డా. నల్లపనేని విజయలక్ష్మి. (Nallapaneni Vijayalakshmi)

Share
పేరు (ఆంగ్లం)Nallapaneni Vijayalakshmi
పేరు (తెలుగు)డా. నల్లపనేని విజయలక్ష్మి.
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2021/02/%e0
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుడా. నల్లపనేని విజయలక్ష్మి ప్రభుత్వ మహిళా కళాశాల, గుంటూరు లో తెలుగు విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. వీరి కవితలు, వ్యాసాలు వివిధ పత్రికలలో ప్రచురింపబడ్డాయి.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికప్రేమ (కవిత)
సంగ్రహ నమూనా రచనప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా

ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు

తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె

ఏదైనా చేయగలగడమంటే…………

డా. నల్లపనేని విజయలక్ష్మి.
ప్రేమ (కవిత)

ప్రేమంటే ఏమిటి? అడిగిందో ప్రేయసిగా
ఎదుటివారి కోసం ఏదైనా చేయగలగడం – చెప్పాడతడు
తన సర్వస్వాన్ని సమర్పించడానికి సిద్ధపడిందామె
ఏదైనా చేయగలగడమంటే
కోట్లు వెచ్చించి కొనుక్కోగలగడం
తత్వబోధ చేసి తాపీగా వెళ్ళిపోయాడతడు
ప్రేమంటే ఏమిటి? అడిగిందో భార్యగా
బాధ్యతగా బ్రతకడమే- బదులిచ్చాడతడు
విరామమే మరిచి
అతడి విలాసానికి వెలుగై నిలిచిందామె
కళాత్మకత తెలియని కఠిన శిలవంటూ
సరస సల్లాపాల డోలలాడించగల
మోహిని ముందు మోకరిల్లాడతడు
ప్రేమంటే ఏమిటి? అడిగిందో తల్లిగా
రక్త మాంసాలను ధారపోయడమే- బదులిచ్చాడతడు
జీవితాన్నే ధారపోసిందామె
రెక్కలొచ్చిన పక్షి
తన గూటిని వెతుక్కుంది
మీలో ఎవరైనా నన్ను ప్రేమించగలరా? అడిగిందామె
అది అన్ కండీషనల్
ప్రేమించడమే నీ వంతు
సమాధానమిచ్చారు ముగ్గురూ!
https://www.neccheli.com/2021/02/%e0%b0%aa%e0%b1%8d%e0%b0%b0%e0%b1%87%e0%b0%ae-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/

———–

You may also like...