| పేరు (ఆంగ్లం) | AK PRABHAKAR |
| పేరు (తెలుగు) | ఏ కే ప్రభాకర్ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | విశ్రాంత ఉపాధ్యాయులు |
| తెలిసిన ఇతర భాషలు | కన్నడ |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | తెలుగు కన్నడ రాష్ట్రాల్లో 35 సంవత్సరాలు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయిన ఎ.కె. ప్రభాకర్ ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాససంపుటి వెలువరించారు. |
| ఇతర రచనలు | https://pustakam.net/?tag=articles-by-a-k-prabhakar |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | నంబూరి పరిపూర్ణ కథల్లో స్త్రీ పాత్రలు |
| సంగ్రహ నమూనా రచన | “నంబూరి పరిపూర్ణ – ఈ పేరు తలుచుకోగానే నాకు నిండైన ఒక స్త్రీ మూర్తి కళ్ళ ముందు సాక్షాత్కారమౌతుంది. అనేకమైన ఒడిదుడుకుల నధిగమించి జీవిత శిఖరాల నధిరోహించిన ధీశాలిని దర్శనమిస్తుంది. నటిగా, గాయనిగా రంగస్థల – సినిమా కళారంగాల్లోకి బాల్యంలోనే ప్రవేశించినప్పటికీ స్త్రీల సమస్యలపై రేడియో ప్రసంగ కర్తగా, వ్యాసకర్తగా యుక్త వయస్సులోనే నిర్దిష్ట భావజాలంతో, తనదైన ముద్రతో పేరు తెచ్చుకున్నప్పటికీ సృజనాత్మక సాహిత్యంలోకి ఆమె ఆలస్యంగానే అడుగుపెట్టారు. ప్రగతిశీలమైన కుటుంబ నేపథ్యం – విద్యార్థి దశ నుంచే సామాజిక రాజకీయ సాంస్కృతిక రంగాల్లో ఆ జీవితం కృషిచేసిన దర్శి చెంచయ్య లాంటి విప్లవ కారుల, మహీధర రామ్మోహన రావు వంటి అభ్యుదయ రచయితల, బాలాంత్రపు రజనీకాంతరావు, మాస్టర్ వేణు వంటి సంగీత విద్వాంసుల, వేదాంతం రాఘవయ్య వంటి కళా నిష్ణాతుల వద్ద శిక్షణ ఆమె ‘వెలుగు దారుల్లో …’ నడవడానికి తోడ్పడ్డాయి. కమ్యూనిస్టు నాయకుడు దాసరి నాగభూషణంతో సాహచర్యం – యెడబాటుల దరిమిలా వుద్యోగినిగా కుటుంబ భారాన్ని మోస్తూ, వొంటరి స్త్రీగా పురుషాధిపత్య సమాజంలో యెన్నో సవాళ్లనెదుర్కొంటూ పొందిన జీవితానుభవం, కళ్ళ ముందే సొంత పిల్లలు కథన రంగంలో వుండటం … యివన్నీ పరిపూర్ణ గారు సృజనాత్మక రచయితగా రూపొందడానికి భూమికనేర్పరిచాయి.” |