గిరి ప్రసాద్ చెల మల్లు (Chelamallu Giriprasad)

Share
పేరు (ఆంగ్లం)chelamallu giriprasad
పేరు (తెలుగు)గిరి ప్రసాద్ చెల మల్లు
కలం పేరు
తల్లిపేరు
తండ్రి పేరు
జీవిత భాగస్వామి పేరు
పుట్టినతేదీ
మరణం
పుట్టిన ఊరుసూర్యాపేట
విద్యార్హతలుపోస్ట్ గ్రాడ్యుయేట్
వృత్తి
తెలిసిన ఇతర భాషలు
చిరునామా
ఈ-మెయిల్
ఫోను
వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె
స్వీయ రచనలు
ఇతర రచనలుhttps://www.neccheli.com/2021/02/%e0%b0%a8%e
ఈ-పుస్తకాల వివరాలు
పొందిన బిరుదులు / అవార్డులు
ఇతర వివరాలుపుట్టింది సూర్యాపేట. పెరిగింది నాగార్జున సాగర్. నాన్న గారి నుండి వామపక్ష భావజాలం పొందాను. విద్యార్థి దశలో ఎస్. ఎఫ్. ఐ. లో పని చేసాను. చదువు ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అండ్ మేనేజ్ మెంట్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్. సామాజిక ఆర్థిక సమస్యలను కవితా వస్తువులు గా తీసుకుని కవితలు వ్రాస్తున్నాను. ప్రేమ కవితల్లో కూడా ప్రవేశం. కవితలు వివిధ దిన వార మాస వెబ్ పత్రికల్లో ప్రచురితం.
స్ఫూర్తి
నమూనా రచన శీర్షికనైజం (కవిత)
సంగ్రహ నమూనా రచనఅమ్మున్నంత కాలం
ఎగబడ్డాయి పక్షులు
అమ్మ పోయింది
పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి

గిరి ప్రసాద్ చెలమల్లు
నైజం (కవిత)

అమ్మున్నంత కాలం
ఎగబడ్డాయి పక్షులు
అమ్మ పోయింది
పక్షులు మరోవైపుకి మరలిపోతున్నాయి

అమ్మ వున్నప్పుడు
ఎంగిలిచేతిని విదిలించని
ఇళ్ళపై వాలుతున్న పక్షులు
విదిలిస్తారని ఆశతో
ఈసడించిన చేతులవైపు

అమ్మ పోపుగింజల్లో డబ్బు సైతం
ముక్కున కర్సుకుపోయిన పక్షులు
మరోవైపు

అమ్మ చేతి వంట
తిన్న పక్షులు
మర్చి మరబొమ్మల్లా
తారాడుతున్నాయి

బెల్లమున్నప్పుడే ఈగలు
అమ్మ చెబుతుండేదెప్పుడూ
కాని అమ్మే గుర్తెరగలేదనేది
నేడు కన్పిస్తుంది కళ్ళముందు

గూటిపక్షులు
వలస పక్షులు
అన్నీ అవే కోవలో
ఇసుమంతైనా తేడా లేదు సుమీ !

ముసిముసినవ్వుల వెనుక
దాగిన మర్మం విషం
గడపలో ఓ కుక్క విశ్వాసంగా
అప్పుడూ ఇప్పుడూ
https://www.neccheli.com/2021/02/%e0%b0%a8%e0%b1%88%e0%b0%9c%e0%b0%82-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/

———–

You may also like...