నాగజ్యోతిశేఖర్ (Nagajyothisekhar)

Share
పేరు (ఆంగ్లం)D.Nagajyothisekhar
పేరు (తెలుగు)నాగజ్యోతిశేఖర్
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరు
విద్యార్హతలు
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2021/09/%e0%b0%b5%e
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలునాగజ్యోతిశేఖర్ వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు. అనేక కవితలూ, కథలూ వివిధ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. వీరి నివాసం మురమళ్ల, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికవదిలొచ్చేయ్… (కవిత)
సంగ్రహ నమూనా రచనరాతిరి దుప్పట్లో విరిగిన స్వప్నాలని ఎత్తి పారబోసి
గుండెదోసిలిని ఖాళీ చేయాలని ….

నాగజ్యోతిశేఖర్
వదిలొచ్చేయ్… (కవిత)

రాతిరి దుప్పట్లో విరిగిన స్వప్నాలని ఎత్తి పారబోసి
గుండెదోసిలిని ఖాళీ చేయాలని ….

దుఃఖపు వాకిట్లో
కూలబడిన నిన్నటి ఆశల ముగ్గుని
హత్తుకొని ఓ కొత్త వర్ణాన్ని అద్దాలని….

పెరట్లో పాతిన బాల్యపుబొమ్మని వెలికి తీసి
పచ్చని కలల్ని పూయాలని…

వంటింటి కొక్కేనికి గుచ్చిన
ఆత్మనోసారి తిరిగి గాయపు దేహంలో కి ఆహ్వానించాలని…

తెగిన నక్షత్రపువాక్యాలని
పదం పదంగా కూర్చుకొని
నీదైన కవితొకటి రాయాలని….
వసి వాడని పూల ఋతువొకటి ఆలింగనం చేసుకొని
రాలిన గతాలని సమాధి చేయాలని….
ఎంతగా తపించావో
నాకు తెలుసు!
మరెంతగా దుఃఖించావో
అదీ తెలుసు!

నువ్వొస్తావని…
నువ్వుగా వస్తావని
ఎన్ని రాత్రుల్ని హత్య చేసి
ఉదయాలకు ఊపిరిపోసానో….
ఎన్ని శిశిరాలను సవాలు చేసి
వసంతాలను మూటగట్టానో….!

ఏదీ నువ్వొస్తేగా….

ఆ పురాతన గోడ సందుల్లో నుండి నీ పాదాలను ఎంతకీ
బయటకు తీయవే…??!
నీదైన కలలపావురమొకటీ
ఆ మూసిన తలుపుల్లోంచి ఎగురేయవే…??
కనీసం నీ పేరునైనా ఆ ఇంటి చూరుపై జెండాగా నిలబెట్టవే…??

గట్టిగా నిలదీస్తే…..
కన్నీటి నదివౌతావు!
బంధాల సాలిగూడెలో బందీనంటావు!
ఇంకొన్ని బాధ్యతల బరువే ఉందంటావు!
రేపంతా నీదేనంటావు!
అదెప్పటికీ రాదని నీకూ,నాకూ తెలుసు!

ఇవన్నీ వదిలేసి రా!
అని గుండె గొంతుక చీల్చుకు అరుస్తూనే ఉంటాను!
కానీ నువ్వొస్తేగా…!

నీవు లేక ఈ జగతి లేదని నీకూ తెలుసు…
ఏ ఇల్లూ నడవదని అందరికీ తెలుసు…
కానీ నీకేం కావాలో ఎవరికి తెలుసు….
తెలిసిన నాకైనా నువ్వో స్వేచ్చా గీతమై వినిపిస్తే బావుండు…!

నువ్వు నవ్వై విరియాలంటే….
ఈ లోకం అహాన్ని వదిలేయాలి!
అమ్మతనాన్నే చూడడం విధి చేయాలి!
అసమానత్వాన్ని వెలి వేయాలి!
అది నెరవేరని స్వప్నం!

అందుకే
ఉపేక్ష తగదు!
నీ సాధికార స్వరాన్ని ఇకనైనా అప్రతిహతంగా వినిపించేందుకు
ఇప్పుడైనా అబలత్వాన్ని వదిలి వచ్చేయ్ నేస్తం…
బానిసత్వాన్ని విదిల్చి కొట్టి ఆదిశక్తివై కదిలి వచ్చేయ్ నేస్తం …!

———–

You may also like...