| పేరు (ఆంగ్లం) | I. chidanandam |
| పేరు (తెలుగు) | ఐ.చిదానందం |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | https://www.neccheli.com/2020/09/%e0%b0%a6 |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | ఐ.చిదానందం తెలుగు భాషోపాధ్యాయులు, తెలుగు రీసెర్చి స్కాలర్. నివాసం హైదరాబాద్. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | దుఃఖ మోహనం (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | నీవెప్పుడు ఏడవాలనుకున్నా నిస్సంకోచంగా ఏడ్చేయ్ దుఃఖాన్ని వర్షపు నీటిలో తడిపేయ్ కానీ మద్యంలో తేలనీయకు |
దుఃఖ మోహనం
నీవెప్పుడు ఏడవాలనుకున్నా
నిస్సంకోచంగా ఏడ్చేయ్
దుఃఖాన్ని వర్షపు నీటిలో తడిపేయ్
కానీ మద్యంలో తేలనీయకు
ఏడ్వలనిపించినప్పుడల్లా ఏడ్చేయ్
కానీ ఈ లోకానికి దూరంగా వెళ్లి ఏడ్వు
ప్రతి దుఃఖాన్ని వెలకట్టే ఈ దుష్టప్రపంచం
నీ గొంతుతో ఎప్పటికీ గొంతు కలపదు
ఈ లోకం మాటలు ఒట్టి ఓదార్పులు
నీ హృదయంలో సంతోషం
మొలిచే వరకు ఏడ్వు
నీ గుండె లో ఆవేదన తొలిగే వరకు ఏడ్వు
నీ బాధను చూసి ఎప్పుడైతే
ఈ లోకం తృప్తిగా దుఃఖిస్తుందో
అప్పుడే నువ్వు నీ నవ్వు ప్రారంభించు
అన్నింటికీ శక్తిని ఇచ్చేది దుఃఖమే
దుఃఖాన్ని ఎందుకు దాచుకుంటారు
దుఃఖానంతరమే జీవనం ప్రశాంతం
దుఃఖమెప్పుడు శాశ్వతం కాదు
దుఃఖాన్ని కొత్తగా నింపితేనే
దుఃఖానంతర జీవనం విశ్వమోహనం
https://www.neccheli.com/2020/09/%e0%b0%a6%e0%b1%81%e0%b0%83%e0%b0%96-%e0%b0%ae%e0%b1%8b%e0%b0%b9%e0%b0%a8%e0%b0%82-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/
———–