| పేరు (ఆంగ్లం) | Sudha Murali |
| పేరు (తెలుగు) | సుధామురళి |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | https://www.neccheli.com/2021/06/%e0%b0%95 |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | నా కలం పేరు సుధామురళి. అలాగే చిరపరిచితురాలిని. కథలూ, వ్యాసాలూ, కవితలు రాయడం, చదవడం ఇష్టం. వృత్తి మాథ్స్ లెక్చరర్. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | కుమ్మరి పురుగు (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | పరపరాగ సంపర్కం ‘నా’ లోనుంచి ‘నా’ లోలోనికి అక్కడెక్కడా….. |
సుధామురళి
కుమ్మరి పురుగు (కవిత)
పరపరాగ సంపర్కం
‘నా’ లోనుంచి ‘నా’ లోలోనికి
అక్కడెక్కడా…..
గడ్డ కట్టించే చలుల వలయాలు లేవు
వేదనలు దూరని శీతల గాడ్పుల ఓదార్పులు తప్ప
ఆవిరౌతున్న స్వప్నాల వెచ్చటి ఆనవాళ్లు లేవు
మారని ఋతు ఆవరణాల ఏమార్పులు తప్ప
అవునూ కాదుల సందిగ్దావస్థల సాహచర్యం లేదు
నిశ్చితాభిప్రాయాల నిలువుగీతలు తప్ప
ఏ అచేతనత్వపు నీడలూ కానరావు
నిశిని ఎరుగని చీకటి వెలుగులు తప్ప
ఏ ఏ మౌనభాష్యాల వెక్కిరింతలూ పలకరించవు
నివురుగప్పిన నిశ్శబ్దపు స్పర్శ తప్ప
ఏ ఏ ఏ కార్యాకారణ సచేతన ఫలితాలూ ప్రకటించబడవు
ధైర్యపు దూరత్వ భారత్వం తప్ప
అందుకే….
పరపరాగ సంపర్కం
నాలోనుంచి
నా……లోలోనికి…..
https://www.neccheli.com/2021/06/%e0%b0%95%e0%b1%81%e0%b0%ae%e0%b1%8d%e0%b0%ae%e0%b0%b0%e0%b0%bf-%e0%b0%aa%e0%b1%81%e0%b0%b0%e0%b1%81%e0%b0%97%e0%b1%81-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/
———–