| పేరు (ఆంగ్లం) | Ramu |
| పేరు (తెలుగు) | రాము |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | – |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | నా పేరు పేర్ల రాము. మా ఊరు వి.యస్.లక్ష్మీపురం జి,మం మహబూబాబాద్. ప్రస్తుతం నేను ఎస్.ఆర్.అండ్.బి.జి.ఎన్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఖమ్మం లో చివరి సెమిస్టర్ చదువుతున్నాను. ఒక మనిషిగా మనుషుల్ని బాగుచేసుకోవాల్సిన అవసరం ఉంది . కాబట్టి ఆ దారిలో కవిత్వం నన్ను నడిపిస్తూ ఉంది.నేను నడుస్తూ ఉన్నాను. నాలో మేదిలే అనేక సంఘటల్ని కవిత్వంగా రాసే ప్రయత్నం చేస్తుంటాను. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | ఎవర్ని నిలదీసి అడగాలో అర్థం కావట్లేదు సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు |
రాము
వాట్ ఏ రేపిస్ట్ డ్రామా (కవిత)
ఎవర్ని నిలదీసి
అడగాలో అర్థం కావట్లేదు
సీతాకోకల్లా ఎగరాల్సిన వాళ్ళు
ప్రాణం లేని నగ్నదేహాలతో కుప్పకూలుతున్నారు
పావురాల్లా పరుగులు పెట్టాల్సిన వాళ్ళు
కాలం కంచెల్లో బలైపోతున్నారు.
నడిరోడ్డు మీద నగ్నదేహాల్ని
కలకంటున్న కళ్ళకి వయస్సుతో పనేముంది??
మొలకల్ని ,చెట్లను వేటినైన నరుక్కోవచ్చు .
కావాల్సినప్పుడల్లా న్యూడ్ వెబ్సైట్స్ ఓపెన్
సౌకర్యం పుట్టాక నేర్పేపనే ముంది??
వాడుకోవొచ్చు ,చంపేయొచ్చు
అనే ఒక లోపలి నినాదానికి స్వేచ్ఛ
చాలానే ఉందిగా.
అయ్యా మీరేం బాధని మోయకండి
కన్నీళ్ళను ఆగం చేసుకోకండి
ఏ సోషల్ మీడియాల్లోనే
పోస్టులు రాయకండి
అప్పుడెప్పటి నుండో మొదలుకొని
ఇప్పటి కొత్తగూడెం
దేవిక దాకా ఎప్పటిలాగే జరుగుతుంది.
నా భయమంతా
దుమ్మెత్తిపోస్తూ
ఏడుస్తున్న తల్లీ కన్నీళ్ళకి
నా దగ్గర సమాధానం లేనేలేదని.
లోపలగుండెను పగలగొట్టుకొని దుఃఖిస్తున్న
తండ్రీ పచ్చినొప్పులకి మందు వేతకలేకపోతున్ననని.
ఎన్నేన్ని
రకాల కేసులొచ్చాయి
ఎన్నేన్ని
రకాల చట్టాలొచ్చాయి
అయిన ఈ కథకి ముగింపే లేకపాయే.
ఎన్ని పేజీల గ్రంథంమో కదా
ఈ కామాంధుల కళ్ళలో రాయబడిన జీవితాలు
ఎన్ని సముద్రాల బాధనో కదూ
ఈ దేశంకళ్ళలో నుండి పుట్టినదుఃఖం.
మీరు
ఈ గుండె బాధపడ్డప్పుడల్లా వొచ్చే
ఈ అక్షరాలనీ మాత్రమే చదవండి
నాలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది
నడుస్తున్న రేపిస్ట్ నాటకంలో
బలికావాల్సిన వాళ్ళమే కదా!!.
———–