| పేరు (ఆంగ్లం) | Kamala Sree |
| పేరు (తెలుగు) | కమలశ్రీ |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | https://www.neccheli.com/2021/05/%e0% |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | పేరు:- కమల ముక్కు, రహదారులు మరియు భవనాల శాఖలో జూనియర్ అసిస్టెంట్ గా 2013 నుంచి పనిచేస్తున్నాను. 2020 లాక్ డౌన్ సమయంలో ప్రతిలిపి లో రచనలు చదువుతూ రాయాలనే అభిలాష కలిగి రాయడం మొదలుపెట్టి దాదాపుగా 15 ధారావాహికలు, 30 పైగా కథలు, 300 పైగా కవితలు రచించాను. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | పరమాన్నం |
| సంగ్రహ నమూనా రచన | అర్థరాత్రి పన్నెండు దాటింది. మెయిన్ రోడ్డుపై ఓ కార్ శరవేగంగా వెళుతోంది. కారు డ్రైవ్ చేస్తున్న నలభై అయిదేళ్ళ రఘునందన్ కి ఎంత త్వరగా ఇల్లు చేరుతానా! అన్నట్టు ఉంది. పక్కనే ఉన్న సిటీ లో ఓ బిజినెస్ మీటింగ్ కి ఎటెండ్ అయ్యి రిటర్న్ అయ్యే సరికి కాస్త ఆలస్యం అయ్యింది. |
కమలశ్రీ
పరమాన్నం
అర్థరాత్రి పన్నెండు దాటింది. మెయిన్ రోడ్డుపై ఓ కార్ శరవేగంగా వెళుతోంది. కారు డ్రైవ్ చేస్తున్న నలభై అయిదేళ్ళ రఘునందన్ కి ఎంత త్వరగా ఇల్లు చేరుతానా! అన్నట్టు ఉంది. పక్కనే ఉన్న సిటీ లో ఓ బిజినెస్ మీటింగ్ కి ఎటెండ్ అయ్యి రిటర్న్ అయ్యే సరికి కాస్త ఆలస్యం అయ్యింది.
ఆ మీటింగ్ స్పాట్ తమ సిటీ కి దూరంగా ఉండటంతో అతనికి ఆకలి విపరీతంగా వేస్తుంది.
పోనీ కార్ లో ఏవైనా ఫ్రూట్స్ ఉన్నాయేమో చూశాడు. ఏమీ లేవు. జనరల్ గా ఇలాంటి మీటింగ్ లకు వెళితే ఫ్రూట్స్ కార్ లో పెట్టుకుంటాడు… ఇప్పుడు అవేవీ లేకపోవడంతో ఆకలికి తట్టుకోవడం అతని వల్ల కావడం లేదు.
ఎక్కడా ఆపకుండా ఏకధాటిగా కార్ ని డ్రైవ్ చేసిన అతను ఓ పది నిమిషాల తర్వాత కార్ ఆపుదామనే లోపే కార్ ఆగి పోయింది. కార్ బోనెట్ తెరిచి చూశాడు. సమస్య ఏంటో అర్థం కావడం లేదు.
‘అసలే ఆకలి చంపుతుంటే ఈ కార్ ఇప్పుడే ట్రబుల్ ఇవ్వాలా?’ అనుకుంటూ.
‘ఆ రాత్రికి అందులోనే జాగారం’ అనుకుంటూ కార్ ఎక్కబోతున్న అతనికి “ఎవరు బాబూ మీరూ.. ఈ సమయం లో ఇక్కడ కారు ఆపారు?.” అంటూ ఓ ముసలాయన మాటలు వినిపించాయి.
“అదీ పెద్దాయనా నా కార్ సడెన్ గా ఆగిపోయింది. ఏం జరిగిందో ఏంటో అర్థం కావడం లేదు?.” అని సమాధానం ఇచ్చాడు రఘునందన్.
“అయ్యో! బాబూ ఈ టైం లో మెకానిక్ లూ ఎవరుండరు. ఈ పూటకి మా ఇంట్లో ఉండి రేపు ఉదయాన్నే ఎవరైనా మెకానిక్ ని తీసుకుని వచ్చి కార్ బాగు చేయించుకుని వెళ్లిపోదురు.” అన్నాడు ఆ ముసలాయన.
కాసేపు తటపటాయించి సరే అని ఆ ముసలాయన్ని అనుసరించాడు రఘునందన్.
“పార్వతీ… పార్వతీ..” అంటూ పిలుస్తూ ఆ పూరింట్లోకి అడుగుపెట్టాడు అతను.ఆ ముసలాయన్నే అనుసరిస్తూ వెళ్లిన రఘునందన్ ఆ పూరింట్లో అడుగుపెట్టగానే ఆశ్చర్యంగా ఉండిపోయాడు. ఎక్కడి సామాన్లు అక్కడ పొందికగా అమర్చి ఉన్నాయి.
ఓ ముసలామే బయటకు వచ్చింది నడుం వంచుతూ నడుచుకుని.
“బాబూ దీనిపై పడుకోండి.” అంటూ ఓ నులక మంచం తెచ్చాడు ఆ ముసలామె వచ్చిన గదిలోనుంచి( ఆ పూరింట్లోనే గదులుగా చేసుకున్నారు) రఘునందన్ దానిపై కూర్చోగానే ఆ ముసలామె ఓ చిన్న పళ్లెం లో అన్నం, చారు, పచ్చడి పట్టుకుని వచ్చి “బాబూ ఈ రాత్రి పూట ఏదైనా తిన్నావో లేదో. ఈ అన్నం తిను.” అంటూ ఓ పళ్లెం అందించింది.
అది అందుకున్న రఘునందన్ కాసేపు ఆలోచించినా ఆకలికి ఆగలేక నోట్లో ఓ ముద్ద పెట్టుకున్నాడు. చారన్నం అయినా పరమాన్నం లా అనిపించి ఆ పళ్లెంలోని అన్నం మొత్తం అరనిమిషం లో తినేసి తలపైకెత్తే సరికి ఆమె ఓ చిన్న గ్లాసుతో మజ్జిగ అందించింది.అది తాగిన రఘునందన్ ఆ మంచంపై నే పడుకున్నాడు.
పొద్దున్న లేచి చూసే సరికి ఆ ముసలాయన కనపడలేదు. ముసలామె బయట ఏదో పని చేసుకుంటుంది.
“అమ్మా! పెద్దయ్య ఎక్కడా?” అని అడిగితే “నీ కారు బాగు చేయించడానికి మెకానిక్ ని తీసుకు రావడానికి పట్నం పోయినాడు సైకిల్ తో.” అంటూ సమాధానం ఇచ్చింది.
ఆమె కి వెళ్తానని చెప్పి కారు దగ్గరికి వెళ్లేసరికి మెకానిక్ కార్ ని రెఢీ చేశాడు.
“బాబూ కారు బాగయ్యింది.” అన్నాడా ముసలాయన.
“థాంక్యూ పెద్దయ్యా! మీ మేలు మరువలేను.ఇదిగో ఇది ఉంచండి.” అంటూ కొంత మొత్తం అందించాడు రఘునందన్.
అవి రఘునందన్ చేతిలోనే పెట్టేసి “బాబూ ఈ లోకంలో అన్నీ డబ్బుతో ముడిపడవు.ఓ మనిషి గా సహాయం చేశాను. నీకు సహాయం చేయాలనిపిస్తే ఆకలితో ఉన్నవారికి ఇవ్వు.” అంటూ వెళ్లిపోయాడాయన.
అతని వైపే చూస్తూ కార్ ఎక్కిన రఘునందన్ తన కార్ ని ఓ అనాధాశ్రమం వైపు పోనిచ్చాడు..
———–