| పేరు (ఆంగ్లం) | Gattupalli Balakrushna |
| పేరు (తెలుగు) | గట్టుపల్లి బాలకృష్ణమూర్తి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | లలితాంబ |
| తండ్రి పేరు | గోపాలకృష్ణయ్య |
| జీవిత భాగస్వామి పేరు | సరోజ |
| పుట్టినతేదీ | 05-11-1948 |
| మరణం | – |
| పుట్టిన ఊరు | ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు |
| విద్యార్హతలు | – |
| వృత్తి | స్టేటుబ్యాంక్ అఫ్ ఇండియాలో ఉద్యోగం |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | • నాటికలు: స్పందన, ఆనందం, హరిత, సంకల్పం, విజన్ 2047, లబ్ డబ్, మంచోడు, తలుపు చప్పుడు,[5] తెర తీయరా! నీలోనే! • నాటకాలు: బృందావనం, మనసులు కలిస్తే, నాటకం |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | జిల్లాస్థాయి కందుకూరి పురస్కారం – ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, 30 ఏప్రిల్ 2017. |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
గట్టుపల్లి బాలకృష్ణమూర్తి (జి.బి.కె. మూర్తి)
గట్టుపల్లి బాలకృష్ణమూర్తి (జి.బి.కె. మూర్తి) నటుడిగా… రచయితగా బహుముఖ ప్రజ్ఞాశాలి.
తెలుగు నాటకరంగ నటుడు, రచయిత, దర్శకుడు. ప్రియదర్శిని నెల్లూరు కళా సంస్థ ద్వారా అనేక నాటక ప్రదర్శనలు చేశాడు
9 సంవత్సరాల వయసులో 1957లో తన తోటి మిత్రులతో కలిసి “లవకుశ” నాటికలోని లక్ష్మణుడి పాత్రలో నాటకరంగంలోకి ప్రవేశించాడు. అలా అర్ధణ, అణా టిక్కెట్టు పెట్టి ప్రదర్శనలు ఇచ్చాడు. 1967లో కావలిలో జవహర్ భారతి కాలేజీలో “మానవుడు” నాటికలో తాత పాత్ర ద్వారా గుర్తింపు పొందాడు.
1975 నుండి 1999 వరకు బ్యాంక్ పోటీలలో నటించాడు. ఆ సమయంలో మూర్తికి అనేకమంది నాటక ప్రముఖులతో పరిచయం పెరిగింది. వారితో కలిసి అనేక నాటక ప్రదర్శనల్లో పాల్గొన్నాడు. 1973 – 74 మధ్యకాలంలో ఏలూరు తెలుగు దర్బార్ నాటక పరిషత్ లో మొదటిసారిగా గూడూరు సంస్థ ప్రదర్శించిన “వైకుంఠపాళి” నాటకం ద్వారా పరిషత్తు నటుడిగా రంగప్రవేశం చేశాడు. 2004లో నాటక రచనను ప్రారంభించి 11 నాటికలు, 3 నాటకాలు రాశాడు.
———–