| పేరు (ఆంగ్లం) | Gopal Sunkara |
| పేరు (తెలుగు) | గోపాల్ సుంకర |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | సుంకర కృష్ణయ్య |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | నెల్లూరు జిల్లా ఓజిలిరాచపాలెం |
| విద్యార్హతలు | Ph D |
| వృత్తి | కవి, అధ్యాపకులు |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | https://www.facebook.com/profile.php? |
| స్వీయ రచనలు | మా నాయన పాట’ కవితా సంపుటి |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | .నా కవిత్వానికి నేను పుట్టిన ఊరు ,ఇప్పుడు చూస్తున్న ప్రపంచం ప్రేరణగా నిలిచాయి. మా నాన్న వీధి భాగవతాలు ఆడే కళాకారుడు. అయితే నాకు ఊహ తెలిసిన తర్వాత ఆయన వేషం కట్టి పద్యం పాడటం చూడలేదు .కానీ ఎప్పుడైనా రాత్రి పూట ఆయన నోటి వెంట సారంగధర, చెంచులక్ష్మి ,దక్షయజ్ఞం ,మైరావణవధ లాంటి వీధి భాగవత పద్యాలు వినేవాడిని. మాది పల్లెటూరు కావడంతో మధ్యాహ్నం పూట మా నాన్న దగ్గరికి చుట్టూ ఉన్న కొంతమంది మిత్రులు వచ్చేవాళ్లు. మా నాయన వాళ్లకి భారత భాగవత రామాయణ కథల్ని జానపద శైలిలో వినిపించడం నాకు బాగా తెలుసు. 8 9 తరగతుల నాటికి నేను ప్రాస పదాలు ఉపయోగించి మాట్లాడేవాడిని .ఉపాధ్యాయ శిక్షణ నిమిత్తం అనంతపురం వెళ్ళాక రాధేయ గారి పరిచయం జరిగాక వచన కవిత్వ నిర్మాణం మీద పట్టు దొరికింది. 2008 నుండి రాస్తున్నప్పటికీ 2021 డిసెంబర్ నాటికి మా నాయన పాట తీసుకురావడం జరిగింది. చాలా ఆలస్యంగా పుస్తకం తీసుకురావడం వెనుక నా కవిత్వం నాకే పూర్తి తృప్తి ఇవ్వకపోవడం అనే భ్రమ లో ఉండి పోవడం. ఇప్పుడు అది రెండవ ముద్రణ కూడా రావడం చాలా సంతోషంగా ఉంది. సాహిత్యము ,సామాజికత ల మధ్య సమన్వయం ఉండాలి అనే సూత్రంతో నా కవిత్వాన్ని అంతర్లీనంగా నిర్మించుకున్నాను. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మా నాయన పాట’ కవితా సంపుటి |
| సంగ్రహ నమూనా రచన | మా నాయన పాట’ కవితా సంపుటి |
గోపాల్ సుంకర
మా నాయన పాట
తాగొచ్చిన రాత్రి
మా నాయన ఒక పాట వాడేవాడు
అందులో
పారే నీటి గొం తు ఉండేది
పాట
పాడుతూ పాడుతూ
ఎండుతున్న వరి గడ్డి స్వరం తో
కన్నీళ్ళు పెట్టుకునే వాడు
భూమి నీరు గాలి ఆకాశం అగ్ని
ఎవరివి అని అడిగేవాడు
హటాత్తుగా పాట నిలిపి
కథ అందుకునే వాడు
గూడు ని కోల్పో యిన పిట్ట కథ చెప్పేవాడు
గుడ్లనుడ్ల మింగేసిన పాము కథ చెప్పేవాడు
అప్పుడు ఆ స్వరం లో
ఉచ్చులో చిక్కుకున్న
ఉడతపిల్ల భయం ఉండేది
ఒరే నాయన
అడవి తగలబడి పొతోం ది
మనుషులు కూడా మండిపోతున్నారు అంటూ
ఓ సాకీ తీసేవాడు
ఎన్కౌం టర్ లో మరణిస్తూ
అరచిన ఉద్యమకారుని కేకలా ఉండేది
రావే వర్షమార్ష
పింఛం విప్ప వే మేఘమా
వడ్లు దంచవే మేఘమా అంటూ
ఓ జానపద గేయం ఎత్తుకునే వాడు
పాట వృత్తాలు వృత్తాలు గా అల్లుకునేది
ఒరే చిన్నోడా
యుద్దాల్ చేయాలంటే
గద లక్కర లేదు
గడ్డిపరక డ్డి చాలనేవాడు
ఆ మాటల్లో
ఎంటు లాంటి గట్టిదట్టి నం ఉండేది
ఆ పూట కూటి మాట లేదు
నిప్పు లాంటి స్వరపేటికతో
వేడి గా నిట్టూరుస్తూ
కలవరం కలవరం గా
నిద్రపోయేవాడు
జూన్ సారంగ లో ప్రచురితం
———–