ఆసు బాబూ రాజేంద్ర ప్రసాద్ (Aasu Rajendra)

Share
పేరు (ఆంగ్లం)Aasu Rajendra
పేరు (తెలుగు)ఆసు బాబూ రాజేంద్ర ప్రసాద్
కలం పేరుఆసు రాజేంద్ర
తల్లిపేరునాగమణి
తండ్రి పేరుబలరాం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ20/07/1955
మరణం
పుట్టిన ఊరుఅమలాపురం
విద్యార్హతలుఎస్.బి.కె.ఆర్ కళాశాలలో బి.కాం చదివారు
వృత్తివృత్తి వ్యాపారం అయితే ప్రవృత్తి కవిత్వం.
ఆయన కవితలు కొన్ని హిందీ, ఇంగ్లీషులో అనువదించబడ్డాయి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttps://www.youtube.com/channel/UCn6j5ZV4
స్వీయ రచనలు• వంటింటి సాహిత్యం (ఆసు హాస్య కవితలు) – 1981
• గుండె చప్పుళ్ళు (మినీకవితల మాక్సీ సంపుటి) -1981
• నాలుగు దిక్కులు (కవితా సంకలనం) – 1981
• పడగ కింద పసితనం (దీర్ఘ వచన కవిత) – 1983
• రాజకీయ భాగోతం (వచన కవితలు) – 1997
• కార్డియోగ్రాఫ్ (మనోవిశ్లేషణ కవితలు) – 1990
• దివ్యధారం (ఆధ్యాత్మిక స్రవంటి) చైతన్య కవిత – 1998
• ప్రకృతి ఒడిలో (హైకూలు) చైతన్య కవిత – 2000
• అంతర్ముఖం – కోనసీమ వాయిస్ రెగ్యులర్ ఫీచర్స్
అముద్రిత రచనలు
1. ప్రకృతి ఒడిలో (500 హైకూల పెద్ద సంపుటి)
2. గోరంత దీపాలు (సూక్తులు)
3. చకచక బండి (బాలగేయాలు)
4. ఆల్చిప్పలో సముద్రం (మినీ కథల సంపుటి)
5. మౌన సముద్రం (వచన కవితలు)
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు1986 : మైసూరు వారి ధ్వన్యాలోక సంస్థ వారిచే రెసిడెంట్ ఫెలోషిప్ పురస్కారం.
స్వర్ణ నంది, ఐదు కాంస్యనందులు పురస్కారాలు గెలుచుకున్న అమరజీవి నాటకానికి పాటలను రచించాడు
ఆసు రాజేంద్ర ప్రముఖ కథా రచయిత. ఆయనకు 1981లో “గుండె చప్పుళ్ళు ” రచనకు గానూ ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది.
ఇతర వివరాలు1972 లో సమతా రచయిల సంఘ సంఘం సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా బాధ్యతన నిర్వహించారు. 1980లో కోనసీమ ఫిల్మ్ సొసైటీ లిమిటెడ్ ఎడిటోరియల్ బోర్దు మెంబరుగా ఉన్నారు. 1987లో కళాసాహితీ సాహితీ సాంస్కృతిక సంస్థ కోనసీమ విభాగానికి ప్రతినిధిగా వ్యవహరించారు. అనేక కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక“కోనసీమ మినీ కవితలు” – ఆసు. రాజేంద్ర.
సంగ్రహ నమూనా రచన

ఆసు రాజేంద్ర

ఆసు రాజేంద్ర ప్రముఖ కథా రచయిత. ఆయనకు 1981లో “గుండె చప్పుళ్ళు ” రచనకు గానూ ఫ్రీవర్స్ ఫ్రంట్ పురస్కారం లభించింది.

 కవులు మరిచిపోయారు

కవులు

అన్నీ మరిచిపోయారు

కరవాలం తిప్పడం మానేసి

కారుడ్రైవింగు నేర్చుకుంటున్నారు

కాగడాలు వెలిగించడం వదిలేసి

కలర్‌ లైట్లు వేయడంలో నిమగ్నమయ్యారు

కవులు

అన్నీ మరిచిపోయారు

ఊరు కాలిపోతుంటే

ఇంటిపోరులో మునిగిపోయారు

ఆర్తనాదాలు వినిపిస్తుంటే

అడ్డుగోడలు లేపుకుంటున్నారు

కవులు

అన్నీ మరిచిపోయారు

అడవుల్లో కూంబింగు జరుగుతుంటే

అవార్డుల లిస్టుల్లో పేర్లు వెదుక్కుంటున్నారు

ఎన్‌కౌంటర్లకు ఎడతెరిపి లేనప్పుడు

పాస్‌పోర్టు కోసం లైన్లో నిలుచుంటున్నారు

కవులు

అన్నీ మరిచిపోయారు

అస్త్రాలను దాచేసి

వీసాలు కొంటున్నారు

విమానాల్లో తిరుగుతూ

సాహిత్యాన్ని సమీక్షిస్తున్నారు

కవులు

అన్నీ మరిచిపోయారు

ఆరునెలలు పిల్లలనాడిస్తూ

అమెరికాలో గడుపుతున్నారు

ఇండియాకు తిరిగి వచ్చాక

ఎదుటివాళ్ల తప్పులు వెదుకుతున్నారు

కవులు

అన్నీ మరిచిపోయారు

ఎప్పుడు ఏది రాసినా

వాళ్లదే నిజమంటున్నారు

సంశయాలు వెలిబుచ్చితే

మల్టీ డైమెన్షన్లని భుజాలు తడుముకుంటున్నారు

కవులు

అన్నీ మరిచిపోయారు

విదేశాల్లో కవిత్వం రాసి

స్వదేశంలో ఆవిష్కరిస్తున్నారు

సంచనాలు చెలరేపి

సాహిత్య పేజీలన్నీ ఆక్రమిస్తున్నారు

కవులు

అన్నీ మరిచిపోయారు

రాగానే ఒకటి, వెళ్లే ముందింకొక్కటి

సభలు పెట్టి శాసిస్తున్నారు

నిబద్ధత వదిలేసి

దబాయించడం నేర్చుకున్నారు

కవులు

అన్నీ మరిచిపోయారు

కవిత్వాన్ని పక్కన పారేసి

ప్రచారం చేసుకోవడంలో మునిగిపోయారు

 

 

 

 

ముద్రిత గ్రంథాలు

    ·         వంటింటి సాహిత్యం (ఆసు హాస్య కవితలు) – 1981

  •         గుండె చప్పుళ్ళు (మినీకవితల మాక్సీ సంపుటి) -1981
  •         నాలుగు దిక్కులు (కవితా సంకలనం) – 1981
  •         పడగ కింద పసితనం (దీర్ఘ వచన కవిత) – 1983
  •         రాజకీయ భాగోతం (వచన కవితలు) – 1997
  •         కార్డియోగ్రాఫ్ (మనోవిశ్లేషణ కవితలు) – 1990
  •         దివ్యధారం (ఆధ్యాత్మిక స్రవంటి) చైతన్య కవిత – 1998
  •         ప్రకృతి ఒడిలో (హైకూలు) చైతన్య కవిత – 2000
  •         అంతర్ముఖం – కోనసీమ వాయిస్ రెగ్యులర్ ఫీచర్స్

సాహిత్య కార్యక్రమాలు1972 లో సమతా రచయిల సంఘ సంఘం సభ్యునిగా, కార్యదర్శిగా, అధ్యక్షునిగా బాధ్యతన నిర్వహించారు. 1980లో కోనసీమ ఫిల్మ్‌ సొసైటీ లిమిటెడ్ ఎడిటోరియల్ బోర్దు మెంబరుగా ఉన్నారు. 1987లో కళాసాహితీ సాహితీ సాంస్కృతిక సంస్థ కోనసీమ విభాగానికి ప్రతినిధిగా వ్యవహరించారు. అనేక కవి సమ్మేళనాలలో పాల్గొన్నారు.

అముద్రిత రచనలు

1.   ప్రకృతి ఒడిలో (500 హైకూల పెద్ద సంపుటి)

  1.   గోరంత దీపాలు (సూక్తులు)
  2.   చకచక బండి (బాలగేయాలు)
  3.   ఆల్చిప్పలో సముద్రం (మినీ కథల సంపుటి)
  4.   మౌన సముద్రం (వచన కవితలు)

పురస్కారాలు

·         1986 : మైసూరు వారి ధ్వన్యాలోక సంస్థ వారిచే రెసిడెంట్ ఫెలోషిప్ పురస్కారం.

  •         స్వర్ణ నంది, ఐదు కాంస్యనందులు పురస్కారాలు గెలుచుకున్న అమరజీవి నాటకానికి పాటలను రచించాడు.

———–

You may also like...