తలతోటి పృథ్విరాజ్ (Thalathoti Prudviraj)

Share
పేరు (ఆంగ్లం)Thalathoti Prudviraj
పేరు (తెలుగు)తలతోటి పృథ్విరాజ్
కలం పేరుపృథ్వి,కవితలతోటి,నవ్య
తల్లిపేరుసామ్రాజ్యం
తండ్రి పేరుసత్యానందం
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ25726
మరణం
పుట్టిన ఊరుకావలి,నెల్లూరుజిల్లా
విద్యార్హతలుఆచార్య పర్వతనేని సుబ్బారావు మార్గదర్శకత్వంలో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆత్రేయ సినిమా సంభాషణల మీద పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాడు
వృత్తితెలుగు అధ్యాపకుడు, హైకూ కవి
తెలిసిన ఇతర భాషలు
చిరునామావిశాఖపట్నం
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttps://talathoti.blogspot.com/
స్వీయ రచనలు(అ)మనిషి (జూలై 1999):
(ఆ)మనిషిలో (జూలై 1999):
(ఇ)నల్ల దొరలు (మార్చి 2000):
(ఈ)అడుగులు (అక్టోబర్ 2004):
(ఉ)కవితలతోటి (మార్చి 2005):
(ఊ)కూనలమ్మ పదాలు (అముద్రితం):
1.6.2.హైకూ కవితా సంపుటులు :
(అ)వెన్నెల (ఫిబ్రవరి 2000):
(ఆ)చినుకులు (ఏప్రిల్ 2000):
(ఇ)వసంతం (మార్చి 2001):
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుప్రముఖ తెలుగు కవి. ఆధునిక కవిత్వ ప్రక్రియలలో ఒకటైన హైకూరచనలో విశేష కృషి చేస్తున్నాడు. హైకూను ఇంటిపేరుగా మార్చుకున్న పృథ్విరాజ్ ఇండియన్ హైకూ క్లబ్‌ను స్థాపించి, హైకూ ప్రక్రియా వ్యాప్తికి తోడ్పడుతున్నాడు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవెన్నెల- తలతోటి పృథ్విరాజ్ కొన్ని హైకూలు నెలవంక సంపుటి నుండి…
సంగ్రహ నమూనా రచనదూరంగా కొండ / ఉళ్ళోకి మోసుకొచ్చింది గాలి/ గుడిగంటల శబ్దాన్ని
01) తెలియని ఉరొచ్చే బాటసారికి / ఎవరో/ చుక్కాణిని చేశారు పచ్చికను.
02) శిశిర ఋతువు/ చెట్లలో దాగిన పక్షుల పొదరిళ్ళను/ ప్రదర్శిస్తోంది…
03) ఉదయాన్నే / పక్షులతోపాటు గిలకబావీ/ అరుస్తోంది…
04) వెన్నెల నిండినట్లుంది/ నురగలతో కుండ / పొంగి పొర్లుతూ ఈత చెట్టున …
05) నన్నిలాగే ప్రేమించండి/ కలిసిన మట్టిలోనే మళ్ళీ పుడతా/ ఏ చెట్టుగానో …దాని పువ్వుగానో

తలతోటి పృథ్విరాజ్

   వెన్నెల- తలతోటి పృథ్విరాజ్

కొన్ని హైకూలు నెలవంక సంపుటి నుండి

దూరంగా కొండ / ఉళ్ళోకి మోసుకొచ్చింది గాలి/ గుడిగంటల శబ్దాన్ని

01) తెలియని ఉరొచ్చే బాటసారికి / ఎవరో/ చుక్కాణిని చేశారు పచ్చికను.

02) శిశిర ఋతువు/ చెట్లలో దాగిన పక్షుల పొదరిళ్ళను/ ప్రదర్శిస్తోంది

03) ఉదయాన్నే / పక్షులతోపాటు గిలకబావీ/ అరుస్తోంది

04) వెన్నెల నిండినట్లుంది/ నురగలతో కుండ / పొంగి పొర్లుతూ ఈత చెట్టున

05) నన్నిలాగే ప్రేమించండి/ కలిసిన మట్టిలోనే మళ్ళీ పుడతా/ చెట్టుగానోదాని పువ్వుగానో

  • ·       వసంతం

కొన్ని హైకూలు వసంతం సంపుటి నుండి… 01) బడిపిల్లల థ్యాంక్స్/సెలవిప్పించిన/వర్షానికి. 02) కథ సగంలోనే/నిద్రలోకి జారుకుంది/ఊకొట్టే పాపాయి. 03) నగరానికి సర్కస్ కంపెనీ,/పిల్లలకీజంతువులకీ కాసేపు/బోన్ లనుంచి విడుదల! 04) ఇప్పటికీ పదిలమే/బాల్య స్మృతులుపుస్తకాల్లో/దాచుకున్న నెమలి పించాల్లా 05) రోజూ ఇలానే…/ఎంతకీ చిక్కని సూరీడు/నిరాశతో తిరిగొచ్చే పక్షులు. 06) నూతిలోని తాబేలుకి/తోడుగా కప్పలు/వారికి తోడుగా జాబిలి! 07) వానాకాలం వచ్చింది./బావులూ చెరువుల్లో మర్లా/ఆకాశం పుట్టింది! 08) వర్షం వచ్చి/ రంగుల వంతెనేసింది/ నింగికీ నేలకు! 09) ఎంత బాగుండు/సొంత గూడైనా ఉండేది/పక్షినై ఉంటే! 10) ఇంట్లో చేరా/వర్షాకాలానికిగాని తెల్సింది/అద్దెంతివ్వొచ్చో! 11)

  •       రోజుకో సూర్యుడు

కొన్ని హైకూలు రోజుకో సూర్యుడుసంపుటి నుండి… 01) పూలవనం యింటాయనిదే!/సీతాకోక చిలుకలుమాత్రం/తోటమాలి నేస్తంలైనాయి. 02) జన్మనిచ్చిన ఋణం తీర్చుకుంటున్నాయి/రాలిపడిన ఆకులు/ఎరువై చెట్టుకు బలాన్నిస్తున్నాయి. 03) మింగేస్తుంది/నోరు తెరుచుకున్న కొండ/రోజుకో సూర్యుడ్ని… 04) రోజుకో సూర్యుడ్ని/మింగబట్టేనేమో…/అగ్నిపర్వతమయింది 05) చినుకు ముద్దుకు/ సిగ్గుతో ముడుచుకుంటోంది/ టచ్మీనాట్ 06) చలికి వణుకుతున్నా సరే…/తెల్లరేదాక నదిని ఈదుతూ/పున్నమి చంద్రుడు! 07) గూటికి చేరి/మళ్ళీ ఎగిరెళ్తూ పక్షులు-/సూర్య గ్రహణం! 08) ప్రత్యక్షమయ్యాయి/తప్పిపోయాయనుకున్న గొర్రెలు/దిగుడు బావిలోంచి! 09) ఆస్వాదించేందుకు/వచ్చి వెళ్తున్నాయి పక్షులుమంచెపై/డబ్బా గలగలల సంగీతం కోసం! 10) పోటా పోటీతో/మేల్కొల్పు గీతం/కాకులూకోళ్ళూ. 11) మంటలతో అడవి./పాపం గడ్డి పొదల్లో/పక్షుల పొద రిళ్ళూపిల్లలు 12) చినుకుల రాయబారితో/నింగికి నేలతల్లి ప్రత్యుత్తరం/పుడమి పరిమళం! 13) వానొచ్చిందంటే/అజ్ఞాతవాసం ముగిసినట్లే-/వానబాములు. 14) కక్ష్యలో తిరుగుతూ గ్రహాలు/కక్ష్యతప్పి కక్షలతో/మనుషులు! 15) బాహ్య సౌందర్యానికి/బ్యూటీ క్లీనిక్ లు…/ఆత్మ సౌందర్యానికి?! 16) మేస్తోంది మేక/సభ్యతను పాటించమంటూ-/గోడమీది అశ్లీల పోస్టర్లని… 17) జననమొక దు:ఖారంభం/మరణమొక సుఖారంభం/సగటు మనిషి 18) వరికుప్పల నూర్పిడి/పక్షుల్తో పాటు పేదలు-/పరిగెల కోసం 19) తల్లిదాచిన లడ్డూలకై/ వెదికే పసి కళ్ళకు దోవచూపుతూ/నల్ల చీమలు 20) పల్లె పిల్లలకు/తూగుడు బల్ల/బందికానుమానే 21) 22) 23) 25) 26) 27) 28) 29) 30)

  •   వసంతం

కొన్ని హైకూలు వసంతం సంపుటి నుండి… 01) బడిపిల్లల థ్యాంక్స్/సెలవిప్పించిన/వర్షానికి. 02) కథ సగంలోనే/నిద్రలోకి జారుకుంది/ఊకొట్టే పాపాయి. 03) నగరానికి సర్కస్ కంపెనీ,/పిల్లలకీ-జంతువులకీ కాసేపు/బోన్ లనుంచి విడుదల! 04) ఇప్పటికీ పదిలమే/బాల్య స్మృతులు -పుస్తకాల్లో/దాచుకున్న నెమలి పించాల్లా 05) రోజూ ఇలానే…/ఎంతకీ చిక్కని సూరీడు/నిరాశతో తిరిగొచ్చే పక్షులు. 06) నూతిలోని తాబేలుకి/తోడుగా కప్పలు/వారికి తోడుగా జాబిలి! 07) వానాకాలం వచ్చింది./బావులూ చెరువుల్లో మర్లా/ఆకాశం పుట్టింది! 08) వర్షం వచ్చి/ రంగుల వంతెనేసింది/ నింగికీ నేలకు! 09) ఎంత బాగుండు/సొంత గూడైనా ఉండేది/పక్షినై ఉంటే! 10) ఓ ఇంట్లో చేరా/వర్షాకాలానికిగాని తెల్సింది/అద్దెంతివ్వొచ్చో! 11)

(ఈ)రోజుకో సూర్యుడు …(డిసెంబర్ 2001):

  •   రోజుకో సూర్యుడు…

 

కొన్ని హైకూలు రోజుకో సూర్యుడు… సంపుటి నుండి… 01) పూలవనం ఆ యింటాయనిదే!/సీతాకోక చిలుకలుమాత్రం/తోటమాలి నేస్తంలైనాయి. 02) జన్మనిచ్చిన ఋణం తీర్చుకుంటున్నాయి/రాలిపడిన ఆకులు/ఎరువై చెట్టుకు బలాన్నిస్తున్నాయి. 03) మింగేస్తుంది/నోరు తెరుచుకున్న కొండ/రోజుకో సూర్యుడ్ని… 04) రోజుకో సూర్యుడ్ని/మింగబట్టేనేమో…/అగ్నిపర్వతమయింది 05) చినుకు ముద్దుకు/ సిగ్గుతో ముడుచుకుంటోంది/ టచ్మీనాట్ 06) చలికి వణుకుతున్నా సరే…/తెల్లరేదాక నదిని ఈదుతూ/పున్నమి చంద్రుడు! 07) గూటికి చేరి/మళ్ళీ ఎగిరెళ్తూ పక్షులు-/సూర్య గ్రహణం! 08) ప్రత్యక్షమయ్యాయి/తప్పిపోయాయనుకున్న గొర్రెలు/దిగుడు బావిలోంచి! 09) ఆస్వాదించేందుకు/వచ్చి వెళ్తున్నాయి పక్షులు-మంచెపై/డబ్బా గలగలల సంగీతం కోసం! 10) పోటా పోటీతో/మేల్కొల్పు గీతం/కాకులూ …కోళ్ళూ. 11) మంటలతో అడవి./పాపం గడ్డి పొదల్లో/పక్షుల పొద రిళ్ళూ…పిల్లలు 12) చినుకుల రాయబారితో/నింగికి నేలతల్లి ప్రత్యుత్తరం/పుడమి పరిమళం! 13) వానొచ్చిందంటే/అజ్ఞాతవాసం ముగిసినట్లే-/వానబాములు. 14) కక్ష్యలో తిరుగుతూ గ్రహాలు/కక్ష్యతప్పి కక్షలతో/మనుషులు! 15) బాహ్య సౌందర్యానికి/బ్యూటీ క్లీనిక్ లు…/ఆత్మ సౌందర్యానికి?! 16) మేస్తోంది మేక/సభ్యతను పాటించమంటూ-/గోడమీది అశ్లీల పోస్టర్లని… 17) జననమొక దు:ఖారంభం/మరణమొక సుఖారంభం/సగటు మనిషి 18) వరికుప్పల నూర్పిడి/పక్షుల్తో పాటు పేదలు-/పరిగెల కోసం 19) తల్లిదాచిన లడ్డూలకై/ వెదికే పసి కళ్ళకు దోవచూపుతూ/నల్ల చీమలు 20) పల్లె పిల్లలకు/తూగుడు బల్ల/బందికానుమానే

———–

You may also like...