| పేరు (ఆంగ్లం) | Jayasri Muvva |
| పేరు (తెలుగు) | జయశ్రీ మువ్వా |
| కలం పేరు | – |
| తల్లిపేరు | – |
| తండ్రి పేరు | – |
| జీవిత భాగస్వామి పేరు | – |
| పుట్టినతేదీ | – |
| మరణం | – |
| పుట్టిన ఊరు | – |
| విద్యార్హతలు | – |
| వృత్తి | – |
| తెలిసిన ఇతర భాషలు | – |
| చిరునామా | – |
| ఈ-మెయిల్ | – |
| ఫోను | – |
| వెబ్ సైటు / బ్లాగు పేరు, లంకె | – |
| స్వీయ రచనలు | – |
| ఇతర రచనలు | https://www.neccheli.com/2020/05/%e0%b0% |
| ఈ-పుస్తకాల వివరాలు | – |
| పొందిన బిరుదులు / అవార్డులు | – |
| ఇతర వివరాలు | నా నివాసం ఖమ్మం, తెలంగాణ. ఇపుడిపుడే కవిత్వం రాస్తున్నాను. చిన్నాన్న క్రాంతి శ్రీనివాసరావు గారు అందరికీ సుపరిచితమైన కవి. ఆయన నుంచి ప్రేరణ, స్వతహాగా కొంత తపన ఈ వైపు అడుగేసేలా చేసింది. నాకు పుస్తకాలు చదవడం, కొత్త ప్రదేశాలు చూడటం, కొత్తగా ఏదైనా నేర్చుకోవడం ఇష్టం. సంగీతం బాగా వింటాను. స్నేహితుల సాయంతో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాను. ప్రస్తుతం గృహిణిగా వున్నాను. |
| స్ఫూర్తి | – |
| నమూనా రచన శీర్షిక | మైల (కవిత) |
| సంగ్రహ నమూనా రచన | మాకొద్దీ ఆడతనం అనుక్షణం అస్థిత్వం కోసం మాకీ అగచాట్లెందుకు..?? |
జయశ్రీ మువ్వా
మైల (కవిత)
మాకొద్దీ ఆడతనం
అనుక్షణం అస్థిత్వం కోసం
మాకీ అగచాట్లెందుకు..??
పిచ్చికుక్క సమాజం పచ్చబొట్టేసూకూర్చుంది
అణుక్షణం అణువణువూ తడుముతూ వేధిస్తూనే ఉంది..
ఆకలి కోరలకి అమ్మతనాన్ని అమ్ముకున్నాం
ఆబగా వచ్చే మగడికై ఆలితనాన్ని తాకట్టుపెట్టాం ..
చివరికి మూడు రోజుల ముట్టు నెత్తుటి పుట్టుకకి
ఇప్పుడు బతుకంతా మడికట్టా??
సమాజమా…సిగ్గుపడు… !!
అలవాటుపడ్డ ప్రాణలే
సిగ్గుకి ముగ్గుకి తలొంచుకున్నాం
ఇక చాలు
ఓ ఆడతనమా మరీ ఇంత సహనమా
తాతమ్మ ,బామ్మ అంటు అంటూ నెట్టినా
పాత చీర ముక్కైన అమ్మతనం
ఏ మూలనో
ఎన్ని అగ్ని పర్వతాల లావా ని దాచిందో
బట్టకట్టని రోజులే నయం
సిగ్గు తలెత్తుకు తిగిగింది
నాగరికత చుట్టుకున్న
అవమాన కట్టు మోతబరువై
మెలతాడు తెంపుకు తిరుగుతోంది
నేలపై రాలినపుడు
తొమ్మిది నెలల రక్తపు పొత్తిలి నీవు
అదే రుధిరపు రంగు ఇప్పుడు మైలా??
ఆ నెత్తురే రూపు మార్చి
చనుబాలు పట్టిన పాపం మాదే..!
ఇంకా ఏం చూస్తావు పుట్టుకని చూసే..
ధైర్యం పాలు తాగి రా
అమ్మ రొమ్ము గుద్ది అడుగు
అరువిస్తుంది ఎంతైనా ఆడది కదా..!
నిశ్శబ్ధాన్ని ఇక బద్ధలుకొట్టేద్దాం
ఆరు ఒుుతువులు చూపిన కాలమా
ఇక నుంచి నెల నెలా స్రవించే
ఈ ఏడో ఒుుతువు
ఎరుపు రంగు పోటెత్తే లోపే
ఒప్పుకో…
https://www.neccheli.com/2020/05/%e0%b0%ae%e0%b1%88%e0%b0%b2-%e0%b0%95%e0%b0%b5%e0%b0%bf%e0%b0%a4/
———–