| పేరు (ఆంగ్లం) | Nallella Rajaiah |
| పేరు (తెలుగు) | నల్లెల్ల రాజయ్య |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | నల్లెల్ల రాజయ్య విశ్రాంత ఉపాధ్యాయులు. వరంగల్ లో నివాసం ఉంటున్నారు. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | ఉరితాళ్ళే గతాయే (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | అహో ! నా పాలక వర్గమా మా కడుపులు నింపే అన్నదాతని అందలమెక్కించి అంగలారుస్తూ చొంగ కారుస్తవ్ ! |
నల్లెల్ల రాజయ్య
ఉరితాళ్ళే గతాయే (కవిత)
అహో ! నా పాలక వర్గమా
మా కడుపులు నింపే
అన్నదాతని అందలమెక్కించి
అంగలారుస్తూ చొంగ కారుస్తవ్ !
దేశానికే ఎన్నెముకలు.
నా రైతన్నలని అదేపనిగా
అంటుంటవ్ !
కని మీ మనసు నిండా
అన్నదాతల ఎన్నెముకల్లోని
మూలుగను సైతం లేకుండా
పీల్చుకతినే నయవంచక
ఎవ్వారం నీది.
నీ మాటల్లో మర్మముంటది
చేతల్లో చెప్పలేనంత
సత్తెన నాశన కార్యాలు
జరిపిస్తుంటవ్ !
గిట్టుబాటు ధరలివ్వని
గిదేం రాజ్యమనీ
ఆగ్రహించిన అన్నదాత
ఆక్రోషిస్తే చేతుల్లకు సంకెళ్ళెస్తవ్
కాదు లేదు పొమ్మంటే కాల్చిపారేస్తుంటవ్ !
ఇగ జూడు ఎవుసాయంల
ఎవ్వల్జేయన్ని ఎక్కడ లేనన్ని
అవ్వల్దర్జ సంస్కరణలూ
సట్టుబండలు చేస్తున్నామని
చాటింపేసుకుంటా
కార్పోరేట్ కంపిన్లకు
కట్టుబానిసవై
అన్నదాతను అగచాట్ల పాల్జేస్తవ్ !
నూతన ఎవుసాయ బిల్లులని
అందినంత అంగబలముందని
ఆమోద ముద్రలేసుకుని
పెట్టుబడిదార్లకే పెద్ద పీటలేస్తవ్
ఆరుగాలం శ్రమించే
అన్నదాతకు అలవికాని దగాజేస్తవ్ !
బహుళజాతి కంపిండ్ల
బద్మాషీగిరిక బాంచెన్ గిరీ
చేసుడు నీ కలవాటైపాయే
అన్నిట్లో ఆగమై
ఎటూపాలుపోని
నా అన్నదాతకు
ఉరితాళ్ళే గతాయే.
https://www.neccheli.com/2021/01/%e0%b0%89%e0%b0%b0%e0%b0%bf%e0%b0%a4%e0%b0%be%e0%b0%b3%e0%b1%8d%e0%b0%b3%e0%b1%87-%e0%b0%97%e0%b0%a4%e0%b0%be%e0%b0%af%e0%b1%87-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/
———–