| పేరు (ఆంగ్లం) | Dr. T Radhakrushnamacharyulu |
| పేరు (తెలుగు) | డా.టి.రాధాకృష్ణమాచార్యులు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | సీనియర్ వైద్యులు, ప్రముఖ కవి , రచయిత , అనువాదకుడు , సమీక్షకులు. |
| తెలిసిన ఇతర భాషలు | ఇంగ్లీష్ |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | 5 సంకలనాలు తెలుగు కవిత్వం లో 1999 నుంచి కరీంనగర్ నుండి పబ్లిష్ చేసారు . నలిమెల భాస్కర్ ” సాహితీ సుమాలు ‘ , వివిధ భారతీయ భాషల్లోని సాహితీవేత్తల పరిచయ సంకలనాన్ని “The Speaking Roots “ Title తో ఆంగ్లం లోకి అనువాదం చేశారు. |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | https://telugu.asianetnews.com/literature/dr-t-radha-krishnamacharyulu-telugu-poem-qxx4q5 https://telugu.asianetnews.com/literature/dr-t-radha-krishnamacharyulu-poem-rdbl9r https://sanchika.com/akshara-maidaanam-drtr-poem/ https://sanchika.com/shanti-kosam-viswa-geetam-poem/ |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | డా.టి.రాధాకృష్ణమాచార్యుల హైకూలు : బతుకు నడక |
| సంగ్రహ నమూనా రచన | డా.టి.రాధాకృష్ణమాచార్యుల హైకూలు : బతుకు నడక తెలుగు సాహిత్యంలో హైకూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కొన్ని హైకూలను ‘ బతుకు నడక ‘లో చదవండి : మనిషి కదా కొమ్ములతో కుమ్మేసే బతుకు ఆపు అమ్మను తిన్నా మట్టిని దోచుకున్నా మౌనంలో మనం హద్దులు లేని నాగరికత ఏందో కన్ను గానకా శ్రమ సేద్యం ఏకధాటి వర్షమే అదో బతుకు! స్నేహం తల్లిగా కష్టాలూ కన్నీళ్ళలో ఈతే జీవితం |
డా.టి.రాధాకృష్ణమాచార్యులు
డా.టి.రాధాకృష్ణమాచార్యుల హైకూలు : బతుకు నడక
తెలుగు సాహిత్యంలో హైకూలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కొన్ని హైకూలను ‘ బతుకు నడక ‘లో చదవండి :
మనిషి కదా
కొమ్ములతో కుమ్మేసే
బతుకు ఆపు
అమ్మను తిన్నా
మట్టిని దోచుకున్నా
మౌనంలో మనం
హద్దులు లేని
నాగరికత ఏందో
కన్ను గానకా
శ్రమ సేద్యం
ఏకధాటి వర్షమే
అదో బతుకు!
స్నేహం తల్లిగా
కష్టాలూ కన్నీళ్ళలో
ఈతే జీవితం
డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : రెండు బిందువుల మధ్య
జీవమే జీవితమై తడబడని హారంలా జీవించాలని డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత “రెండు బిందువుల” మధ్య ఇక్కడ చదవండి:
రెండు బిందువుల మధ్య
నడిచిన దారిలో దూరం
ఆ రెండు బిందువుల నడుమ
సాచిన రెక్కల ఎగిరిన వేగం
ఆ రెండు బిందువుల మధ్యన
సన్నని గీతలు కలిసే కాల రేఖలు
ఆ రేఖలు నవ జీవన మయూఖలూ
కొన్ని మాత్రం వక్ర భాషణ తిమిరాలూ
కాలమూ వేగము గుణకంలో దూరం ప్రతిఫలించు
జీవమే జీవితమై తడబడని హారంలా జీవించు
లెక్కలు మనిషికి చిక్కులు విడదీయు సూత్రం
అక్కున చేరిన కలిసిన దిక్కులు
విడి విడి బంధం
సరళరేఖా సంస్కృతిలో నిజ ద్వారాలున్నవి
వక్ర రేఖలో ఎగుడు దిగుడు అపస్వరాల కృతి ఆకృతులున్నయ్
చెక్కిలి జారిన వర్ణంలో వర్షం బిందువులు
పుక్కిట పట్టిన జ్ఞానంలో హర్షం
అక్షర జీవాలు
మనిషి ఋషి అయినప్పుడు చూడు
బహుశా రెండు బిందువుల మధ్య
దూర తీరాలు మట్టి రేణువులుగా
సమతల ఆకాశంలో గరిక పోచలే అంతా.
మధుర పరిమళ కావ్యం – డా.టి.రాధాకృష్ణమాచార్యులు
ఇంత తీయని అమృతం
ఎక్కడిది
జాబిలి కురిసిందా
రాత్రి వెన్నెలతో కలిసి
ఆకులు తాకిన గాలీ
పూలు వీచిన పరిమళం
మధురిమతో అల్లుకున్నదా తీగలా
చీకటిలో వెలుగుంది
ఎంతో అందంగా వెన్నెలలా
మనసు పాటలో లయ హృద్యమై
ఆకాశ తారలు వెలిగే కాంతి దారిలో
నిశీధిలో లోతుల నిశ్శబ్ద శబ్దం పారే
నేలంతా మౌనం మనిషి జాగృతమే
మనిషి మాట అమృతం కురిస్తే
జగమే మధుర పరిమళ కావ్యం
రసాస్వాదమే అమేయ జీవగుణం
———–