెడశిల (JOHNY TAKKEDASILA)

Share
పేరు (ఆంగ్లం)JOHNY TAKKEDASILA
పేరు (తెలుగు)జాని.తక్కెడశిల
కలం పేరుఅఖిలాశ
తల్లిపేరుతక్కెడశిల ఆశ
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరువైఎస్ఆర్ కడప జిల్లా పులివెందులలో… రాజారెడ్డి వీధి
విద్యార్హతలుహిందీలో ప్రవీణ డిగ్రీ పట్టా , ఏం.టెక్‌
వృత్తితెలుగు యువకవి, రచయిత, నవలా రచయిత, అనువాదకుడు, విమర్శకుడు.
ప్రతిలిపి తెలుగు విభాగాధిపతి
తెలిసిన ఇతర భాషలుహిందీ
చిరునామా
ఈ-మెయిల్
ఫోను72595 11956
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుగర్భాన మోసేవు..!!(కవిత ),ఒకానొక ఊట కోసం,ఏదైనా రాలిపోవాల్సిందే (కవితలు),జయకేతనం,ఆరడుగుల నేల | ప్రస్థానం,నిద్రాచైతన్యాల నడుమ | దర్వాజ |,మరమ్మతు చేసుకోవాలి,మట్టినైపోతాను అనే కవితా సంపుటి,”బురద నవ్వింది” కవితా సంపుటి, ”వివేచని” సాహిత్య విమర్శ, ”జిందగీ కే హీరే” తెలుగులో ఉన్న నానో అనే మినీ కవితా ప్రక్రియను హిందీకి పరిచయం చేసిన తొలి పుస్తకం. ”గాయాల నుండి పద్యాల దాక” 530 పేజీల కవితా సంపుటిని విడుదల చేయడం.. కవితా దిగ్గజాలు సైతం ఆ పుస్తకాన్ని కొనియాడటం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది.,సాహిత్య అకాడమి అవార్డులు వచ్చిన 17 పుస్తకాలపై వ్యాసాలను రాసి ”అకాడమి ఆణిముత్యాలు” పేరుతో పుస్తకాన్ని వెలువరించాను. ”మది దాటని మాట” (గే కమ్యూనిటీపై తొలి తెలుగు నవల) ,రాయలసీమ మాండలికంలో ముస్లిం మైనారిటీ కథలను రాసి ”షురూ” పేరుతో పుస్తకాన్ని తీసుకువచ్చాను.
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://www.kahaniya.com/s/aksharalu/
https://www.molakanews.page/2020/11/7
పొందిన బిరుదులు / అవార్డులుఎవరూ రాయని అంశాలపై సాహిత్యాన్ని రాయడం వల్ల స్వల్ప కాలంలోనే సాహిత్య లోకం నన్ను గుర్తించింది. అనేక పురస్కారాలు, అవార్డులు లభించాయి.
ఇప్పటివరకు 1000 రచనలకు పైగా పత్రికల్లో ముద్రణ అయ్యాయి. నలభైకి పైగా అవార్డులు పొందాను
ఇతర వివరాలుహిజ్రాలపై నేను రాసిన దీర్ఘ కావ్యం ”వై” ఆ పుస్తకమే సాహిత్యాకాశంలో నన్ను నిలబెట్టింది
ప్రతి జీవితం వెనుక ఒక కథ ఉంటుంది. ప్రతి కథలో బాధ, సంతోషం, కష్టం, నష్టం, గెలుపు, ఓటమి సహజం. అయితే జీవితంలో జరిగే ప్రతి విషయాన్నీ, సంఘటనను అనుభవంగా తీసుకోవాలి. ఓటమి అనేక పాఠాలు నేర్పిస్తుంది. ప్రతి విజయం వెనుక అనేక ఓటములు ఉంటాయి. అవే విజయానికి బాటలు వేస్తాయి. కవిగా, రచయితగా, విమర్శకుడిగా, అనువాదకుడిగా, భారతదేశంలో నెంబర్‌ వన్‌ స్వీయ ప్రచురణ వేదికైన ప్రతిలిపి తెలుగు విభాగాధిపతిగా సేవలు అందిస్తూ.. ఇప్పటికే 14 పుస్తకాలను రచించిన యువ కవి జాని తక్కెడశిల (అఖిలాశ) తెలుగు సాహిత్యంలోకి ఎలా వచ్చారు? 2016 నవంబర్‌ తొమ్మిదవ తేదిన తెలుగు సాహిత్యంలోకి వచ్చి స్వల్ప వ్యవధిలోనే 14 పుస్తకాలను ఎలా ముద్రించగలిగారు? కవిత్వం, కథ, నవల, విమర్శ, అనువాదం ఇలా ప్రక్రియ ఏదైనా తనదైన శైలిలో సాహిత్యాన్ని సృష్టిస్తూ… తెలుగు సాహిత్యానికి విశేష కృషి చేస్తున్న ”అఖిలాశ”.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికగర్భాన మోసేవు..!!(కవిత )- జాని.తక్కెడశిల ,
సంగ్రహ నమూనా రచనగర్భాన మోసేవు..!!(కవిత )- జాని.తక్కెడశిల ,

గర్భాన మోసేవు..!!(కవిత )- జాని.తక్కెడశిల ,

ఊపిరి ఇచ్చేవు..!!
జగత్తులోకి ఆహ్వానించేవు..!!
ప్రాణానికి ప్రాణమై పెంచేవు..!!
పాలిచ్చి పొట్ట నింపేవు..!!
నడకలు నేర్పేవు..!!
అమృత ప్రేమ పంచేవు..!!
ప్రతి అడుగులో అడుగు
వేసి నా వెంట ఉండేవు..!!
తల్లివై ఆశీర్వదించేవు..!!
నేస్తమై సుసలహాలిచ్చేవు..!!
గెలుపు ఓటములలో తోడుండేవు..!!
బ్రతకడం నేర్పేవు..!!
నాకై నీ సుఖాలనే త్యజించావు..!!
సర్వం నాకే ధారపోవు..!!
నాకు మార్గమును చూపెదవు..!!
నన్ను గమ్యానికి చేర్చెదవు..!!
అదరక బెదరక అడ్డంకులనే దాటేవు..!!
ఓర్పు నేర్పుతో అన్నింటిని చక్కదిద్దేవు..!!
సృష్టికి కారణమే నీవు..!!
ప్రతి సృష్టికి మూలమే నీవు..!!
తల్లిగా..చెల్లిగా..ఆలిగా..!!
ఎన్నో రూపలెత్తెదవు..!!
అన్ని రూపములలోనూ నీ వంతు..!!
బాధ్యతలు నెరవెర్చేదవు..!!
ఐనా.. నువ్వంటే ఎందుకో చులకన భావం
విషవాక్కులతో నిను హింసించెదము..!!
నడి రోడ్డుకు ఈడ్చెదము..!!
భిక్షగత్తెలా మార్చెదము..!!
ప్రతి నిమిషం నీ అస్తిత్వాన్ని
పోగొట్టేటందుకు ఎదురు చూసెదము..!!
కొడుకుగా..భర్తగా..!!
ఎన్నో రూపములెత్తెదము
నీ స్వాతంత్య్రమును తాకట్టు పెట్టి
నిన్ను బద్నామ్ చేసేందుకు..!!
మా వంతు కృషి చేసెదము..!!
నీ ఊపిరి పోయే వరకూ..!!
నీకు మా వల్ల ఈ ఇక్కట్లు ఎందుకో
నీ పాడె మోస్తామన్నది ఒక మిధ్య
నిన్ను పున్నామ నరకం
నుండి కాపాడతామనేది ఒక ప్రశ్న
సృష్టికి మూలమైన నిన్ను..!!
శూన్యంలో బందీ చేస్తూ రేపటికి
తెలియకుండా మర్చిపోతాము..!!
జాని.తక్కెడశిల ,

———–

You may also like...