అవనిశ్రీ వీరేశ్ (Avani Sri Veeresh)

Share
పేరు (ఆంగ్లం)Avani Sri Veeresh
పేరు (తెలుగు)అవనిశ్రీ వీరేశ్
కలం పేరుఅవనిశ్రీ
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుజోగులాంబ గద్వాల జిల్లా,మల్దకల్ మండలం, దాసరిపల్లి
విద్యార్హతలుdegree
వృత్తివచన కవిత్వం, పాటలు, సమకాలినాంశాలపై వివిధ పత్రికల్లో వ్యాసాలు రాస్తున్నారు.
తెలిసిన ఇతర భాషలు
చిరునామాజోగులాంబ గద్వాల జిల్లా,మల్దకల్ మండలం, దాసరిపల్లి
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకెhttps://www.facebook.com/groups/kavisangamam/p
స్వీయ రచనలు|| నేను రాయలేని కావ్యం ||
మట్టి కుదురు
ఆపతి
ఇసుర్రాయి
గుడిసె
ఇతర రచనలు
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులుజోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడిన తొలి ఏడాదే తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఉత్తమకవిగా అప్పటి కలెక్టర్ రజత్ కుమార్ షైని చేతుల మీదుగా అవార్డు స్వీకరించారు.
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షిక|| నేను రాయలేని కావ్యం || – అవనిశ్రీ.
సంగ్రహ నమూనా రచన|| నేను రాయలేని కావ్యం || – అవనిశ్రీ.
నేను కాలి చెప్పు గురించి రాస్తాను
తల కిరీటం గురించైతే రాయలేను
రాయాలని మునంబట్టిన
నా కలం వంగిపోయి
నా వేళ్లు వణికిపోతాయి.
నేను అణువు గురించి ఏకంగా
మహగ్రంధమే రాసేయగలను

 అవనిశ్రీ వీరేశ్

|| నేను రాయలేని కావ్యం ||      – అవనిశ్రీ.

నేను కాలి చెప్పు గురించి రాస్తాను

తల కిరీటం గురించైతే రాయలేను

రాయాలని మునంబట్టిన

నా కలం వంగిపోయి

నా వేళ్లు వణికిపోతాయి.

నేను అణువు గురించి ఏకంగా

మహగ్రంధమే రాసేయగలను

శిఖరం గురించి

ఒక్క పదమైన రాయలేను

రాయటానికి నాలో భావం రగిలిన

గుండెకు గండిపడి నాలో

కవిత్వం ఆత్మహత్య చేసుకుంటుంది.

మట్టి గురించి రాయగలను

నా తనువంతట ఒకసారీ పూసుకోని

తన్మయత్వం చెంది కావ్యామాలనే రాసేయ్యగలను‌.

నేను బిచ్చగాడి గురించి రాయగలను

వాడు అడుక్కోచ్చిన పాసినబువ్వలో

పులిసిన పులుసుపోసుకోని కమ్మగా

ఎండిన కొమ్మనీడలో ముచ్చటిస్తూ

ముత్యాలమెరుపులొలికే కావ్యకవనాలను

ఆనందంగా రాయగలను.

చక్రవర్తి గురించైతే నాకలం రాయలేనని

నాతో రంకుబెట్టుకోని రచ్చబండపై న్యాయమాడుతుంది.

రైతు గురించి రాయగలదు

నలగదున్నుతున్న నల్లరేగడి గడ్డలలో తిరుగుతూ

రాజు గురించైతే రాయలేదు

అతి వినయంగా చేతులుగట్టుకోని

నిలబడే ధూర్తలక్ష్యణం

నాకలానికి నచ్చదంటే నచ్చదు.

నీ గురించి రాయమంటవా రాస్తుంది

వాడి పొగడ్తల కోసం పొరపాటున కూడ

నా జేబుదిగి కిందికి రాదు నాకలం.

జనాల కోసమైతే చెప్పు

కాలికి దుమ్మంటిన కాగడా వెలిగినట్లే

కాగితంపై రాస్తూ కవాతు చేస్తుంది

వాడెవడో

ప్రపంచ అధినేత ఐన రాయలేదు నా కలం.

నా కడుపుమంటను చల్లార్చటం కోసం

ఒకడి పంచనజేరి పడుపుకూడు కోసం

జనమిచ్చిన నాకలం బహుబలాన్ని

వాడుకోని పగ్గంపొడవున్న పాటనైతే రాయలేను.

ఈ సబ్బండ ప్రజలిచ్చిన

కవియనే కిరీటాన్ని

గుండెపగిలి చచ్చిపోతున్న

నేనైతే తాకట్టు పెట్టలేను.

ఇది నేను చేసే భాస కాదు

కవిజగత్తుకంతటికి

వర్తించే

ప్రతిజ్ఞ.

9985419424.

———–

You may also like...