ఆలూరి పార్థసారథి (Aluri Parthasarathy)

Share
పేరు (ఆంగ్లం)Aluri Parthasarathy
పేరు (తెలుగు)ఆలూరి పార్థసారథి
కలం పేరుఆపాసా
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరురాయ్‌పూర్‌లో (ప్రస్తుత ఛత్తిస్‌గఢ్ రాజధాని)
విద్యార్హతలు
వృత్తిరచయిత.
తెలిసిన ఇతర భాషలు
చిరునామాచెన్నై
ఈ-మెయిల్
ఫోను9840663930
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలుజలగండం
రంగులమేడ
లొల్లి
అర్థ-నారి
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలుhttps://kathanilayam.com/writer/9666
https://kinige.com/author/Aluri+Parthasarathi
https://telugu.pratilipi.com/user/
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుసామాన్య మధ్యతరగతి కుటుంబంలో ఎనిమిదిమంది అక్కచెల్లెళ్లు అన్నదమ్ముల మధ్య మధ్యముణ్ణి. పన్నెండేళ్ల చదువు విజయనగరంలో. ఆవూరు, పరిసరాలు, సంగీత సాహిత్య సంస్కృతీ సౌరభాలను ఆస్వాదిస్తూ ఎదిగే సౌభాగ్యం దక్కడం పూర్వజన్మ సుకృతం! రమారమి 40 సంవత్సరాలు గడిపింది కర్మక్షేత్రం రాయ్‌పూర్-భిలాయి ఇండస్ట్రియల్ ఏరియా చుట్టుపక్కలే. అదో మినీ ఇండియా. పదిహేనేళ్ళయి పిల్లల దగ్గర చెన్నైలో స్థిరనివాసం. మాది ముందునుంచి ఉమ్మడికుటుంబం, పెద్ద కుటుంబం కావడమే నాకు పెద్ద ప్లస్ పాయింటు. ఇంటి గురించి నేను పెద్దగా పట్టించుకోకపోయినా సరిపోయేది. అలా ఆడుతూపాడుతూ ఉద్యోగం చేస్తూ బి.కాం., ఎం.ఏ.(సమాజశాస్త్రం), ఎల్.ఎల్.బి. ప్రయివేటుగా చెయ్యగలిగాను. జ్యోతిశ్శాస్త్రం ముఖ్యంగా ప్రశ్నశాస్త్రం అధ్యయనం చెయ్యగలిగాను. కోలనీలో పిల్లలకి సరదాగా చదువు చెప్పేవాణ్ణి. కాలక్షేపానికి కథలు, నవలలు చదివేవాణ్ణి. ఆఫీసు తర్వాత ఇంట్లోనే కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం సరదాగా గడచిపోయేది. అప్పుడే రకరకాల మనుషులు, మనస్తత్వాలు, రాగద్వేషాలు, ఆదర్శాలు, అనుభవాలు, రాజకీయాలు వగైరా వగైరా మామధ్య చర్చకువచ్చేవి. అవన్నీ నా ఆలోచనలకి అంకురార్పణ చేస్తే, నా భార్యా పిల్లలు నీరు పోసి, ఎరువు వేశారు. వాటికి వివిధ దిన, వార, మాస పత్రికలిచ్చిన ప్రోత్సాహం తోడయి 2007-2013 మధ్య 3 డజన్ల కథలు, ఒక నవల ప్రచురితమయ్యాయి. తిరిగి ఇప్పుడే కలం దులిపేను. ఈమధ్యనే ఆంధ్రభూమి మాసపత్రికలో ఒక నవలా, ఆంధ్రభూమి వారపత్రికలో ఒక సీరియల్ ప్రచురితమయాయి. ప్రత్యేకించి ప్రతిలిపికోసమని రాసిన మరో రెండు సిరీస్ ప్రచురితమయ్యాయి. ఇంచుమించు అన్ని రసాలలోను రాశాను. అన్ని ప్రక్రియల్లోను నా రచనల్ని పాఠకులు ఆదరించారు. కొన్ని కథలు, నవలలు బహుమతులందుకున్నాయి.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికలొల్లి – ఆపాసా
సంగ్రహ నమూనా రచనలొల్లి – ఆపాసా
పెళ్ళికొడుకు అక్క జాహ్నవి, ఫలహారాల దగ్గర ఏదో గొడవ చేస్తోందని తెలిసి, పెళ్ళికూతురు తండ్రి వెంకట్రామయ్యగారు పరుగు పరుగున అక్కడకి చేరారు. ఆమెకీ, పెళ్ళికొడుక్కీ ఎదురుగా టేబుల్¬పై ఉన్న ప్లేట్లలో వెన్నలాటి మెత్తటి ఇడ్లీలు ఆవిర్లు కక్కుతున్నాయి. నంజుకోవడానికి కొబ్బరి చట్నీ, కారప్పొడి, మరో రెండు చట్నీలు ఘుమఘుమలాడుతూ నోరూరిస్తున్నాయి. అయినా ఎవరూ టిఫిన్లు ముట్టుకోలేదు.
కేటరర్ గణపతి, జాహ్నవికెదురుగా దోషిలా తలవంచుకుని నిలబడ్డాడు. జాహ్నవి మొహం ఎఱ్ఱగా మంటలు చిమ్ముతోంది. వెంకట్రామయ్యగారికి విషయం అర్థమైపోయింది. ఆమె కోరిన ‘ఉల్లి చట్నీ లేదుగా!’ అనుకున్నారు.

లొల్లి – ఆపాసా

పెళ్ళి కొడుకు అక్క జాహ్న వి,
ఫలహారాల దగ్గర ఏదో గొడవ
చేస్తోం దని తెలిసి, పెళ్ళికూతురు
తం డ్రి వెం కట్రామయ్య గారు పరుగు
పరుగున అక్క డకి చేరారు. ఆమెకీ,
పెళ్ళి కొడుక్కీ ఎదురుగా టేబుల్పై
ఉన్న ప్లేట్లలో వెన్న లాటి మెత్తటి
ఇడ్లీలు ఆవిర్లు కక్కు తున్నా యి.
నం జుకోవడానికి కొబ్బ రి చట్నీ ,
కారప్పొ డి, మరో రెం డు చట్నీ లు
ఘుమఘుమలాడుతూ
నోరూరిస్తున్నా యి. అయినా ఎవరూ
టిఫిన్లు ముట్టుకోలేదు.

కేటరర్ గణపతి, జాహ్న వికెదురుగా దోషిలా తలవం చుకుని నిలబడ్డాడు. జాహ్న వి మొహం ఎఱ్ఱగా మం టలు చిమ్ముతోం ది. వెం కట్రామయ్య గారికి విషయం
అర్థమైపోయింది. ఆమె కోరిన ‘ఉల్లి చట్నీ లేదుగా!’ అనుకున్నా రు.

———–

You may also like...