| పేరు (ఆంగ్లం) | Ayyalasomayajula Subrahmanyam |
| పేరు (తెలుగు) | అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | రచయిత, |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | ప్రాణధార (కథ) , మురిపాల ముచ్చట్లు, పగలూ రేయి నీ ధ్యాసలోనే ,వినమ్రతా కుసుమాలతో అర్చన |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | · ప్రాణధార (కథ) – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము |
| సంగ్రహ నమూనా రచన | ” మరణం ఆసన్నమైనదని నాకు తెలుస్తోంది.నలభైఐదు సంవత్సరాల వయస్సు లోనే ఆ దేవుడు నన్ను జీవిత చరమ దశకు చేర్చి తన లోకానికి ఆహ్వానిస్తున్నాడు. మరణం నివారించ లేనిదని నాకు తెలుసు ,కానీ బాధ్యతలు ఇంకా నిర్వహించాల్సి వుంది.ముగ్గురు ఆడపిల్లల తండ్రిని.నేను వెళ్ళిపోతే , ఆ తరువాత నా భార్యా పిల్లల భవితవ్యం గురించే నా ఆందోళన. హైదరాబాద్ లోని నిగమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ లో కిడ్నీలు పనిచేయని స్థితిలో చేర్చిన నాకు ప్రస్తుతం డయాలిసిస్తో జీవం పోస్తున్నారు.నీరు,నీరు,నీరు। నా శరీరం మొత్తంలో నీరు నిలిచిపోయి , మాలిన్యాలన్నీ మరణ కారకాలౌతున్నాయి.”అంటూ చెప్పాను నేను నా బెడ్ ప్రక్కనే పడుకుని ఉన్న మరో కిడ్నీ పేషెంట్ అటెండర్తో. అతను జాలిగా నా వైపు చూశాడు. |
అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
· ప్రాణధార (కథ) – అయ్యలసోమయాజుల సుబ్రహ్మణ్యము
” మరణం ఆసన్నమైనదని నాకు తెలుస్తోంది.నలభైఐదు సంవత్సరాల వయస్సు లోనే ఆ దేవుడు నన్ను జీవిత చరమ దశకు చేర్చి తన లోకానికి ఆహ్వానిస్తున్నాడు.
మరణం నివారించ లేనిదని నాకు తెలుసు ,కానీ బాధ్యతలు ఇంకా నిర్వహించాల్సి వుంది.ముగ్గురు ఆడపిల్లల తండ్రిని.నేను వెళ్ళిపోతే , ఆ తరువాత నా భార్యా పిల్లల భవితవ్యం గురించే నా ఆందోళన.
హైదరాబాద్ లోని నిగమ్ మల్టీ స్పెషాలిటీ హాస్పటల్ లో కిడ్నీలు పనిచేయని స్థితిలో చేర్చిన నాకు ప్రస్తుతం డయాలిసిస్తో జీవం పోస్తున్నారు.నీరు,నీరు,నీరు। నా శరీరం మొత్తంలో నీరు నిలిచిపోయి , మాలిన్యాలన్నీ మరణ కారకాలౌతున్నాయి.”అంటూ చెప్పాను నేను నా బెడ్ ప్రక్కనే పడుకుని ఉన్న మరో కిడ్నీ పేషెంట్ అటెండర్తో. అతను జాలిగా నా వైపు చూశాడు.
” మీ పేరు చెప్పారు కాదు?అయినా ఇంత చిన్న వయసులో కిడ్నీ ఫెయిల్యూర్ ఎందుకేంది” అని అడిగాడతను.మరణానికి దగ్గరలో ఉన్న నన్ను గమనించి, నా పై దయతో జాలితో ప్రశ్నిస్తున్న అతనికి జవాబు చెప్పాలనిపించింది.అతని ద్వారా నా
గురించి కొందరికైనా తెలిసి, జాగ్రత్తలు తీసుకొన్న వారెవరికైనా మేలు జరిగితే మంచిదే కదా?అందుకే నా వివరాలన్నీ చెప్పడం ప్రారంభించాను.
” నా పేరు వెంకటయ్య.మాది గుంటూరు జిల్లా చిలకలూరిపేట.మధ్యతరగతి కుటుంబం మాది.నాకు మొదటి నుంచి అధికరక్తపోటు వుండేది.కాని నేను గమనించలేదు.మందులు వాడేవాడిని కాదు.సిగరెట్లు తెగ తాగేవాడిని.అందుకు తోడు ప్రతిరోజూ మధ్యం తీసుకునేవాడిని.రక్తపోటు అధికంగా వుండేదేమో……కాళ్ళలో,చేతుల్లో నీరు చేరి వాపులు ప్రారంభమయ్యాయి.మొహం
లోనూ వాపులు ప్రారంభమయ్యాయి.మా ఊరికి దగ్గరలోని వైద్యునికి చూపిస్తే కొన్ని అలోపతి మందులు రాసిచ్చారు.వాటిని వాడినా ఫలితం కనపడలేదు.కొందరు వైద్యులు కామెర్ల వ్యాధి అనీ,మరొక వైద్యుడు కడుపులో అల్సర్ వుందనీ తేల్చి ఔష
ధాలు ఇచ్చారు.కాని నాలోనిమౌలిక అనారోగ్యసమస్యలు మాత్రం పరిష్కారం కాలేదు .వైద్యులు సరైన డయాగ్నిసిస్ చేయడంలో కొంత విఫలమయ్యారు.రానురాను మూత్ర విసర్జన పరిమాణం తగ్గింది.వాంతులు, ఎక్కిళ్ళు ప్రారంభమై సమస్య జటిలంగా
మారింది.కొందరి సలహా మేరకు గుంటూరు లోని కిడ్నీకి సంబంధించిన నిపుణుడిని సంప్రదించాం.ఆయన బ్లడ్ యూరియా సిరమ్ క్రియేటినిస్ టెస్టులు చేయించుకోమని సూచించారు.
ఇదిలా ఉంటే ఒకరోజు నాకు జరిగిన అనుభవం భయంకరమైనది.ఆ అనుభవాన్ని ఇంకా మరువలేను.అనారోగ్యంతో అలా సతమతమౌతుండగా ఒక రోజు బాత్‌రూమ్ కి వెళ్ళాను.విసర్జనకోసం తాపత్రయ పడుతూంటే అకస్మాత్తుగా నాకేదో
జరిగింది.పరిసరాలను మరిచిపోతున్నాను.శరీరం మొత్తం ధారాపాతంగా చెమటలు రావడం ప్రారంభమయ్యాయి.జరగరానిదేదో జరిగిపోతోందని భావించి నేనేఎవరికీ చెప్పకుండా హోమియోపతి స్పెషలిస్ట్ దగ్గరకు వెళ్ళాను.ఆయన ఇచ్చిన ఔషదం కొంత తాత్కాలిక ఉపశమనం కల్పించింది.తిరిగి ఇంటికి వచ్చేశాను.మళ్ళీ మరికొన్ని రోజులకు నాకు పక్షవాతం వచ్చింది.నోరు కొంచెం వంకర పోయింది.నోటిమాట పడిపోయింది.నా భార్య బసవమ్మ పడిన ఆందోళన అంతా ఇంతా కాదు . నా జీవితం ఏడుకొండలవాని దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉంది.
తరువాత చేయించిన టెస్ట్‌ల ఫలితాలు మా కుటుంబం మొత్తాన్ని ఆందోళనకు గురిచేశాయి.నార్మల్ గా(45ఎమ్.జీ.శాతం) వుండాల్సిన బ్లడ్ యూరియా పెరుగుదల ప్రమాదస్థాయిని దాటింది.అలాగే నార్మల్(1.5ఎంజీ) గా వుండాల్సిన సెరమ్ క్రియాటినస్ కూడా ఆందోళనకర స్థాయిలోనే ఉండింది.నా పరిస్థితి సీరియస్ గా వుందని ఇక్కడికి(నిగమ్స్ కి) రిఫర్ చేశారు.మా బాస్ అన్నగారే ఈనిగమ్స్ ఎం.డీ.
అప్పుడు నన్ను నిగమ్స్ లో చేర్చారు.నాకైతే ఎక్కడ ఎడ్మిట్ చేసింది కూడా జ్ఞాపకం లేదు.మొదట నన్ను న్యూరాలజీ వార్డ్‌లో జాయిన్ చేసి నా పెరాలసిస్ చికిత్స ప్రారంభించారట.ఆ వార్డ్ లోనే వుంచుతూ యూరియా క్రియాటినిస్ టెస్ట్‌లు
చేశారు.ఫలితాలు అసాధారణంగా ఆందోళనకరంగా వచ్చాయి.బ్లడ్ యూరియా ఫలితాలు అదే విధంగా వున్నాయి.అలా ఇరవై రోజులు న్యూరాలజీ,నెఫ్రాలజీ నిష్ణాతులు వైద్యం చేస్తుండగా ఒకరోజు అర్థరాత్రి అకస్మాత్తుగా కోమాలో నుంచి కోలుకుని పరిస
రాలను గమనించాను.నేను ఎక్కడ వున్నానో నాకు అర్థం కాలేదు.కాని నన్ను కనిపెట్టుకునే ఉన్న నాభార్య బసవమ్మ జరిగినదంతా కొద్దికొద్దిగా చెప్పింది.ఏది ఏమైనా నేను కొంతవరకు పక్షవాతం నుంచి కోలుకున్నాను.ఆ తరువాత నన్ను నెఫ్రాలజీ విభాగానికి మార్చారు.ఆ మార్చడంలో ఆసుపత్రికి సంబంధించిన ఎన్నో ఇబ్బందుల నెదుర్కొన్నాను.చివరికెలాగైతేనేం.ఒక బెడ్ సంపాదించగలిగాను.ఇక అక్కడ నుంచి కిడ్నీ ఫెయిల్యూర్ చికిత్స ప్రారంభించారు.
నేను కోమానుంచి బయటపడ్డానే కాని , ఊపిరితిత్తులలో వాపులు పెరిగాయి. పొట్టలో నీరు చేరింది.శ్వాస పీల్చుకోవడం కష్టంగా వుండేది.నా బాధలు ఎవరికి చెప్పాలన్నా నోటినుంచి పూర్తిగా శబ్దం రాని స్థితి నాది.హాస్పటల్ లో డాక్టర్లు నన్ను
పర్యవేక్షిస్తూనే వున్నారు.వృషణాల సంచీ బాగా వాచిపోయింది.అందులో కూడా నీరు చేరింది.పరిస్థితి ఏమీ బాగోలేదని నాకు తెలుస్తునే వుంది.
మరుసటి రోజు చావు కబురు చల్లగా చెప్పారు.” పెరిటోరియల్ డయాలసిస్” అవసరమని డాక్టర్ల బృందం తేల్చారు.అప్పటినుంచి ప్రారంభమైంది నా మరణయాతన.వారానికి మూడు సార్లు డయాలసిస్ చేస్తేకాని నేను బ్రతకనని చెప్పారు.డయాలసిస్
చేయడమంటే రక్తాన్ని వడబోసి శుభ్రం చేయడమే। ఈ శారీరక బాధలో భగవంతుడు నన్ను కొంత దయతోనే వీక్షిస్తున్నాడు. నాకు మూత్రం ధారాళంగా రాకున్నా రోజుకు 200మి.లీ. మూత్రం మాత్రం విసర్జించ గలుగుతున్నాను.అది కూడా
ఆగిపోయిందంటే నా పని సరి! గుడ్డిలో ‘మెల్ల’ గా నా మెదడు కాస్త పదునుగానే వుంది.
ఆలోచనలు చేయగలుగుతున్నాను.పెరిటోరియల్ డయాలసిస్ ఆర్థికంగా కృంగదీసే వైద్యప్రక్రియ.డయాలసిస్ చేసిన ప్రతీసారీ 3000 రూపాయల దాకా ఖర్చు అవుతోంది.అలా వారానికి పన్నెండు వేల ఖర్చు! నెలకి ఏబై వేలు! ఎక్కడ నుంచి తేగలదు నాభార్య? ఉన్న ఆస్థిపాస్థులు పొదుపు చేసిన డబ్బు నీరులా ఖర్చవుతోంది. స్నేహితిలు ,ఇతర సంస్థలు ఆర్థిక సహాయం చేస్తూనే వున్నారు.అలా ఎంతకాలం బ్రతకాలి? అయినా నేను బ్రతుకుతానన్న ఆశ మాత్రం వైద్యులు కల్పించడం లేదు. అలా దాదాపు రెండు నెలలు గడిచాయి.మూడు లక్షల దాకా ఖర్చయ్యింది.
పెరిటోరియల్ డయాలసిస్‌కి మారుగా మరేదైనా పరిష్కారం వుందేమోననే ఆశ మా కుటుంబసభ్యులకు కలిగింది. నాకు మాత్రం శాశ్వత నిద్ర పరిష్కారం గా తోస్తోంది.ఎంతని ఖర్చు పెట్టగలం? ఆ మరునాడు అనుకొంటా నా భార్య కిడ్నీ స్పెష
లిస్ట్‌ని అడిగింది.డయాలసిస్ కి మించిన పరిష్కారం లేదా? అని.
” లేకేమమ్మా। కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయగలిగుతే పరిష్కారం లభించవచ్చు” అన్నాడు డాక్టర్.ఆయన మిగతా వివరాలు కూడా చెప్పాడు.కిడ్నీదాత లభ్యమై చెడిపోయిన కిడ్నీ తీసేసీ దాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంట్ చేస్తే.అదంతా పెద్ద తతంగం.వెంకటయ్య
శరీరం దాత కిడ్నిని ఆమోహదిస్తుందా లేదా పరీక్షించాలి.ఆమోదించగలిగే కిడ్నీ లభించగలిగితే దాని ట్రాన్స్‌ప్లాంటేషన్ కి కనీసం 4లక్షల ఖర్చు అవుతుంది.సక్సెస్‌ఫుల్‌గా ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసిన తరువాత కనీసం సంవత్సరం పాటు పేషెంట్ డాక్టర్ల పర్యవేక్షన లో వుండాలి.ఇందుకు నెలకి దాదాపు ఏబై వేలదాకా ఖర్చవుతుంది.ఒకవేళ ఆ తరువాత సమస్యలుంటే మాత్రం పరిష్కారాలకి మరింత
ఖర్చవుతుంది.ఏతావాతా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఖర్చు లక్షల్లో వుంటుంది.ఇదంతా మా తాహతుకు మించినది. పెరిటోరియల్ డయాలసిషే చాలా కాలం చేయించ గల పరిస్థితులే లేవు.ఇంక కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎక్కడ? అప్పటికే నా చికిత్స ఖర్చు
4 లక్షల రూపాయలు మించిపోయింది.ట్రాన్స్‌ప్లాంటేషన్ కోసం ప్రయత్నిద్దామంటే కిడ్నీదాత లభించి, పోస్ట్‌ఆపరేషన్ ఖర్చు తడిసి మోపెడు కాకమానదు.ధైర్యం చేసి ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకున్నా , చివరివరకు బ్రతుకుతానన్న గ్యారంటీ లేదు.
చావో, రేవో తేల్చుకోవాలిసిన సమయమిది.అక్కడికి రూమ్‌చార్జ్‌స్, కన్సల్‌టేషన్ ఫీజులు బాగా తగ్గించారు.నేను శారీరకంగా, మానసికంగా కృంగిపోయి వున్నాను.
నా భార్య ‘ బసవమ్మ’పరిస్థితీ అంతే! ఏడుకొండలవానిపై భారం వేశాం!ఇక ఆయనే మాకు చీకటిబ్రతుకులో ధృవతారగా దారి చూపాలి. సి.జి.హెచ్.ఎస్. లో పనిచేసే మా బంధువు రూపంలో వెంకన్నబాబు మార్గదర్శిగా మారాడు.మా బంధువుకు డా।। ప్రభాత్ గారు బాగా తెలుసు. ఆయన సుప్రసిద్ద ఆయుర్వేద వైద్యులు.ఈ పరిచయం నా వైద్యానికి బాగా ఉపకరించింది.ఆయుర్వేదం
లో ఎమ్.ఎస్. చేసారు.ప్రభాత్ గారు ఆయుర్వేద వైద్యులుగా ప్రాక్టీసు చేయుచున్నారు. సహజమైన సృజతనాత్మకత కలిగివున్నారు. ఏదో చదువుకున్నాం.ఏదో పాసయ్యాం! ఇక డబ్బు సంపాదనే తరువాయి అనే విరుద్ధభావాలు ప్రభాత్ గారిలో లేవు.
తన వృత్తి వైద్యం, ప్రవృత్తి ఆయుర్వేద వైద్యంలో శోధన!
సర్వేభవంతు సుఖినా
సర్వేసంతు నిరామయా
సర్వేభద్రాని పశ్యంతు
మా కశ్చిత్ దుఃఖభాగ్ భవేత్
అనే మౌలిక సిద్దాంతాన్ని నమ్ముకొన్న సాంప్రదాయ వైద్యులు వారు”.చరకసంహిత”లో చెప్పినట్లు
” సర్వం ద్రవ్యమ్ పంచభౌ తిక మస్మిన్నార్థే” గా స్థావర జంగమాదిలోని ప్రతి ద్రవ్యంలో ఉన్నటువంటి పంచ భూత సృష్టికి మంచి ఔషదాలు అని భావించే డా।। ప్రభాత్ గారు మనిషి మనుగడకు అవసరమైన మౌలికమైన రక్తశుద్ది , రక్తవృద్ది కోసం పరిశోధనలు చేశారు.రక్తశుద్ది చేయగల కిడ్నీల ప్రాధాన్యత ను గుర్తించి అందు కవసరమైన చికిత్స కోసం నిరంతరం శోధనలు చేసి
చక్కటి ఔషదాలు తయారు చేశారు.ఈ ఔషదాల తయారీలో సేవానిరతి తప్ప కీర్తి కండూతి లేని వైద్యులు.
పూర్వ రూప ,రూప, సంప్రాప్తి, ఉపశయ, , అష్టవిధ పరీక్ష అనే పరీక్షలు నిర్వహించి వైద్యం చేసే వారు డా।। ప్రభాత్ గారు.నా గురించి మా బంధువులాయన వివరంగా ప్రభాత్ గారికి చెప్పారు. వెంకటయ్య గారూ। మీరు అలోపతిని కొద్దికాలం ప్రక్కన పెట్టి ఆయుర్వేదం ఎందుకు ప్రయత్నం చేయకూడదూ? అని ప్రశ్నించారు.
” కిడ్నీట్రాన్స్‌ప్లాంటేషన్ స్టేజిలో ఆయుర్వేదమా? రిస్క్ తీసుకోవడం కదా?అని నా భార్య ‘బసవమ్మ ‘ అంది.
” ఇప్పుడు మాత్రం రిస్క్‌లో లేమా?నేను వైద్యవిధానాల గురించి చర్చించే ఉద్దేశంతో చెప్పడం లేదు.దాదాపు సంవత్సరన్నరపాటూ అల్లోపతి వాడుతూనే వున్నారు.తగ్గ లేదు.సరికదా కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ దాకా వచ్చింది.ఆ తరువాతనైనా అదృష్టం
పైనే ఆధారపడాలి కదా! కొంతకాలం ఆయుర్వేదం వాడదాం , నా అభిప్రాయం అని హితభోద చేశారు.ఇంక నేను సరేనన్నాను
డా।।ప్రాభాత్ గారు కిడ్నీ చికిత్స కు గొప్ప ఔషదాలను తయారు చేశారు.ధాతువుల లోని రక్తధాతువు గురించి వారికి తెలియని విషయం లేదు. అలా తెలిసింది డా।। ప్రభాత్ గారి గురించి.అంతకు ముందు మెడికల్ హిస్టరీ అంతా తీసుకెళ్ళాం.డాక్టర్ గారి వదనం లోని ప్రశాంతత,నవ్వు,పేషెంట్స్ ను చూసే విధానం, ఆ పద్దతిలో ఒక పవిత్రత వుంది.ఎందుకో వారిని చూడగానే నా భార్య ఒక మాట అన్నది.
” హిపోక్రసీ, ఈగో లాంటివి లేకుండా డాక్టరుగారు సాంప్రదాయబద్దంగా ఉన్నారు. వైద్యుడే దైవం అంటారు కదా!” అని ప్రశంసించింది.
డా।।ప్రభాత్ గారు మా రిపోర్టులన్నీ చూశారు.కాషేపు ఆలోచనలో పడ్డారు.చివరిలో నన్నో ప్రశ్న అడిగారు.”. వెంకటయ్య గారూ, మీ యూరినేషన్ ప్రతిరోజు ఏ మాత్రం వుంటుంది.” అన్నారు.
పేషెంట్ కన్నా తన ప్రశ్న కు ఎలాంటి సమాధానం వస్తుందోనని ఆయన ఆతృతగా ఎదురు చూశారు.
” దాదాపు ప్రతిరోజు 250 మి.లీ.యూరినేషన్ వుందండీ” అన్నాను. డాక్టరు గారు రిలిఫ్ గా ఫీలయ్యారు.
“వెంకటయ్య గారూ, ఇక ఆందోళన పడాల్సిన అవసరం లేదు.మీకు తప్పకుండా నయమౌతుంది.” అంటూ అభయ హస్తం ఇచ్చి, చల్లని కబురు చెప్పారు.తిరిగి ఆయన మాట్లాడుతూ ” మీకు యూరినేషన్ లేకుండా వుంటే నేను చేయగలిగిందేమీ వుండేది కాదు.250 మి.లీ.యురినేషన్ ప్రస్తుతం వుంది కనుక ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు” అంటూ అభయం ఇచ్చారు .నా కైతే సంతోషానికి అవధులు లేవు .నా భార్య్ బసవమ్మ డాక్టర్ గారినిలా అడిగింది
” మరీ! నిగమ్స్ లో కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలని అన్నారు కదండీ” అని.
” చూడమ్మా, యూరిన్ అవుట్‌పుట్ వుంది కనుక కిడ్నీలు ఇంకా చికిత్సకు స్పందిస్తున్నాయన్నమాట! వాళ్ళిచ్చిన రిపోర్ట్స్ ప్రకారం వెంకటయ్య గారికి స్టెరాయిడ్స్ ఇచ్చారు.అందువల్ల కొంత నష్టం జరిగింది.అందుకే యూరియా క్రియాటినిస్ అసాధారణ స్థాయికి చేరింది. మీరు మరింత ఆలస్యం చేసి వుంటే బహుశాః నేనేం చేయలేకపోయేవాణ్ణేమో. కాని ప్రస్తుత పరిస్థితిని బట్టి నేను వైద్యం చేయగలను……. ధైర్యంగా వుండండి” అంటూ సవివరంగా తెలిపారు.
మరుసటి రోజు నుంచే చికిత్స ప్రారంభించారు.
చంద్రప్రభావటి—– గోక్షురాది గుగ్గులు—- పునర్నవాది గుగ్గులు , పునర్నవాది కషాయము ఔషదములతో చికిత్స ప్రారంభమయ్యింది. చంద్రప్రభావటి.- దూరదృష్టిగల మహర్షులు ఒక వ్యాధికిగాని,ఒక ఔషదానికి గాని పేరు పెట్టారంటే అది ఎంతో అర్థవంతంగా ,నిగూఢ రహస్యార్థం కలిగి ఉంటుంది.
చంద్రప్రభావటి అంటే చంద్రునితో సమానమైన తేజస్సు , శక్తి బలము అని అర్థము. చంద్రుడు విశ్వంలో పెరిగే వనమూలికలు, వృక్షాలు ,ధాన్యాలు ,కూరగాయలు , రకరకాల జీవజాతికంతటికి ఆహ్లాదాన్ని ,బలాన్ని, వీర్యాన్ని ,శక్తిని పెంచుతూ వాటి పెరుగుదలకు ఉపకరిస్తాడు.అంటే చంద్రప్రభావటి తీసుకున్నవాళ్ళలో చంద్రునితో సమానమైన తేజస్సుని, బలాన్ని, శక్తిని ,పౌష్టిని పెంచుతుంది.శరీరంలో ఓజస్సుని, వ్యాధినిరోధకశక్తిని పెంచుతుంది.శరీరంలో ఉన్న సమస్త కణజాలము ఆరోగ్యవంతం
గా, పుష్టిగా పెరుగుతాయన్నమాట.చంద్రప్రభావటి సమస్త రోగాలను హరించగల శక్తి ఉన్నదని అర్థం. గోక్షురాది గుగ్గులు.– పల్లేరు కాయలతో చేసే మందు.ఇంకా ఇతర వనమూలికలు వున్నాయి.
నేను డా!! ప్రభాత్ గారు ఇచ్చిన మందులు వాడుతూ డయలసిస్ చేయించుకొంటునే వున్నాను.మొదట మూడు రోజులకొకసారి చేయించాల్సి ఉండేది.అలా 60 డయాలసిస్ లు అయ్యాయి.డా।।ప్రభాత్ గారి ఔషదాలు మొదలుపెట్టిన పిదప 10
రోజులకొకసారి చేయించుకోవాల్సి వచ్చింది.మూడు నెలల్లో డయాలసిస్ అవసరం లేకుండాపోయింది.ఒక సంవత్సరము పాటు మందులు వాడాను.తరువాత వాటి అవసరం లేకుండా పోయింది.కాని మమ్మల్ని,నిగమ్ హాస్పటల్ వైద్యులను ఆశ్చర్యా
నికి గురి చేస్తూ డయాసలిస్, డయాలసిస్ కి మధ్య వ్యవధి పెరుగుతూ వచ్చింది.
మాలో ఆశలు చిగురుస్తూనే వున్నాయి.డయాలసిస్ నెలకి ఒకసారి మాత్రమే చేయించుకొనే స్థితికి రాగానే డా।।ప్రభాత్ గారి చికిత్స లోని మహత్తర ఆయుర్వేద విశిష్టత మాకు అవగతం అయ్యింది.రానురాను మరణం దూరం కావడం ప్రారంభ
మైంది.ఆరోగ్యం కుదుట పడసాగింది.శరీరంలో వాపులు తగ్గుముఖం పట్టాయి. మూత్రం ధారాళంగా రావటం ఆరంభమైంది.హాస్పటల్ డాక్టర్లే ఆశ్చర్యపోయారు.
అలా దాదాపు మూడు నెలలు డా।। ప్రభాత్ గారి వద్ర చికిత్స తీసుకున్నాను.
“వైద్యో నారాయణోహరిః అన్నారు కదా। నిజంగా ధన్వంతరీ సాంప్రదాయరీతులకు డా।। ప్రభాత్ గారు ప్రతీకలనవచ్చు.
ప్రస్తుతం నేను పూర్తిగా కోలుకున్నాను.ఇప్పుడు డయాలసిస్ అవసరం లేని పరిస్థితి నాది.మాటలు కూడా బాగా వచ్చినవి.నాకు ఇంకా ఆయుష్షు వుంది.నేనిప్పుడు నా భార్యా పిల్లలతో నా ఊరికి చేరుకున్నాను.ఔషదాలు వేసుకొంటూ రక్తపోటును నియం
త్రణలో వుంచుకొంటున్నాను.డా।। ప్రభాత్ గారి సూచనలననుసరించి చెడు అలవాట్లకు దూరంగా వుంటున్నాను.జీవితంలోని పరమావధి తెలిసింది.నేను మరో 20 మందికి చెప్పాను.వారికి కూడా నయం అయ్యింది.’ సమాజ సేవలో నిమగ్నమై సక్రమంగా పనులు నిర్వహిస్తున్నాను’.
ఇదండీ నా అమర(ణ) వాజ్మూలం ।
మరి ఆయుర్వేదము ప్రాణధార యే కదా!
———–