రామ్ పెరుమాండ్ల (Ram Perumandla)

Share
పేరు (ఆంగ్లం)Ram Perumandla
పేరు (తెలుగు)రామ్ పెరుమాండ్ల
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2021/0
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలు
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికలోచన …!! (కవిత)
సంగ్రహ నమూనా రచనకాలం పరిచే దారుల్లో
వేసిన అడుగుల జాడలు
భాష్పిభవిస్తున్నాయి.

రామ్ పెరుమాండ్ల
లోచన …!! (కవిత)

కాలం పరిచే దారుల్లో
వేసిన అడుగుల జాడలు
భాష్పిభవిస్తున్నాయి.
ఎడారిలో విరిసిన వెన్నెలలు
చీకట్లను పులుముకున్నాయి.
ఉష్ణపు దాడుల్లో దహనమైన
ఆశల అడవులన్నీ
చిగురించే మేఘాల కోసం
తపిస్తున్నాయి .

ఎక్కడో ఓ ఖాళీకడుపు
అర్థనాధం చేస్తుంటే
చెవుల్లో మోగే సంగీతపు స్వరాలు
నిన్నటి కన్నీటి గాయాలకు మరుపుమందు రాస్తున్నాయి.

జీవితం కూడా
కాలపు వల కింద దాచిన గింజలకు
ఎపుడో దరఖాస్తు చేసుకుంటది.
మరిప్పుడు మరణవార్త
మరణమంత మాట కాదు.

నీకు గుర్తుండదు
భీకరవర్షంలో తడిసి వణికిన
కుక్కపిల్లను తరిమేశావో,
నీ మనసు వెంటిలేటర్లో కట్టిన
పిచ్చుక గూడును విసిరేశావో ,
ఏ పసివాని చిరునవ్వును
కర్కశంగా నిలిపివేశావో గానీ
నేడు మరణవార్త బోసిపోయింది.

ఏదో ఒక క్షణాన
నీలో నీవే
మరెన్నిసార్లు మరణించావో
తుదకు నీకు తెలియాల్సివుంది.

———–

You may also like...