| పేరు (ఆంగ్లం) | Bhurgula Ramakrishnarao |
| పేరు (తెలుగు) | బూర్గుల రామకృష్ణారావు |
| కలం పేరు | – |
| తల్లిపేరు | రంగనాయకమ్మ |
| తండ్రి పేరు | పుల్లమరాజు నరసింగరావు |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | 13-03-1899 |
| మరణం | 14-09-1967 |
| పుట్టిన ఊరు | పడకల్లు గ్రామం, కల్వకుర్తి, మహబూబ్ నగర్ జిల్లా |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | ఆంగ్లం, పార్శీ, ఉర్దూ, సంస్కృతం, మహారాష్ట్రం, కన్నడం |
| చిరునామా | షాద్ నగర్ తాలూకా బూర్గుల గ్రామం |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | – |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | – |
| సంగ్రహ నమూనా రచన | – |
బూర్గుల రామకృష్ణారావు
బహు భాషా కోవిదుడు, ఉత్తమ సాహితీవేత్త, గొప్ప సంస్కర్త, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, అనేక రంగాల్లో ఆరితేరిన ప్రతిభావంతుడు అప్పటి కాలానికి అనుగుణంగా తెలుగు, ఉర్దూ, పార్శీ భాషలు నేర్చుకుని తమ 11వ యేట హైదరాబాద్ ధర్మవంత్ ఉన్నత పాఠశాలలో మాధ్యమిక విద్యనభ్యసించారు. బొంబాయి విశ్వవిద్యాలయంలో న్యాయశాస్త్రం అభ్యసించి ఎల్.ఎల్.బి. పట్టాను పొందారు. న్యాయశాస్త్ర విద్యార్థిగా ఉన్నప్పుడు ఇండియన్ సోషల్ రీఫార్మర్ పత్రికలో వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ ఆంగ్లంలో వ్యాసాలు రాసి పాఠకులు, సంపాదకుల మన్ననలు పొందారు.1922లో ఆంగ్ల ప్రభుత్వం వారు బీరార్ ను నిజాంకు ఇచ్చివేయాలని కూడా పై పత్రికల్లోనూ, ఉర్దూ పత్రికల్లోనూ వ్యాసాలు రాశారు. విద్యాభ్యాసం ముగించిన తర్వాత రామకృష్ణారావు గారు హైదరాబాద్ లో 1923 నుంచి న్యాయవాద వృత్తిని అవలంభించారు. మొదట బారిస్టర్ మహ్మద్ అజ్ ఘర్ వద్ద నాలుగు సంవత్సరాలు పనిచేసి తర్వాత హైదరాబాద్ (ఉర్దూ), సికింద్రాబాద్ (ఇంగ్లీష్) న్యాయస్థానాల్లో స్వతంత్రంగా న్యాయవాద వృత్తిని కొనసాగించారు. న్యాయవాదిగా చాలా కేసులు ఉచితంగా వాదించి విశాల హృదయాన్ని ప్రదర్శించారు. న్యాయపరిరక్షణకు పాటుపడడమే కాకుండా గొప్ప న్యాయవాదిగా ప్రఖ్యాతి గడించారు. పి.వి.నరసింహారావు వీరివద్ద జూనియర్ గా పనిచేశారు.
సమకాలీన సాహిత్య రంగంలోని ఉద్యమాల చేత ప్రేరేపితులైన బూర్గుల కలం నుంచి తరుణ వయస్సులో భావగీతాలు వెలువడ్డాయి. కృష్ణశాస్త్రి, నండూరి మొదలగు కవుల చేత ప్రభావితులై ప్రణయ భావ రమ్యమైన పద్య, గేయ ఖండికలు వెలువరించారు. వారి తొలికావ్యం శ్రీకృష్ణ శతకం (1956), పద్యాలు ‘పుష్పాంజలి’ పేరుతో (1984) ప్రచురితమైనాయి.
ఖాదీ బోర్డు విచారణ సంఘం, మధ్యప్రదేశ్ విషయ పరిశీలన సంఘం, ఆంధ్రప్రదేశ్ భారత్ సేవక సమాజం మొదలైన వానికి వారు అధ్యక్షులుగా ఉన్నారు. చరిత్ర, శాస్త్ర విజ్ఞానాల, తెలుగు, ఉర్దూ అకాడమీ, భారతీయ విద్యా భవన్ (ఆంధ్రప్రదేశ్ సంఘం), ప్రశాంతి విద్వత్ పరిషత్ (ఆంధ్రప్రభుత్వ శాఖ) అధ్యక్షులుగా వారు సలిపిన సాంస్కృతిక సేవ ప్రశంసనీయం. క్లాసికల్ లాంగ్వేజీ కమిషన్ అధ్యక్షులుగా, దక్షిణ భారత హిందీ ప్రచార సభ (మద్రాసు కేంద్రం), సంస్కృత విశ్వపరిషత్ ఉపాధ్యక్షులుగా భాషా రంగంలో కూడా వీరు అపారమైన కృషిచేశారు. శ్రీ బూర్గుల బహు భాషావేత్త. ఆంగ్లం, పార్శీ, ఉర్దూ, సంస్కృతం, మహారాష్ట్రం, కన్నడం తెలుగు భాషల్లో పండితుడు. న్యాయవాద వృత్తిలో ఉన్నా, స్వాతంత్రోద్యమంలో ఉన్నా, రాజకీయంగా ఉన్నత పదవులు నిర్వహించినా, రామకృష్ణారావు గారిలోని అనవరతం ద్యోతకమవుతూనే ఉంది. అధ్యయనం, సాహిత్య సృజన ఆయనకు నిత్య వ్యాపకాలు. వివిధ సందర్భాల్లో వివిధ భాషలలో వీరు రచించిన కవితలు, వ్యాసాలు, అనువాద రచనలే అందుకు సాక్ష్యాలు.
శ్రీ వేంకటేశ్వర సుప్రభాతం, శ్రీశృంగగిరి శారదాకృతి, శ్రీరామస్తవం, శ్రీనివాస పంచశతి కనకధారా స్థవము (1964), సౌందర్య లహరి (1962), జగన్నాథుని పండితారాజ పంచామృతం (1965)లను ప్రౌడశైలి పూరితమైన పద్యాలలో అనువదించి పండితుల ఆదరం పొందారు. భక్తి ప్రపత్తులతో పాటు వారి కవితా మాధుర్యాన్ని కూడా ఇవి వెదజల్లుతాయి.
“ఎంతటి రాజనీతిజ్ఞుడో అంతటి సాహితీవేత్త”
బహుముఖ ప్రజ్ఞాశాలిగా, న్యాయవాదిగా, మంత్రిగా, హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా, భూదానోద్యమ నేతగా, గ్రంథాలయోద్యమ పోషకుడుగా….. శ్రీ బూర్గుల రామకృష్ణారావుగారు చేసిన సేవలను తెలుసుకోవడానికి తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన “బహుముఖ ప్రజ్ఞాశాలి బూర్గుల” అనే పుస్తకాన్ని చదవండి
“ఓ సఖులార! వేడుకలు నుత్సవముల్ సలుపంగ గూడిన
న్మీ సఖుడైన నన్నొకని మిక్కిలి స్నేహముతో స్మరింపుడీ !
ఆసవపాన గోష్ఠులలొ యందఱతోడుత వంతు వచ్చినన్
నా సరకమ్ము వంచి స్మరణార్థము చిల్కుడి నా సమాధిపై . ” అని
“ఉమర్ ఖయ్యాం రుబాయీలు” అనే పుస్తకంలో వివరించారు. ఇలాంటి మరెన్నో రుబాయీల విశేషాలను తెలుసుకోవడానికి తెలంగాణ సాహిత్య అకాడమి ప్రచురించిన “ఉమర్ ఖయ్యాం రుబాయీలు” అనే పుస్తకాన్ని చదవండి
———–